సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ తాజాగా ఎన్నికల ఫలితాలపై ట్విటర్ వేదికగా స్పందించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో స్వర ఆప్, కన్హయ్య కుమార్, భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్‌ల తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే స్వర ప్రచారం చేసిన అభ్యర్థులేవరు విజయం సాధించలేదు. ఈ క్రమంలో భోపాల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ మీద.. బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ విజయం సాధించారు. ఈ విషయంపై స్వర ట్విటర్ వేదికగా స్పందించారు.
‘భారతదేశానికి కొత్త రోజులొచ్చాయి. తొలిసారి మనం ఉగ్రవాద ఆరోపణలు కలిగిన వ్యక్తిని పార్లమెంట్‌కు పంపుతున్నాం. ఇప్పుడు పాకిస్థాన్ గురించి ఏమని మాట్లాడుకోవాలి?’ అంటూ ట్వీట్ చేశారు స్వర.
Yayyyeeeee for New beginnings #India ! First time we are sending a terror accused to Parliament 💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾 Woohoooo! How to gloat over #Pakistan now??!??? 🤔🤔🤔🤔 #LokSabhaElectionResults20
— Swara Bhasker (@ReallySwara) May 23, 2019
Comments
Please login to add a commentAdd a comment