తన నివాసంలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్న బీజేపీ భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్
భోపాల్: తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రగ్యా ఠాకూర్ ఇంటి దగ్గర వ్యాక్సిన్ తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. డ్యాన్స్ చేయడానికి ఓపిక ఉంటుంది కానీ ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోలేరా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఆ వివరాలు..
తాజాగా రెండు మూడు రోజుల క్రితం ప్రగ్యా ఠాకూర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ప్రగ్యా ఠాకూర్ తన నివాసంలో వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిసింది. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక నియమం కింద ప్రగ్యా ఠాకూర్ తన నివాసంలోనే వ్యాక్సిన్ వేయించుకున్నట్లు రాష్ట్ర పాలన అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఇమ్యూనైజేషన్ అధికారి సంతోష్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘పాలసీ ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. ఈ నియమం ప్రకారం ప్రగ్యా ఠాకూర్ నివాసానికి వెళ్లి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేశాం. అంతేకానీ మేం నియమాలను ఉల్లంఘించలేదు’’ అని తెలిపారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ‘‘మన భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కొద్ది రోజుల క్రితమే బాస్కెట్ బాల్ ఆడారు.. ఆమె నివాసంలో జరిగిన ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేశారు. కానీ వ్యాక్సిన్ మాత్రం ఇంటి దగ్గరే వేయించుకున్నారు. ప్రధాని మోదీ నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు ప్రతి బీజేపీ నేత ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు.. ప్రగ్యా ఠాకూర్ తప్ప. డ్యాన్స్ వేయాడానికి ఓపిక ఉంటుంది.. కానీ ఆస్పత్రికి వెళ్లి టీకా వేయించుకోలేరా’’ అంటూ కాంగ్రెస్ నేత నరేంద్ర సులజా తీవ్ర విమర్శలు చేశారు. ప్రగ్యా ఠాకూర్‌పై నెటిజనులు కూడా ప ఎద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment