54 మంది భారత జాలర్ల అరెస్టు | srilanka arrests 54 indian fishermen | Sakshi
Sakshi News home page

54 మంది భారత జాలర్ల అరెస్టు

Published Sun, Mar 22 2015 11:27 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

srilanka arrests 54 indian fishermen

తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో 54 మంది భారత జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టుచేసింది. సముద్ర మార్గంలో శ్రీలంకలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 33 మంది భారతీయ జాలర్లను తలైమన్నార్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని, ఐదు బోట్లను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ అధికార ప్రతినిధి ఇండికా సిల్వా ఆదివారం ప్రకటించారు. మరో 21 మందిని కంకేసంతురాయ్ వద్ద అరెస్టుచేశామని, ఈ ఘటనలోనూ ఐదు బోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కొద్దిరోజుల కిందటే శ్రీలంకలో పర్యటించిన భారత ప్రధాని మోదీ.. జాలర్ల అరెస్టుల విషయమై లంక అధ్యక్షుడు సిరిసేనతో చర్చలు జరిపారు. మోదీ పర్యటన సందర్భంగా శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 86 మంది భారత జాలర్లను విడుదలచేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement