కొలంబో: శ్రీలంక నేవీ అధికారులు 28 మంది భారతీయ మత్స్యకారులను ఆదివారం అరెస్ట్ చేశారు. తమ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులంతా పుదుకొట్టై, పంబన్, ట్యుటికొరిన్ ప్రాంతాలకు చెందిన వారని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీనాథ్ వెల్లడించారు.
అదుపులోకి తీసుకున్న మత్స్యకారులను శ్రీలంక నేవీ అధికారులు కంగెసంతురాయ్ పోర్ట్కు తరలించారు. ఈ ఘటనలో మత్స్యకారులకు చెందిన మూడు బోట్లను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నేవీ అధికారులు భారత జాలర్లను అరెస్టు చేయడం ఇటీవలి కాలంలోనే ఇది నాలుగో సారి కావడం గమనార్హం.
28 మంది భారతీయుల అరెస్ట్
Published Sun, Mar 13 2016 9:50 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement