
సాక్షి, విజయవాడ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు రిమాండ్ పొడిగించింది. శ్రీనివాస్ తరఫున న్యాయవాది సలీం బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. శుక్రవారం వాదనలు విన్న ఎన్‌ఐఏ కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 26కు వాయిదా వేసింది. నిందితుడి రిమాండ్‌ను మార్చి 8 వరకు పొడిగించింది.