Bus Driver Gets Emotional On Retirement Day In Tamil Nadu - Sakshi
Sakshi News home page

ఎంత కష్టం వచ్చింది!.. చివరి సారిగా బస్సుకు ముద్దుపెట్టి

Published Sat, Jun 3 2023 3:23 PM | Last Updated on Sat, Jun 3 2023 3:51 PM

Bus Driver Gets Emotional On Retirement Day Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు(చెన్నై): ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ బస్సు డ్రైవరు చివరిసారిగా బస్సుకు ముద్దుపెట్టి కన్నీటిపర్యంతం అయ్యాడు. తమిళనాడు, మదురై తిరుప్పరకుండ్రం సమీపంలోని పైకరావుకు చెందిన ముత్తుపాండి (60). ఇతను 1993 నుంచి తిరుపరకుండ్రం ప్రభుత్వ రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ముత్తుపాండి రిటైర్డ్‌ అయ్యారు.

రిటైర్‌మెంట్‌ ముందు రోజు విధులు నిర్వహించి బస్సు నడుపుకుంటూ డిపోకు చేరారు. ఆ సమయంలో అతను సీటు నుంచి దిగడం ఇష్టం లేక స్టీరింగుకు ముద్దుపెట్టి తర్వాత కన్నీటి పర్యంతమయ్యాడు. బస్సు నుంచి దిగుతూ వందనం చేశాడు. బస్సు ముందు భాగానికి వెళ్లి తన రెండు చేతులతో బస్సును హత్తుకుని తడుముతున్నట్లు నిలబడి కన్నీరు పెట్టుకున్నారు. ఈ సంఘటనతో సహా ఉద్యోగుల కళ్లు చెమర్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

చదవండి: Imran Khan: అరెస్టుతో నా పరువు పోయింది! 1,500 కోట్ల పరిహారం కోరుతూ NABకి లీగల్‌ నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement