చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం 20 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్టించనున్నారు. సెప్టెంబర్ 26వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామేశ్వరం - రామనాథపురం జాతీయ రహదారిలో పంబన్ వంతెన సమీపంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు రామనాథపురం జిల్లా తూర్పు అరిమా సంఘం అధ్యక్షులు విశ్వనాథన్ తెలిపారు. మరోవైపు రామేశ్వరం జిల్లా పేయ్‌కరుంబులో గత నెల 30న కలాం అంత్యక్రియలు జరగ్గా.. ఇప్పటికీ జనం రోజూ అధిక సంఖ్యలో ఖననం చేసిన ప్రదేశానికి వచ్చి నివాళులర్పిస్తున్నారు.