వీడియో: అమ్మాయిల కారును ఛేజ్‌ చేసి మరీ.. | women travelling in a car were seen being pursued by a group of men | Sakshi
Sakshi News home page

వీడియో: అమ్మాయిల కారును ఛేజ్‌ చేసి మరీ..

Published Sat, Feb 1 2025 1:37 PM | Last Updated on Sat, Feb 1 2025 2:07 PM

women travelling in a car were seen being pursued by a group of men

తిరువొత్తియూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయిలను కారులో ఛేజ్‌ చేసి మరీ వేధించారు కొందరు ఆకతాయిలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. అయితే.. ఈ వీడియో ఆధారంగా  కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

చైన్నె సమీపంలోని ముట్టుకాడు ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో గత 25వ తేదీన యువతులు కారులో వెళుతున్నారు. ఆ సమయంలో 2 కార్లలో వచ్చిన 8 మంది యువకులు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి మహిళల కారును అడ్డగించారు. తరువాత వారిని వెంబడించి బెదిరించారు. యువతులను కారుతో ఢీ కొని బెదిరించిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ మేరకు కానత్తూరు పోలీసులు 5 కేసు లు నమోదు చేసి, మహిళలపై అత్యాచారం సహా 5 సెక్షన్‌లుగా విచారణ చేపట్టారు. ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు లోని నిఘా కెమెరాలు తనిఖీ చేసేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. ఒక కారు చంద్రు (26)కి చెందినది. పొత్తే రి నుంచి వచ్చిన కార్లను స్వాధీనం చేసుకుని కానత్తూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

అలాగే యువతులను బెదిరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో కొందరు కాలేజీ విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. ఓ ప్రైవేట్‌ కాలేజీలో చదువుతున్న వారు ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో స్నేహితులతో కలిసి ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో చంద్రుపై చాలా కేసులు ఉన్నట్లు విచారణలో వెలుగు చూసింది. అరెస్టు చేసినవారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. యువతులను బెదిరించిన వారి పూర్తి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement