
కరాచీ : తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారంటూ పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ 34 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసింది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన భారత జాలర్లతో పాటు ఆరు బోట్లను సీజ్ చేశామని మారిటైమ్ సెక్యూరిటీ ప్రతినిధి వెల్లడించారు. జాలర్లను స్ధానిక డాక్ పోలీసులకు అప్పగించామని తెలిపారు. వారి జ్యుడిషయల్ రిమాండ్ కోసం మేజిస్ర్టేట్ ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు.
ఈ ఏడాది జనవరి నుంచి మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ భారత జాలర్లను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ .ఏడాది జనవరిలో ఐదుగురు గుజరాత్ బోట్స్‌మెన్‌లను అరెస్ట్ చేసిన పాక్ అధికారులు వారిని జైలులో ఉంచారు. కాగా గత నెలలో కరాచీలోని లంధి, మలిర్ జైళ్ల నుంచి పాక్ ప్రభుత్వం 250 మందికి పైగా భారత జాలర్లను విడుదల చేసింది. మరోవైపు నాలుగు విడతలుగా 360 మంది భారత జాలర్లను విడుదల చేస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment