
సాక్షి,గుంటూరు: ప్రముఖ రచయిత,నటుడు పోసాని కృష్ణ మురళి (Posni Krishna Murali) బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసింది.
గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా .. న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది. ఈరోజు పోసాని బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. వాదనలు పూర్తి అయిన తర్వాత తీర్పును న్యాయస్థానం ఈనెల 21కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment