కొలంబో: తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని 26 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. వారందరిని కాంకేసాతురాయ్ హార్బర్కు తరలించినట్లు వెల్లడించింది. శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నామని గస్తీ దళం వెల్లడించింది. తాము ఎప్పటి నుంచో చెబుతున్నా భారతీయ మత్స్యకారులు తమ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తూనే ఉన్నారని, ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయకుండా చేపలు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. రెండు దేశాలమధ్య నిరంతరం ఇలాంటి సమస్యలే వస్తున్న నేపథ్యంలో తప్పకుండా సయోధ్య చర్చలు వెంటనే వీలయినంత త్వరగా జరపాలని గత నెలలోనే ఇరు దేశాల ప్రభుత్వ పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే.