Tiffany Brar: Helps To Covid Patients | కరోనాలో కంటివెలుగు! - Sakshi
Sakshi News home page

Tiffany Brar: కరోనాలో కంటివెలుగు!

Published Tue, May 11 2021 12:04 PM | Last Updated on Thu, May 13 2021 1:38 PM

Visually challenged Activist Tiffany Brar Helped To Disable Corona Patients - Sakshi

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చి క్షేమంగా కోలుకున్నారంటే...‘‘హమ్మయ్య బతికిపోయాం’’ అనుకుంటున్నారు చాలామంది. చూపులేని టిఫనీ బ్రార్‌ మాత్రం అలా అనుకోలేదు. తనలా ఇబ్బందిపడే∙వారందరికి చేయూతనిచ్చేందుకు వెంటనే రంగంలోకి దిగి అనేకమంది అంధులకు చేయూతనిస్తోంది.

కేరళకు చెందిన 30 ఏళ్ల టిఫనీ మనందరిలా చూడలేదు. అంధురాలు. అయినా తాను చేయగలిగినంత సాయం చేస్తూ సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. ఇటీవల న్యూడిల్లీలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు  ఏప్రిల్‌లో టిఫనీ అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తరువాత టిఫనీకి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో తను ఇంటికే పరిమితమైంది. తన కేర్‌ టేకర్‌ వినీతక్క సాయంతో ఎలాగోలా కోవిడ్‌నుంచి కోలుకుంది. ఇంటికే పరిమితమైన టిఫనీకి తనలాంటి అంధులు ఈ సమయంలో ఎలా ఉంటున్నారో అని  మనస్సులో ఆందోళనగా ఉండేది.

ఈ క్రమంలోనే తన క్వారంటైన్‌ సమయం ముగియగానే వెంటనే అంధులను ఆదుకునేందుకు రంగంలో దిగింది. ఈ క్రమంలోనే కేరళలోని మలప్పురం, కోజీకోడ్‌లో గత కొన్నేళ్లుగా సేవలందిస్తోన్న‘జ్యోతిర్గమయ ఫౌండేషన్‌’ ద్వారా తన సేవలను ప్రారంభించింది. టిఫనీ రోజు ఫోన్‌ ద్వారా వైకల్యం కలిగిన పిల్లలతో మాట్లాడుతూ వారికి ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించడం, వారి సాధక బాధలను తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తోంది.

జ్యోతిర్గమయ..
2012లో టిఫనీ స్థాపించిన జ్యోతిర్గమయ ఫౌండేషన్‌ అంధత్వంతో బాధపడుతోన్న వారిని చేరదీసి వారికాళ్ల మీద నిలబడేందుకు ప్రోత్సహిస్తూ శిక్షణ  ఇస్తుంది. ట్రైనింగ్‌లో భాగంగా వ్యక్తిగత వస్త్రధారణ, పరస్పర నైపుణ్యాలు, వంటచేయడం, ఇంగ్లీష్‌లో మాట్లాడడం, కరెన్సీ నోట్లను గుర్తించడం, ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం, చెస్‌ వంటి ఆటలు నేర్పిస్తోంది. ఈ  ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటిదాక సుమారు రెండువందల మందికిపైగా లబ్ధి పొందారు. దీంతో టిఫనీని అందరు మోడ్రన్‌ హెలెన్‌ కెల్లర్‌ అని సంబోధిస్తుంటారు.

దృష్టి లోపంతో బాధపడుతోన్న చిన్న పిల్లలకు కిండర్‌ గార్డెన్‌ స్కూలును ప్రారంభించింది. వీరికి ఉచిత వసతి, విద్య సదుపాయాన్ని కల్పించడం విశేషం. టిఫనీ చేస్తోన్న సామాజికసేవకు గుర్తింపుగా ఆమెను అనేక అవార్డులు వరించాయి. అమెరికాలోని లైట్‌ హౌస్‌ ఫర్‌ ది బ్లైండ్‌ నుంచి హోల్మాన్‌ ప్రై–2020, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌ విభాగం 2017లో ‘బెస్ట్‌ రోల్‌ మోడల్‌’ అవార్డుతో సత్కరించింది.
చదవండి: ఆరు నిమిషాల నడక పరీక్షతో ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement