న్యూఢిల్లీ: దేశంలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా తేవడం, వాటిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఉగ్రవాదం వ్యాప్తికి వాడుతున్నారంటూ నమోదైన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోమవారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో సోదాలు జరిపింది. డ్రగ్స్ స్మగ్లింగ్‌తో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్ల నివాసాల్లోనూ సోమవారం దాడులు కొనసాగాయి. పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులైన గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, జగ్గూ భగ్‌వాన్‌పురియా ఇళ్లలో అధికారులు సోదా చేశారు.
ఢిల్లీసహా 50 చోట్ల దాడులు చేసి ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారుల మధ్య ఏర్పడుతున్న కొత్త నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నంచేశామని ఒక ఎన్‌ఐఏ అధికారి చెప్పారు. దేశ, విదేశాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న గ్యాంగ్‌స్టర్లపై గత నెల 26లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ఈ ముమ్మర సోదాలు జరిపింది. ఈ గ్యాంగ్‌స్టర్‌లలో కొందరు భారత్ నుంచి పారిపోయి కెనడా, పాకిస్తాన్, మలేసియా, ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడి నుంచే భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు!
Comments
Please login to add a commentAdd a comment