
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును ఇక నుంచి కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ తాజాగా కేసు నమోదు చేసింది. గత శుక్రవారం(మార్చి 1) మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు నగరంలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగింది.
ఈ పేలుడు ఘటనలో 10 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసును ఇప్పటిదాకా బెంగళూరు సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ)పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీబీ కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ ఎన్‌ఐకు బదిలీ చేయనుంది. కాగా, అవసరమైతే పేలుడు కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు బదిలీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు.
ఇదీ చదవండి.. బెంగాల్ బీజేపీ చీఫ్‌కు రోడ్డు ప్రమాదం.. వారిపైనే ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment