తమిళనాడు పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యాన్ డ్రైవర్ తను మరణిస్తూ.. 20 మంది పిల్లల ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్ సాహాసాలను మెచ్చిన సీఎం స్టాలిన్ అతడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తిరూప్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..
వివరాలు.. వెల్లకోయిల్‌లో బుధవారం సెమలయ్యప్పన్ అనే 49 ఏళ్ల బస్సు డ్రైవర్ ఓ ప్రైవేటు పాఠశాలకు నుంచి విద్యార్ధులను వాళ్ల ఇంటి వద్ద దింపడానికి బయల్దేరాడు. దారి మధ్యలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రాడంతో బస్సు డ్రైవర్ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అతని భార్య కూడా అదే స్కూల్‌లో హెల్పర్‌గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.
బస్సు రోడ్డు పక్కన ఆగిన కాసేపటికే అతడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అతడు మరణించే ముందు సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము’. అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే మంత్రి ఎంపీ సామినాథన్ మృతుల కుటుంబాలకు చెక్కును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment