తమిళనాడు తీరంలో రెండు పవర్ బోట్లతో పాటు తొమ్మిది మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకుంది. ఆ మత్స్యకారులు భారత సరిహద్దు దాటి చేపల వేట సాగిస్తున్నారని శ్రీలంక ఆరోపిస్తోంది. 535 బోట్లలో మత్స్యకారులు గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో చేపల వేటకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా విదేవిధంగా శ్రీలంక భారత జాలర్లను పట్టుకుంది.
జూలై ఒకటిన రామేశ్వరం ద్వీపం సమీపంలోని పాల్క్ బే సముద్ర ప్రాంతంలో పాంబన్ నుంచి చేపల వేటకు వెళ్లిన 26 మంది భారతీయ మత్స్యకారులు శ్రీలంక నావికాదళానికి చిక్కారు. గత నెలలోనే శ్రీలంక నావికాదళం తమ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో 18 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. మూడు మత్స్యకారుల బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికిముందు కూడా శ్రీలంక నేవీ నలుగురు భారతీయ జాలర్లను అరెస్టు చేసి, వారి పడవను స్వాధీనం చేసుకుంది.
ఈ ఏడాది జనవరిలో శ్రీలంక నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు శ్రీలంక 180 మందికి పైగా భారత జాలర్లను అరెస్టు చేసింది. గత ఏడాది 240 నుంచి 245 మందిని అరెస్టు చేసిన నేపధ్యంలో భారత్-శ్రీలంక సంబంధాల్లో వివాదాలు తలెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment