నూఢిల్లీ : బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌కు ఎన్‌ఐఏ కోర్టులో చుక్కెదురయ్యింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టుకు హాజరు అయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలంటూ సాధ్వి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ పిటిషన్‌ని విచారించిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. వారంలో ఒక్క సారైనా తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది.
29 డిసెంబర్ 2008న రంజాన్ సమయంలో మాలేగావ్ లోని అంజుమన్ చౌక్, భీఖూ చౌక్ దగ్గర వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. 101 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర ఏటీఎస్ ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అనేక మందిని దోషులుగా భావించి అరెస్ట్ చేసింది. డిసెంబర్ 2017లో మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞా, కల్నల్ పురోహిత్ పై మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యాక్ట్ తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment