తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులను శ్రీలంక నావిక దళ సిబ్బంది మంగళవారం అరెస్ట్ చేశారు.
రామేశ్వరం : తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులను శ్రీలంక నావిక దళ సిబ్బంది మంగళవారం అరెస్ట్ చేశారు. ఉత్తర శ్రీలంకలోని తలైమన్నారు ప్రాంతంలో వీరిందరిని శ్రీలంక అరెస్ట్ చేసినట్లు రామేశ్వరం మత్స్యకారులు సంఘం అధ్యక్షుడు టి. శేషురాజు వెల్లడించారు. మంగళవారం ఆయన రామేశ్వరంలో విలేకర్లతో మాట్లాడుతూ.....సదరు మత్య్సకారులంతా శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించి... చేపలు వేటాడుతున్న సమయంలో వారిని అరెస్ట్ చేశారని చెప్పారు.