Sri Lankan Navy
-
భారత జాలర్ల అరెస్టు
కొలంబో: తమ జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 18 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మూడు నౌకలను స్వా«దీనం చేసుకుంది. శనివారం రాత్రి నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో డెల్ఫŠట్ దీవులకు సమీపంలోని ఉత్తర సముద్రంలో మత్స్యకారులను అరెస్టు చేసినట్లు, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అరెస్టయిన మత్స్యకారులను కంకేసంతురై ఫిషింగ్ హార్బర్‌కు తరలించనున్నట్లు శ్రీలంక నేవీ అధికార ప్రతినిధి కెపె్టన్ గయాన్ విక్రమసూర్య తెలిపారు. ఈ ఏడాదిలో శ్రీలంక జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడినందుకు 180 మందికి పైగా భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసింది. -
24 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన లంక
కొలంబో: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి చేపలవేటకు సిద్ధమయ్యారంటూ 24 మంది భారతీయ జాలర్లను శ్రీలంక అరెస్ట్‌చేసింది. ఉత్తర జాఫ్నా పరిధిలోని కరాయ్‌నగర్ తీరం సమీపంలో వీరిని మంగళవారం అరెస్ట్‌చేసి వారి ఐదు చేపల వేట పడవలను శ్రీలంక నావికా, గస్తీ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీంతో తమిళనాడు జాలర్లను విడుదల కోసం శ్రీలంక ప్రభుత్వంతో భారత సర్కార్ సంప్రదింపులు జరపాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఇలా 252 మంది భారతీయ జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్ట్‌చేశారు. భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సత్సంబంధాలకు జాలర్ల అంశం సమస్యాత్మకంగా ఉన్న విషయం తెల్సిందే. -
శ్రీలంక నేవీ అదుపులో 55 మంది తమిళ జాలర్లు
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 55 మంది జాలర్లతోపాటు 8 మర పడవలను శ్రీలంక నావికాదళం ఆదివారం అదుపులోకి తీసు కుంది. ఈ నెల18న రామేశ్వరం నుంచి కట్చ తీవు దీవికి 500 బోట్లలో వెళ్లిన మత్స్య కారుల్లో 43 మందిని, 6 బోట్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుందని మత్స్యశాఖ తెలిపిం ది. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దౌర్యన్యాలు ఎక్కువయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. జాలర్లందరినీ వెంటనే విడిపించాలని, ఇప్పటి వరకు శ్రీలంక ఆధీనంలో ఉన్న మొత్తం 73 పడవలను విడుదల చేయించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. తమ వారిని విడు దల చేసే వరకు నిరాహార దీక్ష చేపడతామని మత్స్యకారుల సంఘం హెచ్చరించింది. -
శ్రీలంక కాల్పుల్లో భారత మత్స్యకారుడి మృతి
చెన్నై: చేపల వేటకు వెళ్లిన తమిళనాడు మత్స్యకారుడిని శ్రీలంక సైన్యం పొట్టన పెట్టుకుంది. శ్రీలంక సైనికులు జరిపిన కాల్పుల్లో రామేశ్వరానికి చెందిన బ్రిడ్గో (22) అనే యువకుడు మృతి చెందాడు. కచ్చతీపు ద్వీపాల్లో మరికొందరితో కలిసి మెకనైజ్డ్ బోటులో వేటకు వెళ్లిన బ్రిడ్గో తదితరులపై శ్రీలంక నేవీ కాల్పులు జరినట్లు మత్స్యకారులు ఆరోపించారు. వారు కాల్చిన తూటా సరిగ్గా బ్రిడ్గో మెడపై తగలడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేసేవరకు బ్రిడ్గో మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని అతడి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. సుమారు వెయ్యిమందికి పైగా స్థానికులు మృతుడి ఇంటి వద్ద చేరి.. ఆందోళనలు చేపట్టారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. కేంద్రం ఈ అంశంపై మౌన ప్రేక్షక పాత్ర పోషించకూడదని, ఇప్పటికైనా ఈ సమస్యను గట్టిగా పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
మళ్లీ దాడి!
సాక్షి, చెన్నై : శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే భారత పర్యటనలో ఉండగానే, ఆ దేశ నౌకాదళం తమిళ జాలర్లపై విరుచుకు పడింది. కచ్చదీవుల సమీపంలో ఓ పడవను ధ్వంసం చేసిన శ్రీలంక సేనలు సముద్రంలో ముంచేశారు. మరి కొన్ని పడవల్లోని వలల్ని నాశనం చేశారు. నీటమునిగిన పడవలో ఉన్న నలుగుర్ని సహచర జాలర్లు రక్షించి ఒడ్డుకు చేర్చారు. శ్రీలంక సేనల వీరంగాన్ని ఖండిస్తూ గురువారం నుంచి రా మేశ్వరం జాలర్లు సమ్మె సైరన్ మో గించారు. తమిళ జాలర్లకు కడలిలో భద్రత లేదన్న విషయం తెలిసిందే. సరిహద్దులు దాటినా, కచ్చదీవులకు సమీపంలో వేట సాగించినా, శ్రీలంక నౌకాదళం వీరంగానికి గురి కావాల్సిందే. శ్రీలంక సేనల చేతికి చిక్కితే చాలు బందీగా ఆదేశ చెరలో నెలల తరబడి మగ్గాల్సిందే. జాలర్ల సంఘాలు ఏకమై ఉద్యమ బాట పట్టినప్పుడే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, కొన్ని నెలల అనంతరం మళ్లీ ఇక్కడికి బందీగా వెళ్లిన వాళ్లు తిరుగు పయనం కావడం పరిపాటే. ఈ పరిస్థితుల్లో ఈనెల నాలుగో తేదీ నుంచి శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన భారత పర్యటనను పురస్కరించుకుని ఆ దేశ చెరలో పదుల సంఖ్యలో ఉన్న తమిళ జాలర్లను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. దినదిన గండంతో కడలిలోకి వెళ్తున్న జాలర్లు, రనిల్ రాకతోనైనా తమ మీద దాడులకు తగ్గుతాయా..? అందుకు తగ్గ చర్యలు కేంద్రం తీసుకునేనా, ఒత్తిడి పెంచేనా అన్న ఎదురుచూపుల్లో జాలర్లు నిమగ్నం అయ్యారు. అయితే, రనిల్ భారత్‌లో ఉండగానే శ్రీలంక సేనలు విరుచుకు పడి తమ ప్రతాపం చూపించి వెళ్లడాన్ని తమిళ జా లర్లు జీర్ణించుకోలేకున్నారు. ఈ దాడితో జాలర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మళ్లీ దాడి : రామేశ్వరానికి చెందిన జాలర్లు బుధవారం రాత్రి వేట నిమిత్తం కడలిలోకి వెళ్లారు. ఐదు వందల మంది జాలర్లు వందకు పైగా పడవల్లో కచ్చదీవుల సమీపంలో వలల్ని విసిరి వేటలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అటు వైపుగా నాలుగు బోట్లలో పదుల సంఖ్యలో శ్రీలంక సేనలు వచ్చి రాగానే విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లతో తమిళ జాలర్లపై దాడులకు దిగారు. విసిరి ఉన్న వలల్ని తెంచి పడేస్తూ వీరంగం సృష్టించారు. వీరి చేతికి చిక్కితే ఎక్కడ బందీ కావాల్సి వస్తుందో అన్న ఆందోళనలో పడ్డ జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనమయ్యారు. అయినా, వదలి పెట్టకుండా వెంటాడిన సేనలు ఆంతోనికి చెందిన ఓ పడవను చుట్టుముట్టి ధ్వంసం చేశారు. ఆ పడవకు రంధ్రం పెట్టి సముద్రంలో ముంచేశారు. ఆ పడవలో ఉన్న నలుగురు సముద్రంలో ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన సహచర జాలర్లు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. గురువారం ఉదయాన్నే ఈ దాడి సమాచారంలో జాలర్ల సంఘాల నేతలు రామేశ్వరానికి పరుగులు తీశారు. సమ్మె సైరన్ : తాజా దాడుల్లో ఓ పడవ మునగడం, లక్షలాది రూపాయల విలువగల వలలు నాశనం కావడంతో జాలర్ల సంఘాల్లో ఆక్రోశం రగిలింది. సమ్మె సైరన్ మోగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి మత్స్యశాఖ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో జాలర్లు, నేతలు నిరసనకు దిగడంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. జాలర్లు హఠాత్తుగా సమ్మె సైరన్ మోగించడంతో ఎక్కడి పడవలు అక్కడే ఒడ్డుకు పరిమితమయ్యాయి. అలాగే, చేపల్ని కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యాపారులు ఒట్టి చేత్తో వెను దిరగాల్సి వచ్చింది. అలాగే, ఉత్పత్తి చేసిన ఐస్‌గడ్డలను స్టోరేజ్‌లో భద్ర పరచుకోవాల్సిన పరిస్థితి ఆయా యాజమాన్యాలకు ఏర్పడింది. ఈ సమ్మె కారణంగా వ్యాపారులు, చేపల్ని తరలించే వాహనాలకు, ఐస్గడ్డల ఉత్పత్తిలో పనిచేస్తున్న కార్మికులు పని లేకుండా పోయింది. ఈ సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో అన్న ఆందోళన వారిలో బయలు దేరింది. ఇక, వీరిని బుజ్జగించేందుకు మత్స్యశాఖ అధికారులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. -
తమిళజాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ
రామేశ్వరం: నలుగురు తమిళ జాలర్లను అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటినందుకు శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. జాఫ్నా దీవి వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్టు శ్రీలంక నేవీ అధికారులు తెలిపారు. వీరి విడుదలకు చొరవ తీసుకోవాలని తమిళనాడు సీఎం జయలలిత ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ నెలలో తమిళ జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్టు చేయడం ఇది రెండో సారి. -
ఏడుగురు మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులను శ్రీలంక నావిక దళ సిబ్బంది మంగళవారం అరెస్ట్ చేశారు. ఉత్తర శ్రీలంకలోని తలైమన్నారు ప్రాంతంలో వీరిందరిని శ్రీలంక అరెస్ట్ చేసినట్లు రామేశ్వరం మత్స్యకారులు సంఘం అధ్యక్షుడు టి. శేషురాజు వెల్లడించారు. మంగళవారం ఆయన రామేశ్వరంలో విలేకర్లతో మాట్లాడుతూ.....సదరు మత్య్సకారులంతా శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించి... చేపలు వేటాడుతున్న సమయంలో వారిని అరెస్ట్ చేశారని చెప్పారు. -
31 మంది భారత మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించడమే కాకుండా చేపలు పడుతున్న 31 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావికా దళం ఆదివారం వెల్లడించింది. వారికి చెందిన మూడు పడవలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేసినట్లు తెలిపింది. ఈ వార్తను తమిళనాడు మత్స్యశాఖ ఉన్నతాధికారులు ధృవీకరించారు. అరెస్ట్ అయిన 31 మంది మత్య్సకారులు తమిళనాడుకు చెందిన వారేనని చెప్పారు. వారిలో 22 మంది ట్యూటికారన్, మరో తొమ్మిది మంది రామేశ్వరంకు చెందిన వారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మార్చి 3వ తేదీన తమిళనాడుకు చెందిన మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసిన భారత మత్స్యకారుల సంఖ్య 66కు పెరిగింది. -
26 మంది భారతీయ జాలర్లు అరెస్టు
కొలంబో: తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని 26 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. వారందరిని కాంకేసాతురాయ్ హార్బర్‌కు తరలించినట్లు వెల్లడించింది. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నామని గస్తీ దళం వెల్లడించింది. తాము ఎప్పటి నుంచో చెబుతున్నా భారతీయ మత్స్యకారులు తమ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తూనే ఉన్నారని, ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయకుండా చేపలు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. రెండు దేశాలమధ్య నిరంతరం ఇలాంటి సమస్యలే వస్తున్న నేపథ్యంలో తప్పకుండా సయోధ్య చర్చలు వెంటనే వీలయినంత త్వరగా జరపాలని గత నెలలోనే ఇరు దేశాల ప్రభుత్వ పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే. -
సిరి‘సేన’ దాష్టీకం
తమిళ జాలర్లను వేటాడిన శ్రీలంక గస్తీ దళాలు 37 మంది అరెస్ట్, ఆరు పడవలు స్వాధీనం సరిహద్దులు దాటితే సహించేది లేదని శ్రీలంక అధ్యక్షులు సిరిసేన ప్రకటించిన మరుసటి రోజే ఆ దేశ గస్తీదళాలు తమ దాష్టీకాన్ని ప్రదర్శించాయి. నాగపట్నం జిల్లాకు చెందిన 37 మంది జాలర్లను అరెస్ట్ చేసి తమ దేశానికి పట్టుకెళ్లాయి. అలాగే ఆరు మరపడవలను స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకలోని ఈలం తమిళులతో ప్రారంభమైన వైరం ఆ దేశ మాజీ అధ్యక్షులు రాజపక్స హయాంలో తారాస్థాయికి చేరింది. ఈలంపై యుద్ధం పేరుతో సాగిన దమనకాండ వందలాది మంది తమిళులను పొట్టనపెట్టుకుంది. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఎందరో అభాగినులు మాన, ప్రాణాలను కోల్పోయారు. సముద్రంలో చేపలవేట సాగించే తమిళ మత్స్యకారులపై వేధింపులు, సాధింపులు కూడా పెచ్చుమీరిపోయాయి. ఇటీవల శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సే ఓటమి, సిరిసేన గెలుపుతో తమిళులకు మంచిరోజులు వచ్చాయని భావించారు. ఈలంతోపాటూ తమిళ మత్స్యకారుల సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని ఆశించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల శ్రీలంక పర్యటన సమయంలో సైతం తమిళ మత్స్యకార కుటుంబాలకు అదే భరోసా కల్పించారు. అయితే ఇదంతా వట్టి భ్రమ అనిపించేలా శ్రీలంక అధ్యక్షులు సిరిసేన తన అభిప్రాయాన్ని ప్రకటించారు. శ్రీలంక సరిహద్దుల్లో చేపలవేట సాగిస్తే అరెస్ట్ చేసి తీరుతాము, అంతేకాదు వారి మరపడవలను స్వాధీనం చేసుకుని తిరిగి అప్పగించబోమని రెండురోజుల క్రితం హెచ్చరించారు. విరుచుకుపడిన శ్రీలంక సేన: నాగపట్నం జిల్లా అక్కరైపేటకు చెందిన వెయ్యిమంది మత్స్యకారులు 400 మర పడవల్లో ఈనెల 1వ తేదీన సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. వారంతా ఈనెల 5 లేదా 6వ తేదీన తిరిగి నాగైకి చేరాల్సి ఉంది. శుక్రవారం రాత్రి కారైనగర్, నెడుందీవుల వద్ద చేపల వేట సాగిస్తుండగా శ్రీలంక గస్తీదళాలు వారి పడవలను చుట్టుముట్టాయి. గస్తీదళాలను చూడగానే మత్స్యకారులు భయంతో వారి పడవలను నాగైవైపునకు పరుగులు పెట్టించారు. అయినా వదలని దళాలు వారిని వెంబడించాయి. 37 మంది జాలర్లను అరెస్ట్ చేసి వెంట తీసుకెళ్లాయి. అలాగే 6 మరపడవలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రాణభీతితో స్వగ్రామానికి బయలుదేరిన మత్స్యకారులు తమ వద్దనున్న సెల్‌ఫోన్ ద్వారా శ్రీలంక దౌర్జన్యాన్ని తమవారికి చేరవేయడంతో మత్స్యకారుల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సిరిసేన తన అభిప్రాయాన్ని ప్రకటించిన మరుసటి రోజే ఆదేశ దళాలు విరుచుకుపడడం పట్ల రాజకీయ పార్టీలు ఖండిచాయి. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని డీఎంకే అధినేత కరుణానిధి, తమిళమానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్, పీఎంకే అధినేత రాందాస్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. -
33 మంది ఇండియన్ జాలర్ల అరెస్టు
హైదరాబాద్: శ్రీలంక దేశానికి సంబంధించిన నీళ్లలో చేపలు పడుతున్నారనే ఆరోపణలతో 33 మంది భారతీయ జాలర్లను రామేశ్వరంలో శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీలంక నేవీ పర్సనల్ నాగపట్నం జిల్లా సరిహద్దులో 33 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారని ఫిషరీస్ విభాగం అధికారులు తెలిపారు. శ్రీలంక అధికారులు భారతీయ జాలర్లను అరెస్టు చేయటంతో పాటుగా ఐదు పడవలను కూడా సీజ్ చేశారని నాగపట్నం ఫిషరీస్ విభాగం జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజ్ అన్నారు. వారందరూ కంగుసంతురైకు చెందిన వారుగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. -
ఆగని దాడులు
జాలర్లపై శ్రీలంక సేనల దాడులు ఆగలేదు. చర్చలు జరిగి వారం రోజులైనా కాలేదు, మళ్లీ తమిళ జాలర్లపై కడలిలో దాడి జరిగింది. గురువారం శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి 38 మందిని పట్టుకెళ్లింది. ఈ సమాచారం రామేశ్వరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. జాలర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై దాడులకు, అరెస్టులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 27న రెండు దేశాల జాలర్లతో చెన్నైలో చర్చలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో దాడులు, అరెస్టులపై కీలక నిర్ణయా లు తీసుకున్నారు. ఆ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయాలు అమలయ్యే వరకు సరిహద్దులు దాటొద్దని శ్రీలంక జాలర్లు, రాష్ట్ర జాలర్లకు సూచించారు. దాడులు, అరెస్టులు జరగకుండా తాము సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే, ఈ చర్చలు జరిగి వారం రోజులైనా కాక ముందే మళ్లీ దాడి జరగడం కలకలం రేపుతోందన్నారు. చర్చల ఫలితంగా శ్రీలంక చెరలో ఉన్న 69 మంది తమిళ జాలర్లు బుధవారం రాష్ట్రానికి వచ్చారు. వీరి రాకతో రామేశ్వరం జాలర్లు సమ్మె వీడి సముద్రం బాట పట్టారు. విడుదలైన వాళ్లు ఇలా వచ్చారో లేదో వేటకు వెళ్లిన వారు మళ్లీ బంధీ కావడంతో రామేశ్వరం, మండపం, పంబన్‌లలో ఉద్రిక్తత నెలకొంది. వేకవజామున పంజా: తమ వాళ్ల విడుదల సమాచారంతో ఐదు రోజుల తర్వాత చేపల వేటకు రామేశ్వరం, పంబన్, మండపం జాలర్లు బుధవారం రాత్రి కడలిలోకి వెళ్లారు. ఎడిషన్, నిషా, విన్నరసు, సహాయంతో పాటుగా పది మందికి చెందిన పడవలు కచ్చదీవుల సమీపంలో చేపల వేటలో నిమగ్నం అయ్యారు. వేకువ జామున అటువైపుగా వచ్చిన శ్రీలంక నావికాదళం పంజా విసిరింది. తాము సరిహద్దులు దాటలేదంటూ జాలర్లు పేర్కొంటున్నా, కచ్చ దీవుల వైపు ఎందుకొచ్చారంటూ వీరంగం సృష్టించారు. తమ బోట్లను, జాలర్ల పడవలకు గుద్దుతూ, వలల్ని తెంచి పడేస్తూ, దుడ్డు కర్రలతో దాడులు చేశారు. దీంతో ఒడ్డుకు జాలర్లు తిరుగు పయనమయ్యారు. అయినా, వారిని వెంటాడి మరీ చితక బాదారు. నాలుగు పడవలు తప్పించుకోగా, ఆరు పడవల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో ఉన్న 38 మంది జాలర్లను తమ దేశానికి పట్టుకెళ్లారు. వీరిని కాంగేషన్ హార్బర్లో ఉంచారు. అనంతరం అక్కడి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. ఈసమాచారంతో రామేశ్వరం తీర గ్రామాల్లో జాలర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. జాలర్లను బుజ్జగించేందుకు మత్స్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పట్టుకెళ్లిన వారిని విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. -
అటు హామీ ఇటు బందీ
శ్రీలంక నావికాదళాల దాడులకు అడ్డుకట్ట వేసేలా శాశ్వత పరిష్కారం చూపుతామని అటు కేంద్రం హామీ ఇచ్చిందో లేదో, ఇటు 22 మంది జాలర్లను పట్టుకెళ్లి బందించేశాయి. లంక సేనల దాడులు మితిమీరి పోతుండడంతో పుదుకోట్టై జాలర్లలో ఆగ్రహాన్ని రగిల్చింది. దీంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం రోజురోజుకూ పేట్రేగుతోంది. ఇప్పటికే ఆ దేశ చెరలో 300కు పైగా తమిళ జాలర్ల జీవితాలు మగ్గుతున్నాయి. లక్షలు విలువ చేసే 75కు పైగా పడవలు వారి ఆధీనంలో ఉన్నాయి. తమ వాళ్ల విడుదల కోసం రాష్ట్ర జాలర్లు ఆందోళన చేస్తూ వస్తున్నారు. జాలర్లను