రామేశ్వ‌రం కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్‌ | 2 Men Who Plotted, Planted Bomb At Bengaluru Cafe Arrested From Bengal | Sakshi
Sakshi News home page

రామేశ్వ‌రం కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్‌

Apr 12 2024 4:00 PM | Updated on Apr 12 2024 4:29 PM

2 Men Who Plotted, Planted Bomb At Bengaluru Cafe Arrested From Bengal - Sakshi

కోల్‌కతా: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. కేఫ్‌ పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు బాంబును అమర్చిన ముసావీర్ హుస్సేన్‌ షాజిబ్‌ను పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. తూర్పు మెదీనాపూర్‌లోని కాంతి ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకుంది. కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, కేరళలోని పలు ప్రాంతాల్లో త‌ని‌ఖీల త‌ర్వాత అక్కడి పోలీసుల సాయంతో ఈ అరెస్టుల పరిణామం జరిగింది.

కాగా ఈ కేసులో ప్రధాన నిందితులకు స్థానికంగా స‌హ‌క‌రించిన‌ ముజమ్మిల్ షరీఫ్‌ను కూడా దర్యాప్తు సంస్థ గత నెలలో అరెస్టు చేసింది. షరీఫ్, హుస్సేన్, తాహా ఈ ముగ్గురూ ఐఎస్ఐఎస్‌ మాడ్యూల్స్‌తో సంబంధం కలిగి ఉన్న‌ట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్ల‌డించాయి. గతేడాది నవంబర్‌లో నమోదైన మంగుళూరు కుక్కర్‌ పేలుడు కేసుతో పాటు శివమొగ్గ గ్రాఫిటీ కేసులోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 

ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన నిందితుడు.. కేఫ్‌లో టిఫిన్‌ చేసి.. బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ కేసును ఎస్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. పేలుడుకు పాల్పడిన ఈ ఇద్దరు వ్యక్తులు ఆచూకి తెలిపితే ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తామని.. అందుకు సంబంధిన నిందితుల ఫోటోలను విడుదల చేసి.. ఎన్ఐఏ రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన!.. మంత్రి సంచలన కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement