12 మంది భారతీయుల అరెస్ట్
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారనే కారణంతో శ్రీలంక నేవీ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పనీర్‌సెల్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి.. తమిళ జాలర్ల విషయంలో శ్రీలంక నేవీ అనుసరిస్తున్న విధానానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరిన మరుసటి రోజే ఈ అరెస్టులు చోటు చేసుకోవడం గమనార్హం. రామేశ్వరం ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీనాధ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పంబన్ నుంచి మూడు బోట్లలో 20 మంది మత‍్స్యకారులు వేటకు వెళ్లారు. నిషేధించిన వలలతో చేపల వేటకు వెళ్లిన వీరిని, శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకోనే సమయంలో ఒక బోట్‌లో ఎనిమిది మంది అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశారు. మిగిలిన రెండు బోట్లలోని 12 మందిని శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకొని కంగేసంతురాయ్ పోర్ట్‌కు తరలించారు.