శ్రీలంక దాడులతో.. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న మత్య్సకారులు | Under attack, fishermen move to other states for livelihood | Sakshi
Sakshi News home page

శ్రీలంక దాడులతో.. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న మత్య్సకారులు

Published Sat, Aug 10 2013 7:45 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

Under attack, fishermen move to other states for livelihood

రామేశ్వరం: శ్రీలంక సరిహద్దు జలశయాల్లో చేపల వేటకు వెళ్లుతున్న మత్స్యకారులపై శ్రీలంక నావికా దళం తరుచూ దాడులకూ పాల్పడుతుండటంతో మత్య్సకారులంతా తమ వృత్తులను వదిలేసి బ్రతుకుదెరువు కోసం ప్రక్కప్రాంతాలైన కేరళ, కర్ణాటక ప్రాంతాలకు వలస వెళుతున్నారని మత్య్సకారుల సంఘం పేర్కొంది. శ్రీలంక దాడులకు భయపడి 3వేల మంది మత్య్సకారులు తమ వృత్తిని వదిలివేశారు. చేపలు పట్టడమే తమ నిత్యకృత్యమై జీవనం సాగిస్తున్న జాలర్లంతా ఆ వృత్తిపైనే ఆధారపడ్డారు. రామేశ్వరం తీరప్రాంతాల్లో తమిళ జాలర్లు తమ పడవల సహాయంతో చేపల వేటకు వెళుతుంటారు. ఈ సమయంలో సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న శ్రీలంక నావికాదళం వారిపై దాడులుకూ పాల్పడటం పరిపాటైంది. దీంతో మత్య్సకారులంతా భయాందోళనలతో తమ జీవనాన్ని నెట్టుకుస్తున్నారు. ఇలా అయితే తాము చేపల వేటకు వెళ్లి బ్రతికి బట్టకట్టడం కష్టమంటూ వారూ వాపోతున్నారంటూ మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు ఎమీరిట్ పిటిఐకి తెలిపారు. గడిచిన కొన్నిరోజుల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లడం మానివేయడంతో చేపల దిగుమతి 90శాతానికి పడిపోయిందన్నారు. అక్కడి తీరప్రాంతాల ద్వీపాలలో దాదాపు 4వేల మంది మత్య్సకారులుంటారని ఎమీరెట్ పేర్కొన్నారు.

చేపల పడవలను అద్దెకిచ్చే యాజమానులు జాలర్ల కుటుంబాలకు సహాయం అందించేందుకు విముఖుత చూపిస్తున్నారు. శ్రీలంక జైల్లో నిర్భందానికి గురైన మత్య్సకారుల సంఘం సహాయకుడు ఫెలోమెన్ త్యాగరాజన్ తమ ఆవేధనను వెల్లబుచ్చారు. ఈ సమస్యపై ఇరుదేశాల మధ్య సానుకూల మార్పు రావాల్సిన అవసరం ఎంతైన వుందని ఎమీరిట్ చెప్పారు. దీనిపై కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని సమాలోచన చేసి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని అప్పడే భారత జాలర్లు నిర్భయంగా భారత జలశయాల్లోకి వెళ్లగలరని అన్నారు. చేపలు పట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో హక్కు కల్పించాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇరుదేశాల ఒప్పందం ప్రకారమే కాథేచ్చివ్ ద్వీప సరిహద్దులో చేపలు వేటడేందుకు అనుమతి ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ కూడా శ్రీలంక నావికా దళం ఒప్పందాన్ని విస్మరించి తరుచూ దాడులకు పాల్పడుతుండటం సరికాదని అన్నారు. తాజాగా శ్రీలంక హై కమీషనర్ వెల్డడించిన వివరాల ప్రకారం.. భారత జాలర్లు దాదాపు 114మంది లంక జైల్లో మగ్గుతున్నారని,  అంతర్గతంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. కానీ ఇలాంటి దుశ్చర్యలను భారత జాలర్లు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement