Sadhvi Pragya Thakur
-
‘టికెట్ కోరటం లేదు..’ ప్రజ్ఞా ఠాకూర్ స్పందన
బీజేపీ తొలి జాబితాలో 33 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కకుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. దానికి నిదర్శనమే తొలిజాబితా. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన వారికి బీజేపీ ఈసారి మొండి చేయి చూపింది. అటువంటి వారిలో ఒకరు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్. ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాన్ని అలోక్ శర్మకు కేటాయించింది. అయితే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ టికెట్ రాకపోవటానికి కారణమని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ తనకు బీజేపీ టికెట్ కేటాయించకపోవటంపై స్పందించారు. ‘గతంలో నేను టికెట్ కోరలేదు.. ఇప్పడూ కూడా నేను లోక్‌సభ టికెట్ కోరటం లేదు. గతంలోనే నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రధాని మోదీకి నచ్చలేదు. నా వ్యాఖ్యలపై ప్రధాని.. నేను ఎప్పటికీ పూర్తి స్థాయిలో క్షమించబడనని అన్నారు. ఏదేమైనా నేను క్షమాపణలు కూడా చెప్పాను’ అని సాధ్వీ ఆదివారం మీడియాకు వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్‌పై 3,64, 822 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక.. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌పై గతంలో అనేక వివాదాలున్నాయి. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు, నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని వ్యాఖ్యానించటం, 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఇలా సాధ్వీ సున్నితమైన అంశాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కమలం పెద్దలకు ఆగ్రహం తెప్పించిదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
Viral: కబడ్డీ ఆడిన బీజేపీ మహిళా ఎంపీ
భోపాల్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సరదాగా కబడ్డీ ఆడారు. ఆమె కబడ్డీ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం ఆమె భోపాల్‌లోని ఓ కాళీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె యువతుల కబడ్డీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీని మహిళా క్రీడాకారులు కబడ్డీ ఆడాల్సిందిగా కోరారు. దీంతో ఆమె కొర్టులోకి అడుగుపెట్టి కబడ్డీ ఆడారు. ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చారు. 2008 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలో చోటు చేసుకున్న పేలుళ్లలో ఎంపీ సాధ్వి నిందితురాలు ఉన్న విషయం తెలిసిందే. कल गरबा आज भोपाल सांसद @SadhviPragya_MP आज मां काली के दर्शन के लिए पहुंचीं,वहां ग्राउंड में मौजूद खिलाड़ियों के अनुरोध पर महिला खिलाड़ियों के साथ कबड्डी खेली।😊 pic.twitter.com/X1wWOg55aW — Anurag Dwary (@Anurag_Dwary) October 13, 2021 -
‘డ్యాన్స్ చేయొచ్చు.. కానీ ఆస్పత్రికి వెళ్లి టీకా వేయించుకోలేరా’
భోపాల్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రగ్యా ఠాకూర్ ఇంటి దగ్గర వ్యాక్సిన్ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. డ్యాన్స్ చేయడానికి ఓపిక ఉంటుంది కానీ ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోలేరా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆ వివరాలు.. తాజాగా రెండు మూడు రోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ప్రగ్యా ఠాకూర్ తన నివాసంలో వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిసింది. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక నియమం కింద ప్రగ్యా ఠాకూర్ తన నివాసంలోనే వ్యాక్సిన్ వేయించుకున్నట్లు రాష్ట్ర పాలన అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇమ్యూనైజేషన్ అధికారి సంతోష్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘పాలసీ ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. ఈ నియమం ప్రకారం ప్రగ్యా ఠాకూర్ నివాసానికి వెళ్లి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేశాం. అంతేకానీ మేం నియమాలను ఉల్లంఘించలేదు’’ అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ‘‘మన భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కొద్ది రోజుల క్రితమే బాస్కెట్ బాల్ ఆడారు.. ఆమె నివాసంలో జరిగిన ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేశారు. కానీ వ్యాక్సిన్ మాత్రం ఇంటి దగ్గరే వేయించుకున్నారు. ప్రధాని మోదీ నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు ప్రతి బీజేపీ నేత ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు.. ప్రగ్యా ఠాకూర్ తప్ప. డ్యాన్స్ వేయాడానికి ఓపిక ఉంటుంది.. కానీ ఆస్పత్రికి వెళ్లి టీకా వేయించుకోలేరా’’ అంటూ కాంగ్రెస్ నేత నరేంద్ర సులజా తీవ్ర విమర్శలు చేశారు. ప్రగ్యా ఠాకూర్‌పై నెటిజనులు కూడా ప ఎద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. -
ప్రగ్యా ఠాకూర్ డాన్స్ వీడియో వైరల్.. ఏదేమైనా..
MP Pragya Dance: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌కు సంబంధించిన డాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భోపాల్‌లోని తన నివాసంలో బుధవారం ఇద్దరు యువతుల పెళ్లిళ్లు జరిపించిన ప్రగ్యా ఠాకూర్.. అప్పగింతల సమయంలో డీజే పెట్టించారు. ఈ సందర్భంగా అతిథులతో పాటు తాను సైతం పాటలకు కాలు కదిపారు. వారితో సరాదాగా స్టెప్పులేస్తూ చిరునవ్వులు చిందించారు. ఇక ఈ వీడియోపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘సోదరి ప్రగ్యా ఠాకూర్ బాస్కెట్ బాల్ ఆడటం చూసినపుడు.. ఎవరి సాయం లేకుండానే నడిచినపుడు... ఇదిగో ఇలా డాన్స్ చేసినపుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నిజానికి.. మాలేగావ్ కేసు విచారణలో కోర్టు ముందు హాజరు కాకుండా ఉండేందుకు అనారోగ్యంగా ఉన్నట్లు నటించి, బెయిలు మీద బయటకు వస్తారంతే. కానీ, ఇలాంటి వేడుకల్లో తను ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఏదేమైనా ఆమెను ఇలా చూస్తుంటే, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లే అనిపిస్తోంది’’ అని సోషల్ మీడియా వేదికగా భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌పై సలూజ విమర్శలు గుప్పించారు. కాగా, కొద్దిరోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్.. బాస్కెట్‌బాల్ ఆడుతున్న వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రగ్యా నిందితురాలు అన్న విషయం విదితమే. అనారోగ్య కారణాలు చూపి కోర్టుకు నేరుగా హాజరుకాలేనని, తన అభ్యర్థనను మన్నించాలని విజ్ఞప్తి చేయగా.. సానుకూల స్పందన లభించింది. వాళ్లు నర్మద మిశ్రా కూతుళ్లు.. పేదరికంలో మగ్గిపోతూ... కూతుళ్లకు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న కార్మికుడు నర్మద మిశ్రా బాధ్యతలు తాను తీసుకున్నట్లు ప్రగ్యా వెల్లడించారు. ‘‘ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితురాలిగా.. ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నా ఆశీర్వాదాలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి. వారికి ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి’’ అని ఆమె పేర్కొన్నారు. -
‘‘రోజు గోమూత్రం తాగుతాను.. అందుకే కరోనా రాలేదు’’
భోపాల్: ఓ వైపు కరోనా వైరస్‌ని కట్టడి కోసం ప్రభుత్వాలు ఎంతో కష్టపడి వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తుండగా.. మరోవైపు జనాలు మూఢనమ్మకాలతో వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఆవు పేడ రాసుకుంటే, తాటి కల్లు తాగితే కరోనా తగ్గుతుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతన్న సంగతి తెలిసిందే. సామాన్యులు ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్నారంటే అనుకోవచ్చు.. కానీ ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడటం విచారకరం. తాజాగా బీజేపీ ఎంపీ ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. తాను ప్రతిరోజు గోమూత్రం తాగుతున్నానని.. అందుకే కరోనా బారిన పడలేదని తెలిపారు బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. పార్టీ సమావేశంలో ప్రగ్యా ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘నేను ప్రతిరోజు గోమూత్రం సేవిస్తాను. అందుకే నాకు కరోనా సోకలేదు. దేశీ గో మూత్రం తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది’’ అన్నారు. ‘‘అయితే ప్రతిరోజు ప్రార్థన చేసిన తరువాతనే నేను గోమూత్రాన్ని సేవిస్తాను. ఇది నా ప్రాణాలు కాపాడే అమృతం. నా ప్రాణాన్ని కాపాడు.. నా జీవితం దేశానికే అంకింతం అంటూ ప్రార్థిస్తాను. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే. ప్రతిరోజు గోమూత్రం సేవించండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి’’ అంటూ సాగిన ఈ ఉపన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక వ్యాక్సిన్లు ఇవ్వడం ఆపి.. దేశవ్యాప్తంగా గోమూత్రం పంచండి అంటూ విమర్శిస్తున్నారు నెటిజనులు. చదవండి: ఘోరం: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత -
ఎన్ఐఏ కోర్టులో సాధ్వికి చుక్కెదురు
నూఢిల్లీ : బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఎన్ఐఏ కోర్టులో చుక్కెదురయ్యింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టుకు హాజరు అయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలంటూ సాధ్వి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ పిటిషన్‌ని విచారించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. వారంలో ఒక్క సారైనా తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. 29 డిసెంబర్ 2008న రంజాన్ సమయంలో మాలేగావ్ లోని అంజుమన్ చౌక్, భీఖూ చౌక్ దగ్గర వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. 101 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర ఏటీఎస్ ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అనేక మందిని దోషులుగా భావించి అరెస్ట్ చేసింది. డిసెంబర్ 2017లో మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞా, కల్నల్ పురోహిత్ పై మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యాక్ట్ తొలగించారు. -
ఇక పాకిస్తాన్ గురించి ఏం మాట్లడతాం?
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ తాజాగా ఎన్నికల ఫలితాలపై ట్విటర్ వేదికగా స్పందించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో స్వర ఆప్, కన్హయ్య కుమార్, భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌ల తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే స్వర ప్రచారం చేసిన అభ్యర్థులేవరు విజయం సాధించలేదు. ఈ క్రమంలో భోపాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ మీద.. బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ విజయం సాధించారు. ఈ విషయంపై స్వర ట్విటర్ వేదికగా స్పందించారు. ‘భారతదేశానికి కొత్త రోజులొచ్చాయి. తొలిసారి మనం ఉగ్రవాద ఆరోపణలు కలిగిన వ్యక్తిని పార్లమెంట్‌కు పంపుతున్నాం. ఇప్పుడు పాకిస్థాన్ గురించి ఏమని మాట్లాడుకోవాలి?’ అంటూ ట్వీట్ చేశారు స్వర. Yayyyeeeee for New beginnings #India ! First time we are sending a terror accused to Parliament 💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾 Woohoooo! How to gloat over #Pakistan now??!??? 🤔🤔🤔🤔 #LokSabhaElectionResults20 — Swara Bhasker (@ReallySwara) May 23, 2019 -
గాడ్సేకి అటూ ఇటూ
-
‘ప్రజ్ఞ పోటీ చేయకుండా నిషేధించలేం’
ముంబై: భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధం విధించాలంటూ వచ్చిన పిటిషన్‌ను ముంబైలోని ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. ఆ అధికారం తమకు లేదనీ, ఎన్నికల అధికారులే ఆ పని చేయగలరంది. మాలేగావ్ పేలుళ్లలో తన కొడుకును కోల్పోయిన నిసార్ సయ్యద్ ఈ పిటిషన్ వేశారు. ఈ పేలుళ్ల సూత్రధారి ప్రజ్ఞా సింగేననే ఆరోపణలు ఉన్నందున ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఆయన కోరారు. ఆమెకు మంజూరయిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలన్నారు. ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి వీఎస్ పడాల్కర్ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ‘మాకు అలాంటి అధికారం లేదు. ఎన్నికల్లో పోటీచేయకుండా మేం ఎవ్వరిపైనా నిషేధం విధించలేం’ అని పేర్కొన్నారు. -
‘ఇక్కడ ప్రమోషన్లు.. డిమోషన్లు ఉండవు’
ముంబై : ఈ సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్‌లో పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ తరఫున రెండు సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తి బరిలో దిగితే.. అతనికి పోటీగా బీజేపీ ఓ సాధ్విని నిలబెట్టడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో భోపాల్‌లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఓ ఆంగ్లపత్రికతో ముచ్చటించారు. ఆ వివరాలు.. ప్రస్తుతం భోపాల్.. కాంగ్రెస్‌కు చాలా ప్రతికూల నియోజకవర్గమని తెలిపారు. ఇలాంటి బలహీన ప్రాంతంలో పోటీ చేసి గెలవడాన్ని తాను ఓ సవాలుగా స్వీకరిస్తానన్నారు. తాను తొలుత తన స్వస్థలం రాజ్‌గఢ్ నుంచి పోటీ చేయాలి అనుకున్నాను అని తెలిపారు. కానీ కమల్ నాథ్, రాహుల్ గాంధీ తనను భోపాల్ నుంచి నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారమే తాను భోపాల్ నుంచి బరిలో దిగానని దిగ్విజయ్ తెలిపారు. రెండు సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఇప్పుడు లోక్‌సభ బరిలో నిలవడం ప్రమోషనా.. డిమోషనా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో ఇలాంటివి ఉండవని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఎవరైనా సరే పార్టీ అవసరాలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2011లో బురారిలో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో ప్రణబ్ ముఖర్జీ తనను ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించమని కోరారన్నారు. అప్పుడు తాను యువకులకు ఆ అవకాశం ఇవ్వాలని చెప్పడంతో.. ఆ బాధ్యతలు రాహుల్ గాంధీకి ఇచ్చారని దిగ్విజయ్ గుర్తు చేశారు. ఇకపోతే సాధ్వి ప్రజ్ఞా సింగ్.. దిగ్విజయ్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘సాధ్వి ప్రజ్ఞా సింగ్ అలా ఎందుకు మాట్లాడుతుందో నాకు తెలీదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమెని ఇబ్బంది పెట్టిన వ్యక్తి శివరాజ్ సింగ్. రెండు సార్లు అతను.. సాధ్వీని అరెస్ట్ చేయించి జైలులో పెట్టాడ’ని తెలిపారు. ఇక బీజేపీ తనపై చేస్తోన్న హిందూ ఉగ్రవాద ఆరోపణలపై దిగ్విజయ్ స్పందిస్తూ.. తాను హిందు మతాన్ని ఆచరిస్తానని తెలిపాడు. ఈ పదాన్ని సృష్టించిన వ్యక్తి ఆర్కే సింగ్ అని పేర్కొన్నారు. కానీ మోదీ అతనికి టికెట్ ఇచ్చి మంత్రిని చేశారని దిగ్విజయ్ ఎద్దేవా చేశారు. సాధ్విపై పోటీ చేయడం తెలీకా.. కష్టమా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనన్నారు దిగ్విజయ్. కానీ తాను ఎప్పటిలానే విజయం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. అంతేకాక ప్రస్తుతం దేశంలో ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కశ్మీర్ అంశాలను వదిలేసి.. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని దిగ్విజయ్ మండి పడ్డారు. -
పోలీసులు తీవ్రంగా హింసించారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న, మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మానస్ భవన్లో ఆమె మాట్లాడుతూ విచారణ సమయంలో పోలీసులు తనను ఏవిధంగా హింసించిందీ రోదిస్తూ వివరించారు. ‘పోలీసులు నన్ను అక్రమంగా 13 రోజులు బంధించారు. ఆ సమయంలో వెడల్పైన బెల్టుతో నన్ను కొట్టేవారు. ఒక్క దెబ్బకే శరీరం బాగా వాచేది. రెండో దెబ్బ పడితే చర్చం ఊడివచ్చేది. ఆ దెబ్బలకు కాసేపు నా నాడీ వ్యవస్థ పనిచేసేది కాదు. అసభ్యకరంగా పోలీసులు తిట్టేవారు. తలకిందులుగా వేలాడదీస్తామనీ, వివస్త్రను చేస్తామని బెదిరించేవారు. ఇలాంటి కష్టాలను ఇంకో సోదరి ఎవరూ అనుభవించకూడదని చెబుతున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దిగ్విజయసింగ్పై ప్రస్తుతం ప్రజ్ఞ పోటీ చేస్తున్నారు. దిగ్విజయ హిందూ, కాషాయ ఉగ్రవాదం వంటి పదాలను వాడి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మాలెగావ్ పేలుళ్లలో తన హస్తం ఉందని ఒప్పుకోవాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారన్నారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి చతుర్వేది స్పందిస్తూ ఎన్నికల కోసమే ఆమె ఇప్పుడు పోలీసులు తనను హింసించడం గురించి చెబుతున్నారన్నారు. -
సాధ్వీకి బెయిల్ ఎవరిచ్చారు ?
న్యూఢిల్లీ: ‘రిప్ ఇండియన్ జస్టిస్’ అనే నినాదం ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెర్లు కొడుతోంది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ముంబై హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఈ నినాదం ఊపందుకుంది. ‘రిప్ ఇండియన్ జస్టిస్’ అంటే ఇక్కడ న్యాయవ్యవస్థను చించి వేయండి లేదా రద్దు చేయండి అని అర్థం. ఇలాంటి నినాదాన్ని ప్రచారంలోకి తీసుకరావడానికి ముందు నిజంగా న్యాయవ్యవస్థ తప్పుచేసిందా లేదా కేసును దర్యాప్తు చేసిన సంస్థ తప్పు చేసిందా ? అన్న అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు కేసు ఏమిటీ? మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో సంభవించిన పేలుళ్లలో ఆరుగురు ముస్లింలు మరణించారు. ముస్లిం టెర్రరిస్టు దాడులకు ప్రతీకారంగా హిందూ మత ఛాందసవాదులు పాల్పడిన తొలి పేలుళ్లగా కూడా నాడు ఈ కేసు ప్రచారమైంది. అప్పటి నుంచే ‘కాషాయం టెర్రర్’ అనే పదం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పేలుళ్లకు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సమక్షంలో కుట్ర జరిగిందని భావించిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదే సంవత్సరంలో ఆమెను అరెస్టు చేశారు. ఆమె సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ల కొట్టివేత ఆ తర్వాత ఈ కేసును మహారాష్ట్ర వ్యవస్థ్రీకత నేరాల నిరోధక చట్టం కిందకు మార్చారు. ఈ చట్టం పరిధిలో నిందితులకు బెయిల్ దొరకడం కష్టం. అయినా సాధ్వీ ప్రజ్ఞాసింగ్ బెయిల్ కోసం నిరంతరంగా ప్రయత్నిస్తూనే వచ్చారు. 2012, 2014 సంవత్సరాల్లో ట్రయల్ కోర్టు రెండు సార్లు, హైకోర్టు రెండుసార్లు ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. 2015, నవంబర్‌లో ఆమె బెయిల్ పిటీషన్లను కోర్టులు చివరిసారి కొట్టివేశాయి. సాధ్వీ సమక్షంలో కుట్ర జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని, అందుకు ఆ కుట్రలో పాల్గొన్న నిందితుల్లో ఇద్దరు ఇచ్చిన వాంగ్మూలాలు అందుకు సరిపోతాయని, అలాగే బాంబులు అమర్చిన మోటార్ సైకిల్ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌కు చెందినది కావడం కూడా ఆమెపై ప్రాథమిక విచారణ జరిపేందుకు ప్రాతిపదిక అవుతుందని కోర్టులు అభిప్రాయపడ్డాయి. అందుకే బెయిల్ పిటిషన్లను నిరాకరిస్తున్నట్లు ప్రకటించాయి. హఠాత్తుగా మారిపోయిన సాక్ష్యాధారాలు గతేడాది మే నెలలో సాధ్వీపై ఈ ప్రాథమిక ఆధారాలన్నీ మారిపోయాయి. సాధ్వీకి వ్యతిరేకంగా సాక్షమిచ్చిన ఇద్దరు నిందితులు ప్లేటు ఫిరాయించారు. వీరు కాకుండా ఆమెకు వ్యతిరేకంగా సాక్షమిచ్చిన ముగ్గురు సాక్షుల్లో ఒకరు ముందే తన వాంగ్మూలాన్ని మార్చుకోగా, మరొకరు చనిపోయారు. మూడో వ్యక్తి అదశ్యమయ్యారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నుంచి ఈ కేసును 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) టేకప్ చేసింది. (అప్పటి యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ ఏజెన్సీ ఆవిర్భవించింది) 2014 నాటికల్లా కేసు విచారణను ముగించి చార్జిషీటును దాఖలు చేయడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు రావడం, పార్టీ అఖండ విజయంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈలోగా ఏం జరిగిందో ఏమో, చార్జిషీటు దాఖలు చేయాల్సిన ఎన్ఐఏ సంస్థ మనసు మార్చుకొని 2015 సంవత్సరం, చివరలో సాక్షులను పునర్విచారించాలని నిర్ణయించింది. విచారించింది. పునర్ విచారణలో సాక్షులు ప్లేటు ఫిరాయించారు. అనుబంధ చార్జిషీటు ఎందుకొచ్చింది? ఆ తర్వాత గతేడాది మే నెలలో ఎన్ఐఏ సాధ్వీ కేసులో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. సాధ్వీకి, ఆరెస్సెస్‌కు చెందిన ఐదుగురు నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. ఆ మరుసటి నెలలోనే సాధ్వీతోపాటు ఇతర నిందితులకు బెయిల్ మంజూరు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు స్పష్టం చేసింది. నేరం చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు జడ్జీలు భావించినా సరే దర్యాప్తు సంస్థలకు అభ్యంతరం లేకపోతే సాధరణంగా కోర్టులు బెయిల్ మంజూరు చేస్తాయి. ముంబై మాజీ పోలీసు కమిషనర్ రామ్‌దేవ్ త్యాగి కేసు విషయంలో 2001లో కోర్టు ఇలాగే వ్యవహరించింది. 1992–93 ముంబై అల్లర్లకు సంబంధించిన సులేమాన్ ఉస్మాన్ బేకరీ కేసులో రామ్‌దేవ్ త్యాగి ప్రధాన నిందితుడు. ఆయన నేరం చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జీలు బలంగా విశ్వసించినప్పటికీ దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేకపోవడం వల్లన బెయిల్ మంజూరైంది. ఇప్పుడు సాధ్వీ కేసులో కూడా ముంబై హైకోర్టు అదే ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేసింది. ఎవరు బాధ్యులు...? సాధ్వీ కేసులో మందగమనంతో వ్యవహిరించాల్సిందిగా తనపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని ఎన్ఐఏ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియన్ 2015లో బహిరంగంగా ప్రకటించడం, సాధ్వీకి బెయిల్ రావడం పట్ల విశ్వహిందూ పరిషద్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో జైల్లో ఉన్న హిందువులందరిని విడుదల చేసి, వారిపై కేసు కొట్టివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా ఇక్కడ గమనార్హమే. ఎవరిని నిందించాలి? సాధ్వీ కేసులో మొదటి నుంచి బెయిల్‌ను వ్యతిరేకిస్తున్న ఎన్ఐఏ సంస్థ ఎందుకు తన మనసు మార్చుకొని నిందితలుకు బెయిల్ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది? నిందితులపై తుది చార్జిషీటును దాఖలు చేయాల్సిన ఎన్ఐఏ కేసు విచారణ చేపట్టిన ఐదేళ్లకు సాక్షులను పునర్విచారించాలని ఎందుకు నిర్ణయానికి వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ ఎందుకు అనుబంధ ఛార్జీషీటు దాఖలు చేసింది? ఈ ప్రశ్నలకు అర్థాలు వెతుక్కుంటే ఎవరిని దూషించాలో అర్థం అవుతుంది. సిబీఐ నుంచి మొదలుకొని యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ వరకు ఏ దర్యాప్తు సంస్థ పనితీరును పరిశీలించినా కేంద్రం పాలకపక్షం కనుసన్నల్లో దర్యాప్తు అధికారులు మెసలుకుంటున్నారన్నది కూడా అర్థం అవుతుంది. కనుక ‘రిప్ ఇండియన్ జస్టిస్’ అనే బదులు ‘రిప్ ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్’ అనే ప్రచారం బాగుంటుందేమో! -
వారికి వ్యతిరేకంగా ఆధారాల్లేవ్!!
జైపూర్: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, ఆరెస్సెస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ సహా నలుగురు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) క్లీన్చిట్ ఇచ్చింది. 2007లో జరిగిన అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దర్యాప్తును ముగిస్తున్నట్టు నివేదికను జైపూర్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. నలుగురు నిందితులకు వ్యతిరేకంగా తగినంతగా ఆధారాలు సేకరించలేకపోయామని, అందుకే వారికి వ్యతిరేకంగా కేసును మూసివేస్తున్నామని ఎన్ఐఏ తెలిపింది. సాధ్వీ, ఇంద్రేష్‌కుమార్ సహా నిందితులు ప్రిన్స్, రాజేంద్రకు వ్యతిరేకంగా కేసును మూసివేస్తూ ఎన్ఐఏ నివేదిక సమర్పించిందని, ఈ నివేదికను అంగీకరించాలా? వద్దా? అనేది ఏప్రిల్ 17న ప్రత్యేక కోర్టు నిర్ణయించనుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్వినీ శర్మ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సందీప్ దంగే, సురేశ్ నాయర్, రాంచద్ర కల్సంగ్రా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని అరెస్టు చేయడంలో ఎన్ఐఏ అశక్తత వ్యక్తం చేయడంతో ఈ కేసు విచారిస్తున్న జడ్జి దినేశ్ గుప్తా ఎన్ఐఏ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2007 అక్టోబర్‌లో ప్రముఖ సుఫీ దర్గా అయిన అజ్మీర్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు మృతిచెందగా, 17 మంది గాయపడ్డారు.