information and broadcasting minister
-
PM Ujjwala Scheme: మరో 75 లక్షల ‘ఉజ్వల’కనెక్షన్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)కింద అదనంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,650 కోట్లు కేటాయించింది. దీంతోపాటు, ఈ కోర్ట్స్’ ప్రాజెక్టు మూడో దశకు అనుమతి మంజూరుచేసింది. ఇందుకు గాను రూ.7,210 కోట్లు వెచి్చంచాలని తీర్మానించింది. ఇటీవల ముగిసిన జీ20ని విజయవంతం చేసి, భారత్ ప్రతిష్టను ఇనుమడింప జేసిన ప్రధాని మోదీని ఈ సమావేశం అభినందించింది. ఈ వివరాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. కొత్తగా జారీ అయ్యే 75 లక్షల ఉజ్వల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు అందజేస్తామని తెలిపారు. వీటితో కలిపి ఉజ్వల లబి్ధదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుందన్నారు. దిగువ కోర్టుల్లో రికార్డుల డిజిటైజేషన్, క్లౌడ్ స్టోరేజీ, వర్చువల్ కోర్టుల ఏర్పాటు తదితరాల కోసం నాలుగేళ్లపాటు అమలయ్యే ఈకోర్ట్స్ ప్రాజెక్టు ఫేజ్–3కి రూ.7,210 కోట్లు కేటాయించేందుకు కూడా కేబినెట్ అంగీకరించిందని ఠాకూర్ చెప్పారు. ఇందులో భాగంగా 3,108 కోట్ల డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలోకి మారుతాయని అంచనా. -
Chandrayaan -3: ప్రత్యక్ష ప్రసారం చేయండి.. పాక్ మాజీ మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే దృశ్యాలను పాకిస్తాన్లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని అక్కడి మీడియాను కోరారు. శభాష్ ఇండియా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం అద్భుతమని కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన భారతీయ శాస్త్రవేత్తలను, అంతరిక్ష సంఘాన్ని అభినందించి చంద్రయాన్-3 మనుష్యజాతి చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఫవాద్ చౌదరి తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో అరుదైన ఘనతను సాధించనున్న భారతదేశాన్ని, భారత శాస్త్రవేత్తలను అభినందిస్తూనే చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపే అద్భుత దృశ్యాలను పాకిస్తాన్ మీడియా ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని కోరారు. Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations — Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023 నాడు విమర్శించిన వారే.. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత భారత దేశాన్ని, భారత శాస్త్రవేత్తలను ఎగతాళి చేసిన వారిలో ఫవాద్ చౌదరి కూడా ఉన్నారు. అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు. ఆ డబ్బులను పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాలని హితవు కూడా పలికారు. కానీ నేడు ప్రపంచ అగ్ర దేశాలకు సైతం సాధ్యంకాని అరుదైన ఘనతను భారతదేశం సాధిస్తుండతమ్.. విమర్శకులకు కూడా కళ్ళు తెరిపించింది. విమర్శకుల ప్రశంస కంటే గొప్ప గెలుపు మరొకటుండదు అనడానికి ఇదే నిదర్శనం. Dear Endia; instead of wasting money on insane missions as of Chandrayyan or sending idiots like #abhinandan for tea to across LoC concentrate on poverty within, your approach on #Kashmir ll be another Chandrayyan just price tag ll be far bigger. — Ch Fawad Hussain (@fawadchaudhry) September 7, 2019 Surprised on Indian trolls reaction, they are abusing me as I was the one who failed their moon mission, bhai hum ne kaha tha 900 crore lagao in nalaiqoon per? Ab sabr kero aur sonah ki koshish kero #IndiaFailed — Ch Fawad Hussain (@fawadchaudhry) September 6, 2019 ప్రపంచ దేశాలు సైతం.. చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత ఉక్కుసంకల్పానికి చంద్రయాన్-3 ఒక తార్కాణం. చంద్రయాన్-2 వైఫల్యం తర్వాత భారత దేశం పట్టువిడవకుండా వెనువెంటనే చంద్రయాన్-3కి శ్రీకారం చుట్టింది. మధ్యలో కోవిడ్ -19 కారణంగా కొంత కాలయాపన జరిగినా చివరకు ఈరోజు ఆ అపురూప ఘట్టాన్ని సాక్షాత్కరించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు చంద్రయాన్-3 ఘనవిజయాన్ని చూడాలని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్‌పోర్టులు మూసివేత -
CII Dakshin Summit 2023: చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం
‘‘చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న చిన్న సమస్యలను ఈ వేదికపై చెప్పారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. పైరసీని అరికట్టే విధంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చాం. అదే విధంగా జీఎస్టీ విషయంలో ఒకే పన్ను విధానాన్ని చట్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం’’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ అన్నారు. సీఐఐ దక్షిణ్ సమ్మిట్ ముగింపు కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోజరిగింది. సీఐఐ చైర్మన్ టీజీ త్యాగరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటుడు ధనుష్, నటి శోభన, కమల్‌బాలి తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. కాగా సీఐఐ దక్షిణ్ నిర్వాహకులు చిరంజీవికి ఐకాన్ అవార్డును, తమిళ నటుడు ధనుష్‌కు యూత్ ఐకాన్ అవార్డును ప్రకటించారు. చిరంజీవి హాజరు కాకపోవడంతో ఆయన అవార్డును సుహాసిని అందుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనలేకపోయినందుకు క్షమాపణ తెలుపుతూ చిరంజీవి వీడియోను షేర్ చేశారు. -
బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రితో జైశంకర్ భేటీ
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్ అధికారిక పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రి హసన్ మహమూద్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. 'బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖా మంత్రి హసన్ మహమూద్ని కలిసినందకు చాలా సంతోషంగా ఉంది. ఈ ద్వైపాక్షిక సహకారం ఇరుదేశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది' అంటూ జైశంకర్ ట్వీట్ చేశారు. (చదవండి: ‘భారత్ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’) Glad to meet Bangladesh Information and Broadcasting Minister, Hasan Mahmud. Our bilateral cooperation is progressing steadily across all domains. Discussed media and public perceptions in that regard. pic.twitter.com/CfaKun1D0t — Dr. S. Jaishankar (@DrSJaishankar) September 7, 2021 -
మీడియాను నియంత్రించే ఆలోచన లేదు : జవదేకర్
మీడియాను నియంత్రించేందుకు కొత్త ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయడం లేదని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. మంగళవారం సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మీడియాకు తన బాధ్యత ఏంటో తెలుసన్నారు. అలాగే తనకు తాను నియంత్రించుకునే శక్తి మీడియాకు ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశం పురోగతి సాధించే క్రమంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. అందులో మీడియా సహకారం కూడా ముఖ్యమన్నారు. 2005 నుంచి బీజేపీ అధికార ప్రతినిధిగా ప్రకాశ్ జవదేకర్ వ్యవహరిస్తున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గ్లోబ్ ఇండియా చాప్టర్‌కు అధ్యక్షుడిగా జవదేకర్ వ్యవహరిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో సమాచార మరియు ప్రసార శాఖను ప్రకాశ్ జవదేకర్ అప్పగించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా ప్రకాశ్ జవదేకర్ ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే.