
రామసేతు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం: గడ్కరీ
రామసేతు ప్రాజెక్ట్ నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. రామసేతు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తామంటూ కేంద్రమంత్రి, బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ మంగళవారం వ్యాఖ్యానించారు. తమిళనాడులోని రామేశ్వరం వద్ద ఉన్న రామసేతు ప్రాజెక్ట్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పరిశీలించిన అనంతరం గడ్కరీ విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరాణిక వంతెన ( లంక వెళ్లేందుకు వానరసైన్యం సహాయంతో రాముడు నిర్మించిన)గా పిలువబడుతున్న ఈ వంతెనను కూల్చేదిలేదన్నారు. రామసేతు ప్రాజెక్ట్ను తప్పకుండా పూర్తిచేస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు.