చెన్నై: దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా..కొందరి గొంతు మాత్రమే ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి గుర్తుండిపోయే గొంతుక మేడమ్ వలార్మతిది. మన ఇస్రో ప్రయోగించిన పదుల సంఖ్యలో రాకెట్లకు కౌంట్‌డౌన్ చెప్పింది ఈమెనే. 1959లో తమిళనాడులోని అరియలూర్‌లో జని్మంచిన వలార్మతి 1984లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు.
ఇస్రో ప్రయోగించిన రాకెట్‌లకు లాంఛింగ్ కౌంట్‌డౌన్ ఆమే చెప్పేవారు. ఇలా ఈమె విలక్షణమైన కంఠం దేశప్రజలకు సుపరిచితం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని మొదటిసారిగా 2015లో ఈమె అందుకున్నారు. చివరిసారిగా చంద్రయాన్–3 మిషన్ రాకెట్‌కు వలార్మతినే కౌంట్‌డౌన్ చెప్పడం విశేషం. ఇస్రో నుంచి రిటైరైన ఈమె శనివారం సాయంత్రం గుండెపోటుకు గురై చెన్నైలోని ఆస్పత్రిలో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment