ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష వేయడంపై తమిళనాడు భగ్గుమంటోంది.
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష వేయడంపై తమిళనాడు భగ్గుమంటోంది. ప్రధానంగా రామేశ్వరం ప్రాంతంలో మత్స్యకారులు తీవ్ర హింసకు పాల్పడ్డారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించారు. దాదాపు 108 జాలర్ల సంఘాలన్నీ కలిసి తీరప్రాంత గ్రామాల్లో ఆందోళన చేపడుతున్నారు. రోడ్లపైకి ఎక్కి విధ్వంసానికి పాల్పడ్డారు.
రెండు బస్సులను పూర్తిగా దహనం చేశారు. రైల్వే ట్రాకును కూడా ధ్వంసం చేయడంతో అటువైపు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రామనాథపురం జిల్లాలో విధ్వంసం జరుగుతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో వెళ్లారు. తీరప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది.