మొన్న డెల్టా, ఒమిక్రాన్‌.. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఫ్లురోనా.. అసలు దీని కథేంటి? | What is Flurona, Here Is All We Know About The Double Infection | Sakshi
Sakshi News home page

Flurona: మొన్న డెల్టా, ఒమిక్రాన్‌.. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఫ్లురోనా.. అసలు దీని కథేంటి?

Published Sun, Jan 9 2022 8:55 PM | Last Updated on Sun, Jan 9 2022 8:59 PM

What is Flurona, Here Is All We Know About The Double Infection - Sakshi

కరోనా రావడమేమో గానీ అది ప్రజలకు చాలా కొత్త పదాలు నేర్పింది. ఉదాహరణకు... స్ట్రెయిన్, వేరియంట్, డెల్టా, ఒమిక్రాన్‌... లాంటివి.  తాజాగా ఇప్పుడు ‘ఫ్లురోనా’ అనే సరికొత్త పదం కూడా మంచి ట్రెండింగ్‌లో ఉంది. అదేదో మనమూ తెలుసుకుందాం రండి. 

ఇజ్రాయెల్‌లో ఇద్దరు గర్భిణులకు అటు ‘కరోనా’తో పాటు ఇటు ఇన్‌ఫ్లుయెంజాగా పిలిచే ‘ఫ్లూ’ లక్షణాలు కనిపించడంతో మొట్టమొదటిసారిగా ‘ఫ్లురోనా’ అనే పదం పుట్టింది. తొలుత ఇజ్రాయెల్‌లో, ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్, ఫిలిప్పిన్స్, హంగరీలలోనూ ఈ తరహా కేసులు రావడం మొదలైంది. సాధారణ కరోనా లక్షణాలైన రుచీ, వాసనలు కోల్పోవడంతో  పాటు ‘ఫ్లూ’లో విస్తృతంగా కనిపించే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను గమనించిన డాక్టర్లు... ఈ కొత్త వ్యాధిని ‘ఫ్లురోనా’గా పిలవడం మొదలుపెట్టారు. 
చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు.. ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

అన్నట్టు సమస్య పాతదా, కొత్తదా? 
‘ఫ్లురోనా’ కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ... ఈ సమస్య పాతదా, కొత్తదా అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. ఎందుకంటే 2020  ఫిబ్రవరిలో  ఇలాంటి లక్షణాలతోనే ఓ వ్యక్తి న్యూయార్క్‌ హాస్పిటల్‌లో చేరినట్టు ‘ద అట్లాంటిక్‌’ అనే జర్నల్‌ వెల్లడించింది. ఈ వ్యక్తిని పరీక్షించినప్పుడు తొలుత అతడికి ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ ఉందనీ, కొన్ని వారాల తర్వాత మళ్లీ పరీక్షించినప్పుడు ఈసారి కరోనా కూడా ఉందని  తేలింది. దాంతో వారాల వ్యవధిలో అతడి కుటుంబ సభ్యులందరినీ  పరీక్షించగా వారందరికీ ఇటు ‘కరోనా’ అటు ‘ఇన్‌ఫ్లుయెంజా’... ఈ రెండు వైరస్‌లూ ఉన్నట్లు తేలింది. తాజాగా యూఎస్‌లోని హ్యూస్టన్‌లో క్రిస్‌మస్‌ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కొందరికి కరోనా, ఇన్‌ఫ్లుయెంజా... రెండూ ఉన్నట్లు తెలియవచ్చింది. ఓ కేస్‌ స్టడీలా ‘అలెక్‌ జెర్లీన్‌’ అనే విద్యార్థిని పరీక్షించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. 

ఇదేమీ కొత్త కాదు... 
ఇలా రెండు రెండు సమస్యలు ఉండటం కొత్త విషయమేమీ కాదంటున్నారు ఫిలిప్పిన్స్‌ వైద్య పరిశోధకులు. ఆ దేశానికి చెందిన నేషనల్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూపు సభ్యుల్లో ఒకరైన డాక్టర్‌ ఎడ్సెల్‌ సల్వానా మాట్లాడుతూ... గతంలోనూ ఇలాంటి కొన్ని కేసులు చూశామనీ... చైనాకు చెందిన ఒక రోగిలో కోవిడ్‌–19, ఇన్‌ఫ్లుయెంజా, నిమోనియాను కలిగించే స్ట్రెప్టోకోకస్‌ లాంటి అనేక సమస్యలను తాము చూసిన దాఖలాలున్నాయంటూ వివరించారు. 
చదవండి: కరోనా, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల.. 300 భవనాలకు సీల్‌ 

ఇక బ్రెజిల్‌లో సైతం ఓ పక్క ‘ఒమిక్రాన్‌’ కేసులు రావడం మొదలు కాగానే... ఇలాంటి ఫ్లురోనా కేసులు కనిపిస్తున్నాయంటూ అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు.  తమ దేశంలోనూ ఇప్పటి వరకు అధికారికంగా  కనీసం ‘ఆరు’ ఫ్లురోనా కేసులు కనిపించాయని, ఇంకా 17 కేసులను క్షుణ్ణంగా విశ్లేషించాల్సి ఉందంటూ... రియో డి జెనీరో మున్సిపల్‌ హెల్త్‌ సెక్రటరీ అయిన డేనియల్‌ సోరాంజ్‌ పేర్కొంటున్నారు.  

ఇదొక్కటే కాదు...  
‘ఫ్లురోనా’ అనే ఓ కొత్త పదం నేర్చుకోవడానికి మాత్రమే మనం పరిమితం కాలేదు. ఇలాంటివే ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు డెల్టా వేరియెంట్‌నూ, ఒమిక్రాన్‌ను కలిపి ‘డెల్‌మైక్రాన్‌’ అని కూడా అంటున్నారు. (ఇదేమీ కొత్త వేరియెంట్‌ కాదు. కేవలం లక్షణాల ఆధారగానే). ఇక లక్షణాలను బట్టి ఇప్పటివరకూ ఈ ‘మహమ్మారి’ని ‘ప్యాండమిక్‌’ అంటూ నిపుణులు  పిలుస్తూ వచ్చారు కదా. ఇప్పుడు... రెండ్రెండు జల్బులు కలిసి వచ్చే ఈ ‘ఫ్లూరోనా’ను కొందరు ‘ట్విన్‌–డమిక్‌’ అంటూ చమత్కారపూరితంగా పిలుస్తుండటం ఓ కొసమెరుపుగా చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement