కనులపండువగారథోత్సవం
నత్తా రామేశ్వరం (పెనుమంట్ర) : నత్తా రామేశ్వరంలో గోస్తనీ తీరాన కొలువైన రామేశ్వరస్వామి ఆలయం నిర్మిం చిన నాటి నుంచి ఆచారంగా వస్తున్న స్వామివారి కల్యాణ ర«థోత్సవం శుక్రవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. రామేశ్వరస్వామి పార్వతీ సమేతుడై ప్రత్యేక అలంకరణలో రథంలో కొలువుదీరారు. రథాన్ని అరటిగెలలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. హరహరమహాదేవ శంభోశంకర అంటూ భక్తులు స్వామివారి రథాన్ని లాగారు. కాగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఈ రథోత్సవానికి హాజరయ్యారు. వేలాది మంది భక్తుల సందడి నడుమ మేళతాళాలతో రథోత్సవం వైభవంగా సాగింది.
వైభవంగా ఆచంటేశ్వరుని రథోత్సవం
ఆచంట : మహాశివరాత్రి పర్వదినం సం దర్భంగా ప్రసిద్ధిగాంచిన ఆచంటేశ్వరాలయం భక్తులతో పోటెత్తింది. ఆచంట పరిసర గ్రామాలకు చెందిన భక్తులు కోడేరులోని వశిష్ట గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మధ్నాహ్నం మూడు గంటలకు పురవీధులగుండా స్వామివారి రథోత్సవం కనుల పండువగా సాగింది. రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మ న్ గొడవర్తి కృష్ణ భగవాన్, ఈవో దండు వెంకట కృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.