indian fishermen arrest
-
భారత జాలర్ల అరెస్టు
కొలంబో: తమ జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 18 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మూడు నౌకలను స్వా«దీనం చేసుకుంది. శనివారం రాత్రి నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో డెల్ఫŠట్ దీవులకు సమీపంలోని ఉత్తర సముద్రంలో మత్స్యకారులను అరెస్టు చేసినట్లు, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అరెస్టయిన మత్స్యకారులను కంకేసంతురై ఫిషింగ్ హార్బర్‌కు తరలించనున్నట్లు శ్రీలంక నేవీ అధికార ప్రతినిధి కెపె్టన్ గయాన్ విక్రమసూర్య తెలిపారు. ఈ ఏడాదిలో శ్రీలంక జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడినందుకు 180 మందికి పైగా భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసింది. -
పాకిస్తాన్లో భారత జాలర్ల అరెస్ట్
కరాచీ : తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారంటూ పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ 34 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసింది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన భారత జాలర్లతో పాటు ఆరు బోట్లను సీజ్ చేశామని మారిటైమ్ సెక్యూరిటీ ప్రతినిధి వెల్లడించారు. జాలర్లను స్ధానిక డాక్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. వారి జ్యుడిషయల్ రిమాండ్ కోసం మేజిస్ర్టేట్ ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ భారత జాలర్లను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ .ఏడాది జనవరిలో ఐదుగురు గుజరాత్ బోట్స్‌మెన్‌లను అరెస్ట్ చేసిన పాక్ అధికారులు వారిని జైలులో ఉంచారు. కాగా గత నెలలో కరాచీలోని లంధి, మలిర్ జైళ్ల నుంచి పాక్ ప్రభుత్వం 250 మందికి పైగా భారత జాలర్లను విడుదల చేసింది. మరోవైపు నాలుగు విడతలుగా 360 మంది భారత జాలర్లను విడుదల చేస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో వెల్లడించింది. -
54 మంది భారత జాలర్ల అరెస్టు
తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో 54 మంది భారత జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టుచేసింది. సముద్ర మార్గంలో శ్రీలంకలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 33 మంది భారతీయ జాలర్లను తలైమన్నార్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని, ఐదు బోట్లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ అధికార ప్రతినిధి ఇండికా సిల్వా ఆదివారం ప్రకటించారు. మరో 21 మందిని కంకేసంతురాయ్ వద్ద అరెస్టుచేశామని, ఈ ఘటనలోనూ ఐదు బోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొద్దిరోజుల కిందటే శ్రీలంకలో పర్యటించిన భారత ప్రధాని మోదీ.. జాలర్ల అరెస్టుల విషయమై లంక అధ్యక్షుడు సిరిసేనతో చర్చలు జరిపారు. మోదీ పర్యటన సందర్భంగా శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 86 మంది భారత జాలర్లను విడుదలచేసిన సంగతి తెలిసిందే.