తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న కొత్త పంబన్ వంతెన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రూపొందుతున్న ఈ వంతెన ఫోటోలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేయడమే ఇందుకు కారణం. కొత్త వంతెనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎక్స్‌లో షేర్ చేస్తూ.. దానికి సంబంధించిన విషయాలు, విశేషాలను ఆయన పంచుకున్నారు.
ఈ బ్రిడ్జి ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతమని కేంద్రమంత్రి కొనియాడారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యిందని, అనేక సార్లు పరీక్షించినట్లు వెల్లడించారు. అయితే కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (CRS) ద్వారా భద్రతా తనిఖీలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.
కొత్త బ్రిడ్జి ద్వారా రామేశ్వరం అభివృద్ధి చెందుతున్నారు. అమృత్ భారత్ స్టేషన్‌ల పథకం ద్వారా రూ. 90 కోట్ల వ్యయంతో రామేశ్వరం రైల్వే స్టేషన్‌ను కూడా అప్‌గ్రేట్ చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ద్వీపానికి పర్యాటకం, వాణాజ్యం, కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. అలాగే రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు.
పాత వంతెన మధ్య నుంచి పడవలు షిప్‌లు వెళ్లాలంటే కష్టమయ్యేది.
16 మంది కార్మికులు పని చేస్తేనే బ్రిడ్జి తెరుచుకుంటుంది.
సముద్ర మట్టానికి 19 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు మాత్రమే వంతెన మధ్య ప్రయాణించేవి
సింగిల్ ట్రాక్ మాత్రమే ఉండేది.
కొత్త బ్రిడ్జి వర్టికల్ లిఫ్ట్ స్పాన్.. పూర్తిగా ఆటోమేటెడ్.
ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా డిజైన్
సముద్ర మట్టానికి 22 మీటర్లు ఎత్తు ఉండే బోట్లు, షిప్‌లు కూడా ప్రయాణించగలవు.
డబుల్ ట్రాక్‌లు, విద్యుదీకరణ కోసం రూపొందించారు.
హై-స్పీడ్ రైలు అనుకూలత, ఆధునిక డిజైన్.
వందే ళ్లపాటు సేవలు
కాగా రామేశ్వరంలోని పంబన్ ద్వీపంలో నిర్మించిన పంబన్ వంతెన గురించి అందరికీ తెలిసిందే. దీనిని 1914 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. అప్పట్లో రూ.20 లక్షలతో నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన న 105 ఏళ్ల పాటు రామేశ్వరం నగరాన్ని ఇతర ప్రధాన భూభాగంతో కలిపింది.
ఇది దేశంలోనే తొలి సముద్ర వంతెన. అంతేగాక 2010లో బాంద్రా- వర్లీ సముద్రపు లింక్‌ను ప్రారంభించే వరకు దేశంలోనే అతి పొడవైన వంతెన కూడా. 2. 06 కి.మీ. పొడవైన వంతెనను 2006-07లో మీటర్‌గేజ్ నుంచి బ్రాడ్‌గేజ్‌కి మార్చారు. 2022లో ఈ వంతెనకు తుప్పు పట్టడంతో దీనిని పూర్తిగా మూసేశారు.
దీని స్థానంలో 2019లో కొత్త వంతెన నిర్మాన్ని ప్రారంభించారు. మార్చి 2019లో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు. ఇది 105 ఏళ్ల నాటి పాంత వంతెనను భర్తీ చేయనుంది.
🚆The New Pamban Bridge: A modern engineering marvel!
🧵Know the details 👇🏻 pic.twitter.com/SQ5jCaMisO— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 29, 2024
Comments
Please login to add a commentAdd a comment