కొలంబో: తమ జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 18 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మూడు నౌకలను స్వా«దీనం చేసుకుంది.
శనివారం రాత్రి నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో డెల్ఫŠట్ దీవులకు సమీపంలోని ఉత్తర సముద్రంలో మత్స్యకారులను అరెస్టు చేసినట్లు, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అరెస్టయిన మత్స్యకారులను కంకేసంతురై ఫిషింగ్ హార్బర్‌కు తరలించనున్నట్లు శ్రీలంక నేవీ అధికార ప్రతినిధి కెపె్టన్ గయాన్ విక్రమసూర్య తెలిపారు. ఈ ఏడాదిలో శ్రీలంక జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడినందుకు 180 మందికి పైగా భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment