సాక్షి, తిరుపతి జిల్లా: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అంతర్భాగమైన న్యూస్పెస్ ఇండియా వాణిజ్యపరంగా యూరోపియన్ స్పెస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా–3 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. పీఎస్‌ఎల్వీ సీ-59కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
సతీష్‌ధవన్ స్పెస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్‌ఎల్‌వీ–సీ59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. సోమవారం ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం లాంచ్ అథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగ సమయాన్ని ప్రకటించారు. ప్రయోగానికి 25.30 గంటల ముందు.. అంటే మంగళవారం మధాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్‌ఎల్‌వీ–సీ59 ప్రయోగం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment