సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం పెద్ద పోలేరు గ్రామంలో కింగ్ కోబ్రా కలకలం రేపింది. గత రాత్రి ఓ బైక్‌లోకి చొరబడిన కోబ్రాను స్నేక్ క్యాచర్ సాయంతో పట్టుకున్నారు. అనంతరం కింగ్ కోబ్రాను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా 15 అడుగుల పొడవున్న కోబ్రా జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు కోబ్రాను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పాముతో పోరాటం...!
యజమానిని రక్షించి శునకం మరణం
చెన్నై : ఇంట్లోకి వచ్చిన పాముతో పోరాడి ఓ శునకం మరణించింది. తమను రక్షించిన పెంపుడు జంతువు మృతి చెందడం ఆ యజమాని కుటుంబాన్ని తీవ్ర వేదనలో పడేసింది. తంజావూరు ఈబి కాలనికి చెందిన ఎలిల్ మారన్(58), మాల దంపతులు రియో, స్వీటీ అనే రెండు శునకాల్ని పెంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి ఆ ఇంట్లోకి ఓ పాము చొరబడింది. దీనిని గుర్తించిన రియో ఆ పాముతో పోరాటం చేసింది.
ఆ పామును రెండు ముక్కలు చేసి హతమార్చి, తాను మరణించింది. గురువారం ఉదయాన్నే రియో మరణించి ఉండటాన్ని చూసిన యజమాని ఆందోళన చెందాడు. కూత వేటు దూరంలో పాము రెండు ముక్కలుగా పడి మరణించి ఉండటంతో తమను రక్షించి రియో ప్రాణాలు విడిచినట్టు భావించి తీవ్ర మనో వేదనలో పడ్డారు. ఇంటి వద్దే ఆ శునకాన్ని పాతి పెట్టారు.రియో మరణంతో అన్నాహారాల్ని మానేసిన స్వీటి పాతి పెట్టిన ప్రాంతం వద్దే పడుకుని రోదిస్తుండటం ఆ పరిసర వాసుల్ని కలచి వేస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment