
కార్పెంటర్ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక రామేశ్వరంలోని కార్పెంటర్ పుట్టా రఘునాథ్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథ్‌కు భార్య భ్రమరాంబతోపాటు సుబ్రమణ్యం, శ్రీనివాసులు అనే కుమారులు ఉన్నారు. కుమారులు ఇద్దరూ కడప సెయింట్ జోసెఫ్‌లో చదువుతున్నారు. భార్య ఇంటి వద్ద కూరగాయల వ్యాపారం చేస్తోంది. కొన్ని రోజుల నుంచి తాగుడుకు బానిస అయిన రఘునాథ్ పనికి సరిగా వెళ్లడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని భార్యను అడుగగా.. ఆమె ఇవ్వలేదు. అప్పుడప్పుడు అతనికి కడుపు నొప్పి కూడా ఎక్కువగా వస్తుంటుంది. రాత్రి పడుకున్న అతను తెల్లారే సరికి మిద్దెపైన రేకుల కడ్డీలకు ఉరివేసుకున్నాడు. శనివారం విషయం తెలియడంతో వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.