visually challenged
-
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పుట్టుకలోనే ఆ విధి చిన్న చూపు చూసింది పుట్టాక తల్లిదండ్రులు మరింత అన్యాయం చేశారు. మా కొద్దీ పాప అంటూ చెత్త కుప్పలో పడేశారు. కానీ ఇక్కడే ఆమెకు మరో దారి దొరికింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుని తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. మహారాష్ట్రంలోని జల్గావ్ రైల్వే స్టేషన్లో చెత్త కుప్పలో చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. శంకర్‌బాబా బాలిక సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకునే అవకాశం కలిగింది. తోటివారు గర్వపడేలా సత్తా చాటుకుంది.పద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్ అని పేరు పెట్టడం మరో విశేషం. అంతే మాలా పట్టుదలగా ఎదిగింది. తాజాగా (మే 16న ) విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్ లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. ‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికే దేవుడు దేవదూతలను పంపించాడని, ఇక్కడితో తాను ఆగనని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని IAS అవడమే తన లక్ష్యం’ అని మాలా చెప్తుతోంది. తన విజయానికి శంకర్ బాబా పాపల్కర్, యూనిక్ అకాడమీ అమరావతి ప్రొఫెసర్ అమోల్ పాటిల్, ప్రకాష్ టోప్లే కారణమంటూ వారికి కృతజ్ఞతలు తెలిపింది. 2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ , ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్ దత్తత తీసుకున్నారని శంకర్‌బాబా వెల్లడించారు. -
World Sight Day: రుచికి చూపెందుకు? జిహ్వ ఉంటే చాలు!
ఆశాలత చకచకా ఐదు నిమిషాల్లో వంట ముగుస్తుంది. ఇంత సులువుగా హాయిగా వండొచ్చా అనిపిస్తుంది వీడియో చూస్తే! కాని ఆమెకు చూపు లేదు. ఫుడ్ వ్లోగర్‌గా ఇన్‌స్టాలో లక్ష, యూ ట్యూబ్‌లో రెండు లక్షల మంది ఫాలోయెర్లను సంపాదించుకుంది. కొత్తిమీర పచ్చడి నుంచి రొయ్యల వేపుడు వరకూ ఆమె వంటలకు డిమాండ్. కళ్లు లేని వారు ఇన్‌స్పయిర్ చేయగలరు అంటుందామె. కాసర్‌గోడ్‌కు చెందిన ఆశాలత తెలుసుకోదగ్గ వ్యక్తి. నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం. అంటే దృష్టి కలిగి ఉన్నందుకు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఎరుక తెచ్చుకోవాల్సిన దినం. దృష్టి లేని వారికి సమాజంలో అందాల్సిన సౌలభ్యాలు, అవకాశాల గురించి చైతన్యం కలిగించుకోవాల్సిన దినం. దృష్టి లేకపోయినా తమ జీవన సమరాన్ని గొప్పగా సాగిస్తుంటే అందరం కలిసి ముందుకు సాగుదాం అని చెప్పాల్సిన దినం. పరస్పరం స్ఫూర్తి పొందాల్సిన దినం. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో రావణేశ్వరంలో నివసించే ఆశాలతను చూస్తే ఆమె నుంచి పొందాల్సిన స్ఫూర్తి, ఆమెకు ఇవ్వాల్సిన ఉత్తేజం చాలానే ఉందనిపిస్తుంది. మునివేళ్లకు కళ్లు 49 ఏళ్ల ఆశాలత మునివేళ్లకు కళ్లున్నాయ్ అనిపిస్తుంది ఆమె వంట చేసే పద్ధతి చూస్తే. కత్తిపీటతో కూరలు తరగడం, మిక్సీలో మసాలాలు వేసుకోవడం, స్టౌ ఆన్ చేసి మూకుళ్లు పెట్టడం, వండటం ఇవన్నీ మునివేళ్ల స్పర్శతోనే ఆమె గుర్తించి పూర్తి చేస్తుంది. ‘నాకు పుట్టుకతో దృష్టి లేదు. టీనేజ్ వరకూ వెలుతురు, చీకటి అర్థమయ్యేవి. టీనేజ్ దాటాక పూర్తిగా చీకటి కమ్ముకుంది. అయినప్పటికీ మా అమ్మా నాన్నలు నన్ను అంధురాలిగా చూస్తూ, నిరాశ పరుస్తూ పెంచలేదు. మా నాన్న టి.సి.దామోదర్ నన్ను చదువుకోమని బాగా ప్రోత్సహించాడు. బ్రెయిలీలోనే చదువు కొనసాగించి బి.ఇడి చేశాను. ఆ తర్వాత టీచర్ ఉద్యోగం పొందాను. మా ఊరి గవర్నమెంట్ స్కూల్లోనే సోషల్ టీచర్‌గా పని చేస్తున్నాను’ అని చెప్పింది ఆశాలత. 18 ఏళ్లకు పెళ్లయ్యాక అత్తారింటిలో ఆమెకు వేరే ఏ పని చెప్పకపోయినా, ముగ్గురు పిల్లలు పుట్టినా పెంచడంలో అవస్థ రాకుండా చూసుకున్నా ఆశాలత అందరూ చేయదగ్గ పనులు చేయడానికి ప్రయత్నించేది. ‘దృష్టి లేకపోతే ఇంటి పనులు కష్టమే. ఇల్లు చిమ్మడం, బట్టలు ఉతకడం కంటే వంట చేయడం సులభం అని మెల్లగా నేను తెలుసుకున్నాను’ అందామె నవ్వుతూ. వంటలో మేటి సమయం దొరికితే వంట చేయడం మొదలెట్టిన ఆశాలత లాక్డౌన్లో పూర్తిస్థాయి వ్లోగర్‌గా మారి తన వంట వీడియోలను అప్లోడ్ చేస్తూ ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. ‘అంధులు తమ రోజువారి పనులు ఎలా చేసుకుంటారో... ముఖ్యంగా వంట ఎలా చేసుకుంటారో చూపించాలనుకున్నాను’ అంటుందామె. దృష్టి లేకపోయినా ఆమె అంత సామర్థ్యంగా, కచ్చితంగా వంట చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పాటించే శుభ్రతను చూసి కూడా. ‘మా అబ్బాయి అమల్ నా వీడియోలు షూట్ చేసి ఎడిట్ చేస్తాడు. నేను నా పిల్లలకు ఒకటే చెప్తాను.. మీ మీద మీరు ఆధారపడండి... అమ్మనాన్నలు మీ కోసం అన్నీ చేయాలనుకోకండి అని’ అంటుందామె. వెజ్, నాన్‌వెజ్ కూరలు ఇంట్లో అందరూ చేసుకునే విధంగా ఆమె వీడియోలు చేసి పెడుతుంది. అలాగే తరచూ కుటుంబంతో విహారాలు చేసి ఆ వీడియోలు కూడా పెడుతుంది. ‘అంధులు నన్ను చూసి ఇన్‌స్పయిర్ అవ్వాలి. ఇంట్లోనే ఉండకుండా లోకాన్ని తిరిగి అనుభూతి చెందాలి’ అంటుందామె. ఆమె తన వీడియోల్లో అంధులు కరెన్సీ ఎలా గుర్తిస్తారు, అలంకరణ సామాగ్రి ఎలా ఎంచుకుంటారు లాంటి అంశాల గురించే కాక సాధారణ స్త్రీలకు ఉపయోగపడే అంశాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. (చదవండి: లక్ష సైనికుల కోటి కన్నుల కెమెరా! ) -
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
అదిరిపోయే ఫీచర్లతో.. వారి కోసం ప్రత్యేక స్మార్ట్ వాచ్!
అంధుల కోసం ఓ ప్రత్యేక స్మార్ట్ వాచ్(Smart Watch)ను తయారు చేశారు. దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆధునిక టెక్నాలజీతో ఓ స్మార్ట్ వాచ్‌ను కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. వీటిని పెద్ద మొత్తంలో తయారీతో పాటు విక్రయించేందుకు యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఐఐటీ కాన్పూర్ జతకట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లలో లోపాలను సరిచేసి యూజర్లకు మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు హాప్టిక్ వాచ్‌ను రూపొందించినట్లు ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో టాక్టిల్, టాకింగ్, వైబ్రేషన్, బ్రెయిలీ ఆధారిత వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమిస్తూ ఈ స్మార్ట్ వాచ్ రాబోతోంది. యాంబ్రేన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి త్వరలో ఈ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరందికర్ తెలిపారు. ఇందులో ఏ ఫీచర్లు ఉన్నాయంటే! ఈ హాప్టిక్ స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్లలో రానుంది. ఇందులో డయల్ఫ్రీ ఆప్షన్‌తోపాటు 12 టచ్-సెన్సిటివ్ హవర్ మార్కర్స్ ఉంటాయి. వాచ్‌ను ధరించిన వారు ఈ మార్కర్స్పై ఫింగర్‌ను స్కాన్ చేయడం ద్వారా టైమ్ తెలుసుకోవచ్చు. ఈ వాచ్.. టాక్టిల్, వైబ్రేషన్ వాచ్‌ల సమ్మిళతంగా ఉంటుంది. అయితే వైబ్రేషన్ వాచ్‌లలో 20పైగా ఉండే వైబ్రేషన్ పల్సెస్‌ను ఈ వాచ్‌లో 2 పల్సెస్‌కు తగ్గించారు. టాక్టిల్ వాచ్‌కు ఉండే సులువుగా విరిగిపోయే స్వభావం ఇందులో ఉండదు. వీటితోపాటు హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, హైడ్రేషన్ రిమైండర్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంధుల కోసం ప్రస్తుతం ఉన్న స్మార్ట్ వాచ్‌లు ఆడియో ఆధారిత అవుట్‌పుట్‌తో పనిచేసేవి కావడం వల్ల వాటిని ధరించిన వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. ఈ ఇబ్బంది లేకుండా ఐఐటీ కాన్పూర్ ఈ హాప్టిక్ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
‘జెండాను తాకగానే దేశభక్తిని అనుభూతి చెందుతున్నా’
తగరపువలస (భీమిలి): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఇండియన్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎండాడలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జాతీయ జెండా చేత పట్టుకుని పరవశించిపోయింది. మాధురి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఆగస్టు 15న స్కూల్లో జెండా ఎగురవేసేవారు. కానీ.. ఇప్పటివరకు నేను జాతీయ జెండాను చూడలేదు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన జెండాను తాకడం ద్వారా దేశభక్తిని అనుభూతి చెందుతున్నాను’ అని తెలిపింది. ఆమె భావాలను భారత తపాలా శాఖ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ ‘ఈ వీడియో ద్వారా ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి చేరువ అయినట్టు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మాధురిని ప్రిన్సిపాల్ ఎం.మహేశ్వరరెడ్డి అభినందించారు. మాధురి మాటలను ట్విట్టర్లో షేర్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, రీ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ (ఇన్సెట్లో మాధురి) -
చదువు చెప్పిస్తూ.. భరోసా కల్పిస్తూ .. అంధుల జీవితాల్లో ‘వెలుగు’ రేఖ
ఈ పోటీ ప్రపంచంలో అడుగు తీసి అడుగు వేయాలన్నా ఏదో తెలియని భయం వెనక్కు లాగుతూనే ఉంటుంది. ఆర్థిక స్థోమత.. కుటుంబ నేపథ్యం.. పరిస్థితులు.. ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవాంతరం ఉండనే ఉంటుంది. అన్నీ అవయవాలు బాగున్న వాళ్ల పరిస్థితే విజయం, అపజయం మధ్య ఊగిసలాడుతుంటుంది. అలాంటిది అసలు కళ్లే కనిపించకపోతే. అందునా ఎవరి ప్రోత్సాహం లేకపోతే.. లోకులు కాకులైతే.. ఆ జీవితం ‘అంధకారమే’. అదే చీకటి సంధించిన ప్రశ్నలకు సమాధానంగా వేసిన అడుగు.. ఓ అంధుని బంగారు భవితకు బాటగా మారింది. అలాంటి ఎన్నో జీవితాల్లో ‘వెలుగు’లు నింపుతోంది. గూడూరు(తిరుపతి జిల్లా): ఓజిలి మండలం, కురుగొండకు చెందిన బచ్చల సుబ్బారెడ్డి, సుదర్శనమ్మల రెండో సంతానం శివకుమార్‌రెడ్డి. ఐదేళ్ల వయసులోనే చూపు మందగించింది. క్రమంగా అంధత్వానికి దారితీసింది. విధి ఆ చిన్నారికి చూపు లేకుండా చేసిందే కానీ.. ఆ వయస్సులోనే విద్యపై చిగురించిన ఆసక్తిని తుడిచేయలేకపోయింది. కళ్లే కనిపించని పిల్లాడికి చదువు ఎందుకన్నారు.. ఇంట్లో వాళ్ల మెదళ్లలోనూ ఆ విషబీజం నాటుకుంది. ఆ పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం అండగా నిలిచింది. చదువుకుంటేనే తాను సమాజంలో నిలదొక్కుకోగలననే విషయం అర్థమైంది. అలా మొక్కవోని దీక్ష తోడు కావడంతో పదో తరగతి వరకు వెంకటగిరిలో.. ఆ తర్వాత ఇంటర్మీడియెట్, డిగ్రీ తిరుపతి ఎస్వీ ఆర్ట్ కళాశాలలో పూర్తయింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్‌లో ఎంఏ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ మాస్‌కమ్యూనికేషన్ చేసి విమర్శలకు నోళ్లు మూయించాడు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీలతో పాటు డిప్లొమో ఇన్ కమ్యూనికేట్ ఇంగ్లిష్, డిప్లొమో ఇన్ హ్యూమన్ రైట్స్, డిప్లొమో ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పూర్తిచేసి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్నారు. యూజీసీ ప్రతి ఏటా నిర్వహించే మాస్ కమ్యూనికేషన్ పరీక్షను మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేసి ఏఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా దేశంలోనే ఆ ఖ్యాతి దక్కించుకున్న తొలి అంధ విద్యార్థిగా నిలవడం విశేషం. పది మందికి సహాయపడాలని.. చదువుకుంటున్న రోజుల్లోనే తనలాంటి వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. ఈ కోవలోనే తల్లిదండ్రులు.. సోదరుడు నారాయణరెడ్డి, వదిన లీలావతి సహకారంతో నెల్లూరులోని బాలాజీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొందరు అంధులను చేరదీశాడు. వాళ్లకు చదువు చెప్పిస్తూ బాగోగులు చూసుకున్నాడు. ఇదంతా ఉద్యోగం రాకముందు వచ్చిన ఫెలోషిప్ డబ్బుతోనే సాధించారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం వరించడంతో ఆయన చేరదీసిన అంధుల సంఖ్య కూడా పెరిగింది. అలా ఓ అంధుల పాఠశాలను ఏర్పాటు చేసి సుమారు 40 మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో.. ఉద్యోగం వచ్చే వరకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇంట్లో, బయటా వీడేం చదువుతాడు.. దండగన్న వాళ్లే. ఎంతో కుంగిపోయేవాన్ని. విద్యలో రాణిస్తున్న కొద్దీ నా పట్ల అందరి దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ప్రోత్సాహం లభించింది. జీవితంలో స్థిరపడాలనే దృఢ సంకల్పం నన్ను విజయతీరాలకు చేర్చింది. ఇప్పుడు నేను మరికొందరికి సహాయం చేసే స్థితిలో ఉండడం గర్వంగా ఉంది. అప్పటి కష్టాలను ఈ జీవితం మరిపిస్తోంది. – శివకుమార్‌రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్, నెల్లూరు రోడ్డు దాటేందుకే గంట.. నేను 2001లో హైదరాబాద్‌లో డిగ్రీ చదివే రోజుల్లో షాపింగ్‌కు వెళ్లా. అక్కడ రోడ్డు దాటేందుకు ఏ ఒక్కరూ సాయం చేయలేదు. సుమారు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులే.. చదువుతో పాటు చదరంగంలోనూ పట్టు సాధించే క్రమంలో ఇతర రాష్ట్రాల్లో పర్యటించా. మూడు పర్యాయాలు జాతీయ స్థాయిలో రాణించా. ఆయా రాష్ట్రాల్లో అంధులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉండటాన్ని గమనించా. అయితే మన రాష్ట్రంలో అంధులు అధిక శాతం కిందిస్థాయి ఉద్యోగులుగానే ఉండిపోతున్నారు. .. ఈ రెండు ఘటనలు నాలో కసిపెంచాయి. ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు మంచి స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత నాలాంటి వాళ్లకు ఉన్నంతలో అండగా నిలవాలనుకున్నా. ఇలాంటి చీకటి జీవితాలకుశివకుమార్ దిక్సూచి ఆయన చలువతోనే.. శివన్న సహకారంతో 9వ తరగతి నుంచి బీకాం వరకు చదువుకున్నా. ఆయనను కలిశాక జీవితంపై నాలో పట్టుదల పెరిగింది. ఆ కసితోనే ఎల్ఐసీలో ఏఓగా(అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) ఉద్యోగం సాధించా. ఇప్పుడు నా జీతం రూ.80వేలు. నా కుటుంబానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇదంతా ఆయన చలువే. – బి.సురేష్, గుడినరవ, ఉదయగిరి మండలం కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో.. నాకు ఐదేళ్ల వయసు నుంచి శివన్నే చదివిస్తున్నారు. ప్రస్తుతం బీకాం రెండో సంవత్సరం. మొదటి సంవత్సరంలో 9.3 గ్రేడ్ వచ్చింది. బాగా చదవి అన్నకు మంచి పేరు తీసుకొస్తా. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. – యనమల జీవిత, ముత్యాలపాడు, చిల్లకూరు మండలం భుజం తట్టండి.. చూపు లేకపోవడం మా తప్పు కాదు. అంత మాత్రాన సమాజం మమ్మల్ని చులకనగా చూడటం సరికాదు. ఇలా చేయడం మమ్మల్ని ఎంతగానో కుంగదీస్తుంది. శివన్నలా భుజం తట్టి ప్రోత్సహిస్తే మేము కూడా అద్భుతాలు సృష్టిస్తాం. – ఎస్.తరుణ్, కొణిదెల, కర్నూల్ జిల్లా -
పుట్టుకతోనే కళ్లు లేని కొడుకు.. పేగు బంధాన్ని మరచిన కన్నతల్లి..
మిర్యాలగూడ: ఓ తల్లి పేగు బంధాన్ని మరిచి అంధుడైన కుమారుడిని సాగర్ ఎడమ కాల్వలోకి తోసేసింది. దీంతో ఆ బాలుడు గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన నల్లగంతుల సోములు, శైలజ దంపతులకు ముగ్గురు సంతానం. ఎనిమిదేళ్ల క్రితం భర్త సోములు చనిపోవడంతో శైలజ కొంతకాలంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో ముగ్గురు కుమారులైన రాజు, గోపీచంద్ (14), యోగేశ్‌లతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. అక్కడే పలువురి ఇళ్లల్లో పనిచేస్తూ కుమారులను పోషిస్తోంది. మొదటి కుమారుడు రాజు నల్లగొండ లో ఇంటర్ మొదటి సంవత్సరం, మూడో కుమారుడు యోగేశ్ 4వ తరగతి చదువుతున్నారు. రెండో కుమారుడైన గోపీచంద్ పుట్టుకతో అంధుడు కావడంతో నల్లగొండ పట్టణంలోని బధిరుల పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. గోపీచంద్ వయస్సు పెరుగుతున్నకొద్దీ మానసిక స్థితిని కోల్పోతూ తోటి విద్యార్థులను గాయపరుస్తుండటంతో ఈ విద్యా సంవత్సరం బాలుడిని చేర్పించుకునేందుకు ఇష్టపడలేదు. సాగర్ ఎడమ కాల్వ వంతెన దగ్గర బాలుడిని తోసేసి.. బాలుడి చేష్టలతో విసుగు చెందిన తల్లి.. అతడిని తీసుకొని శనివారం నల్లగొండ నుంచి బస్సులో బయలుదేరింది. వేములపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడ నుంచి సాగర్ ఎడమ కాల్వ వంతెన సమీపంలో కుమారుడు గోపీచంద్‌ను నీటిలోకి తోసేసింది. అక్కడ ఈత కొడుతున్న ఇద్దరు యువకులు ఇది గమనించి పోలీసులకు సమాచా రం అందించారు. వాళ్లు వెంటనే శైలజను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి కోసం గాలిస్తున్నారు. -
ఆమె చూడలేదు కానీ, కరోనా బాధితుల కంటివెలుగు!
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పాజిటివ్ వచ్చి క్షేమంగా కోలుకున్నారంటే...‘‘హమ్మయ్య బతికిపోయాం’’ అనుకుంటున్నారు చాలామంది. చూపులేని టిఫనీ బ్రార్ మాత్రం అలా అనుకోలేదు. తనలా ఇబ్బందిపడే∙వారందరికి చేయూతనిచ్చేందుకు వెంటనే రంగంలోకి దిగి అనేకమంది అంధులకు చేయూతనిస్తోంది. కేరళకు చెందిన 30 ఏళ్ల టిఫనీ మనందరిలా చూడలేదు. అంధురాలు. అయినా తాను చేయగలిగినంత సాయం చేస్తూ సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. ఇటీవల న్యూడిల్లీలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏప్రిల్‌లో టిఫనీ అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తరువాత టిఫనీకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో తను ఇంటికే పరిమితమైంది. తన కేర్ టేకర్ వినీతక్క సాయంతో ఎలాగోలా కోవిడ్‌నుంచి కోలుకుంది. ఇంటికే పరిమితమైన టిఫనీకి తనలాంటి అంధులు ఈ సమయంలో ఎలా ఉంటున్నారో అని మనస్సులో ఆందోళనగా ఉండేది. ఈ క్రమంలోనే తన క్వారంటైన్ సమయం ముగియగానే వెంటనే అంధులను ఆదుకునేందుకు రంగంలో దిగింది. ఈ క్రమంలోనే కేరళలోని మలప్పురం, కోజీకోడ్‌లో గత కొన్నేళ్లుగా సేవలందిస్తోన్న‘జ్యోతిర్గమయ ఫౌండేషన్’ ద్వారా తన సేవలను ప్రారంభించింది. టిఫనీ రోజు ఫోన్ ద్వారా వైకల్యం కలిగిన పిల్లలతో మాట్లాడుతూ వారికి ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించడం, వారి సాధక బాధలను తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తోంది. జ్యోతిర్గమయ.. 2012లో టిఫనీ స్థాపించిన జ్యోతిర్గమయ ఫౌండేషన్ అంధత్వంతో బాధపడుతోన్న వారిని చేరదీసి వారికాళ్ల మీద నిలబడేందుకు ప్రోత్సహిస్తూ శిక్షణ ఇస్తుంది. ట్రైనింగ్‌లో భాగంగా వ్యక్తిగత వస్త్రధారణ, పరస్పర నైపుణ్యాలు, వంటచేయడం, ఇంగ్లీష్‌లో మాట్లాడడం, కరెన్సీ నోట్లను గుర్తించడం, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం, చెస్ వంటి ఆటలు నేర్పిస్తోంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటిదాక సుమారు రెండువందల మందికిపైగా లబ్ధి పొందారు. దీంతో టిఫనీని అందరు మోడ్రన్ హెలెన్ కెల్లర్ అని సంబోధిస్తుంటారు. దృష్టి లోపంతో బాధపడుతోన్న చిన్న పిల్లలకు కిండర్ గార్డెన్ స్కూలును ప్రారంభించింది. వీరికి ఉచిత వసతి, విద్య సదుపాయాన్ని కల్పించడం విశేషం. టిఫనీ చేస్తోన్న సామాజికసేవకు గుర్తింపుగా ఆమెను అనేక అవార్డులు వరించాయి. అమెరికాలోని లైట్ హౌస్ ఫర్ ది బ్లైండ్ నుంచి హోల్మాన్ ప్రై–2020, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ విభాగం 2017లో ‘బెస్ట్ రోల్ మోడల్’ అవార్డుతో సత్కరించింది. చదవండి: ఆరు నిమిషాల నడక పరీక్షతో ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చు -
అనాథ పిల్లల ఆథ్యాత్మిక యాత్ర
తిరుపతి సెంట్రల్: ఒకరు తల్లిని కోల్పోతే.. ఇంకొకరికి తండ్రి లేడు..తల్లీ తండ్రీ లేని అభాగ్యులూ ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ..పైగా అందరూ దివ్యాంగులు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ అనాథాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఆ 17 మందికీ ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న బలమైన కోరిక ఉండేది. కానీ ఇందుకు ఆర్థిక పరిస్థితి, అంగవైకల్యం అడ్డుపడేవి. అయితే వారి సంకల్పానికి దైవ బలం తోడై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతుల ఔదార్యంతో వారి చిరకాల వాంఛ తీరింది. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొనడంతో పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, గోల్డెన్ టెంపుల్, గోవిందరాజ స్వామి ఆలయాలను సందర్శించారు. దీంతో చిన్నారుల మోములో ఆనందం వెల్లివిరిసింది. వైవీ సుబ్బారెడ్డిని ఎలా కలిశారంటే.. శ్రీకాకుళానికి చెందిన సామాజికవేత్త సిద్ధార్థ చాలా కాలం నుంచి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 17 మంది దివ్యాంగ బాలలు ఉన్నారు. ఆశ్రమంలో ఉన్న వారందరూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చాలాకాలం నుంచి సిద్ధార్థకు చెప్పేవారు. ఈ తరుణంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే సింహాచలం దేవస్థానానికి దర్శనార్థం వెళ్లారు. సిద్ధార్థ ఆయన్ని కలిసి అనాథ పిల్లలకు శ్రీవారి దర్శనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు వైవీ సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారు. వారందరికీ సొంత ఖర్చులతో దర్శన ఏర్పాట్లతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆదివారం తిరుపతిలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు వారికి నూతన వస్త్రాలను అందజేసి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. -
ఆర్బీఐ ‘మనీ’ యాప్
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరికొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. కంటిచూపు సరిగ్గాలేని వారు కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ‘మనీ’ పేరుతో ఈ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకు వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈయాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను ఐవోఎస్ ఆపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ వంటి వాటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు దీనిని ఉచిత డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంది ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది మనీ యాప్ డౌన్లోడ్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళండి. మణి’ అని టైప్ చేయండి. ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ అప్లికేషన్ యాక్స్‌స్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్‌ను ఓసారి డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో లేకపోయినా అంటే ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా పని చేస్తుంది. . మనీ యాప్ ఎలా ఉపయోగించాలి? వినియోగదారులు మాని అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత, మొబైల్ కెమెరాను ఉపయోగించి కరెన్సీ నోట్‌ను స్కాన్ చేస్తే, హిందీ, ఆంగ్ల భాషలలో నోట్ విలువ ఆడియో వినిపిస్తుంది. అయితే మని యాప్ నకిలీ నోట్లను గుర్తించలేదని ఆర్బిఐ స్పష్టం చేసింది. కాగా 2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్ తర్వాత ఆర్బీఐ 'మహాత్మా గాంధీ సిరీస్' కింద కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది. రంగు, డిజైన్, పరిమాణాలలో గణనీయమైన మార్పులతో కొత్త కరెన్సీ నోట్లను రూ .2000, రూ .500, రూ .200, రూ .100, రూ .50, రూ .20 రూ.10 నోట్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని గుర్తించిడంలో అంధులు అనేక సమస్యలను ఎదుర్కొన్న నేపథ్యంలో తాజాగా ఈ యాప్‌ను తీసుకొచ్చింది. -
దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్
తిరువనంతపురం: ‘ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకండి.. ప్రయత్నాన్ని విరమించకండి. మనం చేసే కృషే మనకు కావాల్సింది సాధించి పెడుతుంది’ అంటూ దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా నియమితురాలైన ప్రంజల్ పాటిల్ (30) పిలుపునిచ్చారు. సోమవారం ఆమె తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఆమె ఆరేళ్ల లేత ప్రాయంలోనే చూపును కోల్పోయారు. అయితే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశను మాత్రం కోల్పోలేదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీపట్టా పొందారు. అనంతరం 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై, యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఓ సందర్భంలో తెలిపారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స విఫలమైనందు వల్ల కూడా నొప్పిని అనుభవించానని తెలిపారు. తిరువనంతపురంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో సామాజిక న్యాయ విభాగం సెక్రటరీ బిజు ప్రభాకర్ పాల్గొన్నారు. -
సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రాంజల్
తిరువనంతపురం : ప్రాంజల్ పాటిల్ తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలకగా, అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ కే గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో ప్రాంజల్ సబ్ కలెక్టర్ట్గా బాధ్యతలు చేపట్టారు. కాగా చూపు లేకున్నా ప్రాంజల్ పాటిల్ తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 773 ర్యాంక్ సాధించారు. ప్రాంజల్ కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్ అధికారి కావడం గమనార్హం. ప్రాంజల్ పాటిల్‌కు ఆరేళ్ల వయసులో తరగతి గదిలో సహ విద్యార్థి పొరపాటున పెన్సిల్‌తో కంట్లో గుచ్చాడు. దాంతో ఆ కన్ను చూపు కోల్పోగా, ఆ గాయం తాలూకు ఇన్ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది. నెమ్మదిగా ఆ కన్ను చూపు కూడా కోల్పోయింది. అయితే ప్రాంజల్ అమ్మానాన్న మాత్రం ఆమెను ఎన్నడూ అంధురాలిగా చూడలేదు. జీవితం పట్ల ఓ దృక్ఫదంతో పాటు కలలు కనేలాగానే పెంచారు. దాదర్‌లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్‌లో పాఠశాల విద్య, చండీబాయి కాలేజ్‌లో ఇంటర్ చేసింది. 2015లో ఎమ్‌ఫిల్ చేస్తూ ఐఏఎస్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టిన ప్రాంజల్ తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో తాను ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకున్నారు. -
ఆదర్శం ఈ కశ్మీరీ బ్రదర్స్..!
శ్రీనగర్ : పరీక్షల్లో ఫెయిలయ్యామని ఒకరు, కోరుకుంది దక్కలేదని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా క్షణికావేశంలో నిండు ప్రాణాలు బలిపెడుతున్న వారికి ఈ అన్నదమ్ములు ఒక పాఠం. పుట్టుకతోనే అంధులయినా గులామ్ నభి తేలి (45), మొహమ్మద్ హుస్సేన్ (40) ఏనాడు ఆధైర్య పడలేదు. తండ్రి మార్గనిర్దేశంలో నడిచి సొంత కాళ్లపై నిలబడ్డారు. డెహ్రాడూన్‌లోని జాతీయ అంధుల సంస్థలో బ్రెయిలీ లిపి, కొన్ని హోమ్ సైన్స్ ప్రొగ్రాములు నేర్చుకుని పరుపుల తయారీలో నైపుణ్యం సాధించారు. జీవితాన్ని జీవించేందుకే అని చాటిచెబుతూ.. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భూమికి భారంగా మారాం అని కాకుండా..కష్టించి పనిచేయాలని సూచిస్తున్నారు. కళ్లు లేకపోతేనేమీ.. కాస్తంత తెలివి.. ఇంకాస్త సత్తువ ఉన్నాయి కదా అంటున్నారు. ‘ఎవరో మనపై జాలి చూపించే బదులు.. మనమే జాలీగా ఉంటే సరిపోద్ది. చేసే పనిని ప్రేమించడమే మా ఆనందానికి మూలం’ అని పనిలో మునిగారు కశ్మీరీ అన్నదమ్ములు. ఇక వీరు తయారు చేసే పరుపులకు స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. డీలర్లు తేలి బ్రదర్స్‌కు ఆర్డర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతుంటారు. ‘జాతీయ అంధుల సంస్థలో ట్రెయినింగ్ తీసుకుని సొంత కాళ్లపై నిలబడ్డాం. మా తల్లిదండ్రులు యాచక వృత్తికి వ్యతిరేకం. అదొక్కటి తప్పించి బతకడానికి మరే పని చేసినా ఫరవాలేదని చెప్తారు. మా నాన్నతో కలిసి పనిచేయడం. కుటుంబ పోషణలో భాగం కావడం నిజంగా ఆనందంగా ఉంది’ అన్నారు మొహమ్మద్ హుస్సేన్. -
ఆ బాలిక జ్ఞాపకశక్తి అమోఘం
మీరట్: ఆమె ఓ ముస్లిం బాలిక. వయసు ఏడేళ్లు కనుచూపు 80శాతం వరకు లేదు. అందువల్ల పెద్దగా పుస్తకాలు చదువలేదు.. బ్రెయిలీ లిపిని కూడా వల్లె వేయలేదు. కానీ, ఆ బాలికకు ఉన్న ప్రజ్ఞ అంతా ఇంతా కాదు. ఏకంగా భగవద్గీతను తన మనసులో అక్షరం పొల్లు కూడా మర్చిపోలేనంత. ఎవరైనా భగవద్గీత చెప్పమ్మా అని ఇలా అడుగుతుంటారో లేదో వెంటనే తన రెండు చేతులు జోడించి దేవుడిని స్మరిస్తూ టకటకా భగవద్గీత ఆసాంతం వినిపిస్తుంది. ఇది మీరట్‌కు చెందిన రిదా జెరా అనే ఏడేళ్ల ముస్లిం బాలిక సాధిచిన ఘనత. పాఠాలు బోధించి, పేజీలపేజీలు బట్టీలు పట్టించినా తెల్లవారే సరికి ఒక పేజీ కూడా గుర్తు పెట్టుకోలేని విద్యార్థులు ఉన్న ఈ రోజుల్లో ఏకంగా భగవద్గీత మొత్తాన్ని కేవలం వినడం ద్వారా పూర్తిగా జ్ఞప్తికి పెట్టుకోవడం సాధారణ విషయమేమి కాదు. ఆమె ఏ మతానికి సంబంధించిన గ్రంథాన్ని చదువుతుందన్నది ప్రస్తుతం ప్రధాన అంశంకాదు కానీ, ఆమెకున్న జ్ఞాపక శక్తి మాత్రమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. జెరా చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయుడు ఆమె జ్ఞాపక శక్తికి అబ్బురపడి భగవద్గీత మొత్తం ఆమెకు వినిపించగా దాన్ని విని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చక్కగా చెప్తోంది. 'నేను ఖురాన్ చదువుతున్నా, గీత చదువుతున్నా దేవుడిని ప్రార్థిస్తున్నట్లే చదువుతాను. నేను ఏ దేవుడికి ప్రార్థిస్తున్నానన్నది ముఖ్యం కాదు. నేను ఇప్పటి వరకు ఏ దేవుడిని చూడలేదు. ఒక వేళ ఎదురుగా వచ్చినా చూడలేను' అని ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న జెరా చెప్పింది. ప్రస్తుతం ఆమె మీరట్ లోని జాగృతి విహార్లోగల బ్రిజ్ మోహన్ అంధుల పాఠశాలలో చదువుతోంది. -
అంధ భక్తులపై ఖాకీల నిర్వాకం
రామేశ్వరం: కొందరు అంధులపట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. రామేశ్వరంలోని శ్రీ రామనాథ స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లినవారిని అడ్డుకోవడమే కాకుండా వారిని వేధింపులకు గురి చేశారు. దీంతో వారంతా మంగళవారం అదే ఆలయం ముందు ధర్నాకు దిగి ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన అంధ భక్తులు శ్రీ రామనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో తనిఖీకోసం ప్రత్యేక క్యూ ఉందని వారికి తెలియదు. పైగా వారికి చూపులేనందున ఆ విషయం ముందుగా తెలుసుకోలేకపోయారు. అందుకే ఆలయంలోకి వెళ్లేందుకు ద్వారం వద్దకు వెళ్లిన 12మంది అంధులను అమానుషంగా నలుగురు పోలీసులు ఈడ్చుకెళ్లారు. వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసినా భాషరాని కారణంగా చెప్పలేకపోయారు. దీంతో పోలీసులకు వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆ అంధ భక్తులకు మరికొందరు భక్తులు తోడై ఆందోళనకు దిగారు.