బుజ్జగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు మాత్రం బుట్ట దాఖలవుతున్నాయి. తమ వాళ్ల విడుదల కోసం ఢిల్లీ వెళ్లిన బృందం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో శనివారం ఉదయం భేటీ అయ్యారు. దాడులకు అడ్డుకట్ట వేస్తామంటూ ఆయన హామీ గుప్పించారు. అదే రోజు రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యూరు. డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు, ఎంపీ విజయన్ నేతృత్వంలోని జాలర్ల ప్రతినిధుల బృందం ఏకరువు బెట్టిన ఆవేదనల్ని మన్మోహన్ సింగ్ ఆలకించారు. దాడుల అడ్డుకట్టకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి పంపించారు. వారు అటు హామీ ఇచ్చి పంపించారో లేదో, ఇటు 22 మంది జాలర్లను తమ దేశానికి లంక సేనలు బందీగా పట్టుకెళ్లడం బట్టి చూస్తే హామీలు ఏ మేరకు అమలవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పుదుకోట్టై జిల్లా జగదాపట్నం, కోట్టై పట్నం జాలర్లు సుమారు రెండు వేల మంది 500 పడవల్లో శనివారం రాత్రి చేపల వేట నిమిత్తం కడలిలోకి వెళ్లారు. జగదాపట్నానికి చెందిన సత్య ప్రియన్, విజయన్, శీలన్ల పడవలతో పాటుగా మరికొన్ని భారత సరిహద్దుల్లో చేపల వేటలో నిమగ్నమయ్యాయి. వలలను విసిరి చేపల్ని వేటాడుతున్న జాలర్లపై శ్రీలంక సేనలు విరుచుకు పడ్డారుు. ఐదు బోట్లలో వచ్చిన ఆ దేశ నావికాద ళం తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. వలల్ని తెంచి పడేస్తూ, దుడ్డుకర్రలతో జాలర్లపై దాడులు చేస్తూ, తమ బోట్లను జాలర్ల పడవలకు ఢీ కొడుతూ ఆ దేశ సైనికులు వీరంగం సృష్టించారు. దీంతో అక్కడున్న జాలర్లు ఆందోళనకు దిగారు. దీంతో తమ పడవల్ని ఒడ్డుకు తిప్పారు. అయితే, ఆరు పడవల్ని అందులోని 22 మందిని లంక సేనలు చుట్టుముట్టాయి. వారిని బందీగా పట్టుకుని తమ దేశానికి తీసుకెళ్లాయి. శ్రీలంకలోని కాంగేషన్ హార్బర్లో ఆ పడవల్ని ఉంచారు. సోమవారం కోర్టులో జాలర్లను హాజరు పరచబోతున్నారు. తమ వాళ్లను బందీలుగా లంక సేనలు పట్టుకెళ్లిన సమాచారంతో పుదుకోట్టై జాలర్లలో ఆగ్రహం రేగింది. చేపల వేటను బహిష్కరించి తమ వాళ్లను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. తమ వాళ్లపై దాడి జరిగిన సమాచారంతో జాలర్ల కుటుంబాలు విలపిస్తున్నాయి. ప్రధాని హామీ ఇచ్చిన మరుసటి రోజే తమ మీద దాడి జరగడాన్ని జాలర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. -
శ్రీలంక దాడులతో.. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న మత్య్సకారులు
రామేశ్వరం: శ్రీలంక సరిహద్దు జలశయాల్లో చేపల వేటకు వెళ్లుతున్న మత్స్యకారులపై శ్రీలంక నావికా దళం తరుచూ దాడులకూ పాల్పడుతుండటంతో మత్య్సకారులంతా తమ వృత్తులను వదిలేసి బ్రతుకుదెరువు కోసం ప్రక్కప్రాంతాలైన కేరళ, కర్ణాటక ప్రాంతాలకు వలస వెళుతున్నారని మత్య్సకారుల సంఘం పేర్కొంది. శ్రీలంక దాడులకు భయపడి 3వేల మంది మత్య్సకారులు తమ వృత్తిని వదిలివేశారు. చేపలు పట్టడమే తమ నిత్యకృత్యమై జీవనం సాగిస్తున్న జాలర్లంతా ఆ వృత్తిపైనే ఆధారపడ్డారు. రామేశ్వరం తీరప్రాంతాల్లో తమిళ జాలర్లు తమ పడవల సహాయంతో చేపల వేటకు వెళుతుంటారు. ఈ సమయంలో సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న శ్రీలంక నావికాదళం వారిపై దాడులుకూ పాల్పడటం పరిపాటైంది. దీంతో మత్య్సకారులంతా భయాందోళనలతో తమ జీవనాన్ని నెట్టుకుస్తున్నారు. ఇలా అయితే తాము చేపల వేటకు వెళ్లి బ్రతికి బట్టకట్టడం కష్టమంటూ వారూ వాపోతున్నారంటూ మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు ఎమీరిట్ పిటిఐకి తెలిపారు. గడిచిన కొన్నిరోజుల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లడం మానివేయడంతో చేపల దిగుమతి 90శాతానికి పడిపోయిందన్నారు. అక్కడి తీరప్రాంతాల ద్వీపాలలో దాదాపు 4వేల మంది మత్య్సకారులుంటారని ఎమీరెట్ పేర్కొన్నారు. చేపల పడవలను అద్దెకిచ్చే యాజమానులు జాలర్ల కుటుంబాలకు సహాయం అందించేందుకు విముఖుత చూపిస్తున్నారు. శ్రీలంక జైల్లో నిర్భందానికి గురైన మత్య్సకారుల సంఘం సహాయకుడు ఫెలోమెన్ త్యాగరాజన్ తమ ఆవేధనను వెల్లబుచ్చారు. ఈ సమస్యపై ఇరుదేశాల మధ్య సానుకూల మార్పు రావాల్సిన అవసరం ఎంతైన వుందని ఎమీరిట్ చెప్పారు. దీనిపై కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని సమాలోచన చేసి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని అప్పడే భారత జాలర్లు నిర్భయంగా భారత జలశయాల్లోకి వెళ్లగలరని అన్నారు. చేపలు పట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో హక్కు కల్పించాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇరుదేశాల ఒప్పందం ప్రకారమే కాథేచ్చివ్ ద్వీప సరిహద్దులో చేపలు వేటడేందుకు అనుమతి ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ కూడా శ్రీలంక నావికా దళం ఒప్పందాన్ని విస్మరించి తరుచూ దాడులకు పాల్పడుతుండటం సరికాదని అన్నారు. తాజాగా శ్రీలంక హై కమీషనర్ వెల్డడించిన వివరాల ప్రకారం.. భారత జాలర్లు దాదాపు 114మంది లంక జైల్లో మగ్గుతున్నారని, అంతర్గతంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. కానీ ఇలాంటి దుశ్చర్యలను భారత జాలర్లు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారని ఆయన తెలిపారు. -
భారతీయ జాలర్ల పట్ల శ్రీలంకది అమానుష చర్య
భారతీయ జాలర్ల పట్ల శ్రీలంక నావికా దళం అమానుషంగా వ్యవహారిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితా ఆరోపించారు. ఆ దేశ నావిక దళ చర్యలను కట్టడి చేసేందుకు శ్రీలంకపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ జయలలిత మంగళవారం భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. చాలా కాలంగా సముద్ర జలాల్లోకి చేపల వేటకు వెళ్లే భారతీయ జాలర్లపై శ్రీలంక నావికదళం దాడులకు పాల్పడటంతోపాటు వారిని అపహరిస్తు శత్రుదేశం మాదిరిగా వ్యవహారిస్తుందని ఆమె రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని ఆ దేశ ఉన్నతాధికారులను ఆదేశించాలని జయలలిత కోరారు. ఇప్పటికైన ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుంటే ఆ దేశ నావిక దళం హద్దు మీరే అవకాశాలు ఉన్నాయని జయలలిత అభిప్రాయపడ్డారు. ఓ వేళ ఇలాంటి చర్యలు మరో సారి జరిగితే ఉపేక్షించేది లేదని శ్రీలంకకు గట్టిగా చెప్పాలని ఆమె సూచించారు. తమిళనాడుకు చెందిన ఎంతో మంది జాలర్లు తరుచుగా ఆ దేశ నావికాదళ సిబ్బంది చేతుల్లో పలు ఇక్కట్లకు గురవుతున్న సంఘటనలపై తరుచుగా లేఖల ద్వారా మీ దృష్టికి తెస్తున్న సంగతిని ప్రధానికి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆగస్టు 3న తమిళనాడుకు చెందిన 20 భారతీయ జాలర్లను లంక నావికాదళం అరెస్ట్ చేసిన సంఘటనను జయలలిత ఆ లేఖలో ప్రస్తావించారు. భారతీయ జాలర్ల అరెస్ట్‌తో రాష్ట్రంలోని ఆ సామాజిక వర్గం ఆందోళనలకు దిగుతున్నాయని, దాంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అలాగే శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 90 మంది భారతీయ జాలర్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని జయలలిత ప్రధాని మన్మోహన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.