విశాఖ విమానాశ్రయంలో పక్కా వ్యూహంతోనే జగన్‌పై హత్యాయత్నం
జనబలం లేని చంద్రబాబుకు అడ్డదారిలో అధికారం కట్టబెట్టేందుకు పచ్చపక్షం తెగ తాపత్రయపడుతోంది. ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో అడ్డగోలు కథనాలు వండివారుస్తూ ఆపసోపాలు పడుతోంది. సింగిల్‌గా పోరాడుతున్న సింహాన్ని చూసి బెదిరిపోతున్న శక్తులన్నీ ఒక్కటై కత్తులు దూస్తున్నాయి. కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతి అంశాన్నీ జగన్‌కు వ్యతిరేకంగా చూపించేలా కట్టుకథలు అచ్చేయిస్తున్నాయి.
చివరకు 2018లో ఆయనపై విశాఖ విమానాశ్రయం వేదికగా జరిగిన హత్యాయత్నం కేసుపైనా దు్రష్పచారానికి ఒడిగడుతున్నాయి. పథకం ప్రకారమే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఓ వైపు ఎన్‌ఐఏ ధ్రువీకరిస్తున్నా... దానినీ పక్కదారి పట్టించేలా అసత్యాలను ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నాయి. –సాక్షి, అమరావతి
ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో ఏముంది?
వైఎస్ జగన్‌ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాస్ ఆయనపై అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడని కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ... చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని తెలిపింది. మెడమీద సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. నాటి దాడి యాదృచ్చికం కాదనీ... హత్య చేసేందుకు పక్కా కుట్రేనన్నది నిర్ధారణ అవుతోంది.
రెస్టారెంట్ యజమాని పక్కా టీడీపీ
వైఎస్ జగన్‌పై హత్యా యత్యానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్నది విశాఖపట్నం విమానాశ్రయంలోని ‘ఫ్యూజన్ ఫుడ్స్’ రెస్టారెంట్‌లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తూ నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖమంత్రిగా ఉన్నపుడే.
పక్కా పన్నాగంతోనే ఉద్యోగం
2018 అక్టోబర్ 25వ తేదీన వై.ఎస్.జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందే అంటే 2018, జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్‌కుమార్ సిఫార్సుమేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్‌లో శ్రీనివాస్‌కు ఉద్యోగమిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్‌ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళ్లి వస్తారన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడికి రెస్టారెంట్‌లో ఉద్యోగం కల్పించి హత్యాయత్నానికి ప్రేరేపించారని తేటతెల్లమవుతోంది.
నిందితుడు పాత నేరస్తుడే...
కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్‌ఎఫ్) భద్రతా వలయంలో ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లోగానీ అక్కడ ఉండే షాపులు, ట్రావెల్స్ ఏజెన్సీల డెస్‌్కలలో ఉద్యోగాల్లో చేరడం అంత ఆషామాషీ కాదు. అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకోసం అభ్యర్థుల నివాస, స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఆయన స్వస్థలమైన తానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
అలాంటి వ్యక్తిని రెస్టారెంట్‌లో చేర్చుకునేందుకు దాని యజమానే విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులకు సమర్పించడం.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయనే నిర్ధారించడం గమనార్హ. ఠానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్‌లో ఉద్యోగం కల్పించడం వెనుక పక్కా కుట్ర ఉంది.
టీడీపీ దుష్ప్రచారంపై నిందితుడి నీళ్లు
జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ ఆ నింద తమపైకి రాకుండా దు్రష్పచారానికి తెరతీసింది. నిందితుడు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడని.. జగన్‌కి సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డాడని టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టిమరీ వ్యాఖ్యానించారు. అప్పటి డీజీపీగా ఉన్న ఆర్‌పీ ఠాకూర్ సైతం కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్‌కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు.
ఈ ప్రకటన వెనుక టీడీపీ ‘ముఖ్య నేత’ ఆదేశాలున్నట్టు స్పష్టమవుతోంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగానే సరికొత్త భాష్యాలు చెప్పారన్నది తేటతెల్లమైంది. నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్‌పై విడుదల అయిన తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్‌జగన్‌కు సానుభూతి తీసుకువచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల దు్రష్పచారం బెడిసికొట్టింది.
పచ్చ మీడియా పైశాచిక ఆనందం
బాధితునిపై సానుభూతి చూపడం... నిందితుడిపై ఆగ్రహం ప్రదర్శించడం మానవీయ ధర్మం. ఎల్లోమీడియా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో బాధితుడైన జగన్‌ను అవహేళన చేయడమే కాకుండా, నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది.
చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా మలిచేందుకు ఏకంగా న్యాయ వ్యవస్థకే దురుద్దేశాలు ఆపాదిస్తోంది. హత్యాయత్నం కేసు దర్యాప్తును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడాన్ని ఈనాడు, ఇతర పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని తేల్చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ న్యాయ వ్యవస్థను కించపరుస్తోంది.
అసలు వాస్తవం ఏమిటి?
ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్‌ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతోందని హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. రాష్ట్రంలో అదనంగా ఎన్‌ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్‌ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. అందుకే ఎన్‌ఐఏకు విజయవాడతోపాటు విశాఖç³ట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. హత్యాయత్నం ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది.
సమగ్ర దర్యాప్తునకు వినతి
ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఎన్‌ఐఏను, కోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధం ఏమిటి? నిందితుడు పాత నేరస్తుడైనప్పటికీ ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్‌ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా? విమానాశ్రయంలో ఉన్న జగన్‌కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు?
జగన్‌ను తానే పొడిచానని గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూల్లో శ్రీనివాసరావు చెప్పిన మాట వాస్తవం కాదా? హర్షవర్ధన్ చౌదరికి రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? హర్షవర్దన్ చౌదరి, లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హర్షవర్దన్‌కి ఎయిర్‌పోర్టులో 2017లో కేటరింగ్ కాంట్రాక్టు కేటాయింపు సమయంలో కేంద్రమంత్రిగా ఉన్నది టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు అశోక్ గజపతిరాజే కదా?
కథకం ప్రకారం దాడిచేసిన శ్రీనివాసరావును కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించడం లేదా? హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా నిరంతరం ఎందుకు మోస్తున్నాయి? అంటే ఇందులో వారి ప్రమేయం ఉన్నట్టేనా? శ్రీనివాస్‌ను కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లోమీడియా ఎందుకు వ్యవహరిస్తున్నాయి?
Comments
Please login to add a commentAdd a comment