Chandrayaan -3: ప్రత్యక్ష ప్రసారం చేయండి.. పాక్ మాజీ మంత్రి | Pak Ex Minister Congratulates India, Calls ISRO Chandrayaan 3 Moon Mission Historic Moment - Sakshi
Sakshi News home page

Pak Ex Minister On Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారం చేయండి.. పాకిస్తాన్ మాజీ మంత్రి

Published Wed, Aug 23 2023 11:25 AM | Last Updated on Wed, Aug 23 2023 12:16 PM

Pak Ex Minister Congratulates India Calls Chandrayaan 3 Historic - Sakshi

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే దృశ్యాలను పాకిస్తాన్‌లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని అక్కడి మీడియాను కోరారు.

శభాష్ ఇండియా.. 
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం అద్భుతమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన భారతీయ శాస్త్రవేత్తలను, అంతరిక్ష సంఘాన్ని అభినందించి చంద్రయాన్-3 మనుష్యజాతి చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఫవాద్ చౌదరి తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్‌లో అరుదైన ఘనతను సాధించనున్న భారతదేశాన్ని, భారత శాస్త్రవేత్తలను అభినందిస్తూనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే అద్భుత దృశ్యాలను పాకిస్తాన్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని కోరారు. 

నాడు విమర్శించిన వారే.. 
చంద్రయాన్-2 విఫలమైన తర్వాత భారత దేశాన్ని, భారత శాస్త్రవేత్తలను ఎగతాళి చేసిన వారిలో ఫవాద్ చౌదరి కూడా ఉన్నారు. అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు. ఆ డబ్బులను పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాలని హితవు కూడా పలికారు. కానీ నేడు ప్రపంచ అగ్ర దేశాలకు సైతం సాధ్యంకాని అరుదైన ఘనతను భారతదేశం సాధిస్తుండతమ్.. విమర్శకులకు కూడా కళ్ళు  తెరిపించింది. విమర్శకుల ప్రశంస కంటే గొప్ప గెలుపు మరొకటుండదు అనడానికి ఇదే నిదర్శనం.   

ప్రపంచ దేశాలు సైతం..  
చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత ఉక్కుసంకల్పానికి చంద్రయాన్-3 ఒక తార్కాణం. చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత భారత దేశం పట్టువిడవకుండా వెనువెంటనే చంద్రయాన్-3కి శ్రీకారం చుట్టింది. మధ్యలో కోవిడ్ -19 కారణంగా కొంత కాలయాపన జరిగినా చివరకు ఈరోజు ఆ అపురూప ఘట్టాన్ని సాక్షాత్కరించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు చంద్రయాన్-3 ఘనవిజయాన్ని చూడాలని  ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్టులు మూసివేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement