ఇరాక్లో కేరళ నర్సులకు విముక్తి, రేపు కోచికి | Indian nurses freed in Iraq, to reach Kerala Saturday | Sakshi
Sakshi News home page

ఇరాక్లో కేరళ నర్సులకు విముక్తి, రేపు కోచికి

Published Fri, Jul 4 2014 3:34 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

Indian nurses freed in Iraq, to reach Kerala Saturday

తిరువనంతపురం: ఇరాక్లో ఉగ్రవాదుల చెరలో ఉన్న 46 మంది కేరళ నర్సులను శుక్రవారం విడుదల చేశారు. వీరిందరని శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో కేరళకు తీసుకురానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రకటించారు.

'నర్సులందరూ క్షేమంగా ఉన్నారు. వారిని బస్సులో ఇరాక్లోని ఎర్బిల్ నగరానికి తీసుకువస్తారు. వారిని తీసుకువచ్చేందుకు శుక్రవారం సాయంత్రం ఎయిర్ ఇండియా విమానాన్ని ఎర్బిల్కు పంపనున్నారు. ఇందులో కేంద్ర, కేరళ అధికారులు వెళ్లారు. ఎర్బిల్ నుంచి ఈ విమానం ద్వారా నర్సులను కేరళకు తీసుకువస్తారు. శనివారం ఉదయం 7 గంటలకు విమానం కోచికి చేరుకుంటుంది' అని ఉమెన్ చాందీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement