అంధ భక్తులపై ఖాకీల నిర్వాకం | visually challenged devotees agitation before rameswaram temple | Sakshi
Sakshi News home page

అంధ భక్తులపై ఖాకీల నిర్వాకం

Published Tue, Nov 24 2015 1:36 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

visually challenged devotees agitation before rameswaram temple

రామేశ్వరం: కొందరు అంధులపట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. రామేశ్వరంలోని శ్రీ రామనాథ స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లినవారిని అడ్డుకోవడమే కాకుండా వారిని వేధింపులకు గురి చేశారు. దీంతో వారంతా మంగళవారం అదే ఆలయం ముందు ధర్నాకు దిగి ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్రకు చెందిన అంధ భక్తులు శ్రీ రామనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో తనిఖీకోసం ప్రత్యేక క్యూ ఉందని వారికి తెలియదు. పైగా వారికి చూపులేనందున ఆ విషయం ముందుగా తెలుసుకోలేకపోయారు. అందుకే ఆలయంలోకి వెళ్లేందుకు ద్వారం వద్దకు వెళ్లిన 12మంది అంధులను అమానుషంగా నలుగురు పోలీసులు ఈడ్చుకెళ్లారు. వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసినా భాషరాని కారణంగా చెప్పలేకపోయారు. దీంతో పోలీసులకు వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆ అంధ భక్తులకు మరికొందరు భక్తులు తోడై ఆందోళనకు దిగారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement