
సాక్షి, చెన్నై : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల పర్యటన చేపట్టిన తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రస్తుతం రామేశ్వరంలో పర్యటిస్తున్నారు. రామేశ్వరంలో ప్రసిద్ధ గాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించారు. ప్రత్యేక పూజలో స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు ఆలయ నిర్వాహకుల నుండి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈనెల 13న డీఎమ్‌కే అధినేత స్టాలిన్‌ను కేసీఆర్ కలవనున్నట్లు ప్రకటించినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరిద్దరి భేటీ సాధ్యపడకపోవచ్చుననే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.