హైదరాబాద్: శ్రీలంక దేశానికి సంబంధించిన నీళ్లలో చేపలు పడుతున్నారనే ఆరోపణలతో 33 మంది భారతీయ జాలర్లను రామేశ్వరంలో శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీలంక నేవీ పర్సనల్ నాగపట్నం జిల్లా సరిహద్దులో 33 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారని ఫిషరీస్ విభాగం అధికారులు తెలిపారు. శ్రీలంక అధికారులు భారతీయ జాలర్లను అరెస్టు చేయటంతో పాటుగా ఐదు పడవలను కూడా సీజ్ చేశారని నాగపట్నం ఫిషరీస్ విభాగం జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజ్ అన్నారు. వారందరూ కంగుసంతురైకు చెందిన వారుగా గుర్తించినట్టు ఆయన తెలిపారు.