capital punishment
-
అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు
ఢిల్లీ: ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారుల విషయంలో భారత ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అప్పీల్‌కు వెళ్లినట్లు గురువారం ప్రకటించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇది సున్నితమైన అంశమని, ప్రచారంలోకి వస్తున్న ఊహాగానాల్ని నమొద్దని కోరుతోంది. ‘‘ఈ సమస్యకు సంబంధించి ఖతార్‌లోని భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. తీర్పు గోప్యతకు సంబంధించిన అంశం. కేవలం న్యాయ బృందానికి మాత్రమే తీర్పు సంబంధిత వివరాల్ని తెలియజేస్తారు. అందుకే ఈ వ్యవహారంలో ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దు’’ అని విదేశీ వ్వవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ఎనిమిది మందిని కిందటి ఏడాది ఆగష్టులో అరెస్ట్ చేశారు. అక్టోబర్ నెలలో ఖతార్ కోర్టు వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది కూడా. ‘‘ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే ఢిల్లీలో ఆ కుటుంబ సభ్యుల్ని కలిశారు. వీలైనంత మేర దౌత్య, న్యాయపరమైన సహాయం వాళ్లకు అందించేందుకు సిద్ధం. మంగళవారం నుంచే దౌత్యపరమైన సాయం వాళ్లకు అందుతోంది. ఈ సున్నితమైన వ్యవహారంలో ఊహాగానాలు నమ్మొద్దు అని బాగ్చీ మరోసారి అన్నారు. ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులలో ఒకప్పుడు ప్రధాన భారతీయ యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన వాళ్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ సమయంలో వాళ్లంతా దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ & కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. దహ్రా అనేది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సేవలను అందించే ఒక ప్రైవేట్ సంస్థ. -
స్వలింగ సంపర్కులను వదలరు.. చంపేస్తారక్కడ!
స్వలింగ వివాహాల చట్టబద్ధతపై మన దగ్గర సర్వోన్నత న్యాయస్థానంలో రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ పరిధిలోని అంశమని, అయితే వాళ్ల హక్కుల పరిరక్షణ బాధ్యత మాత్రం ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అయితే.. ఇది సహేతుకం కాదని కేంద్రం వద్దంటోంది. స్వేచ్ఛా హక్కులో భాగంగా వివాహ హక్కు కల్పించాలని కొందరు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఆ మధ్య ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్వలింగసంపర్క వ్యతిరేక చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆసక్తికర చర్చకు దారి తీసింది ఆఫ్రికా దేశం ఉగాండా. తూర్పు ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేక చట్టానికి ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు యోవెరీ ముసెవెని(78) ఆమోద ముద్ర వేశారు.దీంతో.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిన దేశంగా నిలిచింది ఉగాండా. ఆఫ్రికా ఖండం మొత్తంలో 30 దేశాల్లో సేమ్ సెక్స్ రిలేషన్స్ అనేది నేరం. అందుకుగానూ కఠిన శిక్షలే ఉంటాయి. కానీ, ఉగాండా మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా.. మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. 👉 ఉగాండా చట్టాల ప్రకారం.. స్వలింగ సంపర్కుల బంధం తీవ్ర నేరం. హెచ్ఐవీ/ఎయిడ్స్‌లాంటి ప్రాణాంతక సుఖవ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, అలాంటి రిలేషన్షిప్లో కొనసాగితే.. తీవ్రంగా పరిగణిస్తారు. జైలు శిక్ష లేదంటే దేశ బహిష్కరణ లాంటి శిక్షలు అమలు చేస్తారు. మరోవైపు అనధికారికంగా.. సంఘం నుంచి సామాజిక బహిష్కరణతో పాటు రాళ్లతో తరిమి తరిమి కొట్టి చంపిన దాఖలాలు, మూక హత్యల ఘటనలూ అక్కడ నమోదు అయ్యాయి. ఉగాండా తాజా చట్టం ప్రకారం.. ఒకే లింగానికి చెంది ఉండి.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పదే పదే పరస్పర శృంగారంలో పాల్గొనడం, బంధంలో కలిసి జీవించడం, వివాహాలు.. లాంటి నేరాలు చేస్తే వాళ్లకు మరణ శిక్ష విధిస్తారక్కడ. అలాగే హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేసినందుకుగానూ 20 ఏళ్ల జైలు శిక్ష సైతం విధిస్తారు. 👉 గోల్డ్ పెన్‌తో అధ్యక్షుడు యోవెరీ ముసెవెని చట్టం ప్రతులపై సంతకం చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఉగాండా తీసుకున్న ఈ నిర్ణయంపై పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 👉 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉగాండా తాజా నిర్ణయాన్ని మానవ హక్కులకు సంబంధించిన విషాదకరమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. మానవ హక్కుల ఉల్లంఘనను అమెరికా ఎప్పుడూ తీవ్రంగానే పరిగణిస్తుంది. అందుకు తగ్గట్లే ఆంక్షలు, నిషేధాజ్ఞల దిశగా ఆలోచన చేస్తామని ప్రకటించారాయన. 👉అంతేకాదు సొంత దేశంలో పలు గ్రూపులు కోర్టును ఆశ్రయించాయి కూడా. మరోవైపు ఉగాండా స్ఫూర్తితో కెన్యా, టాంజానియాలు కూడా కఠిన శిక్షలు అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 👉 ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేకచట్టంపై చర్చ ఈనాటిది కాదు. 2014లో ఉగాండా చేసిన ప్రయత్నాలను గమనించిన పాశ్చాత్య దేశాలు సహాయం నిలిపేయడం, ఆంక్షలు విధించడం, భద్రతా సహకారంపై కోతలు విధించడం లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నాయి. 👉 అంతకు ముందు 2009లో.. kill the gays(గేలను చంపేయడం) లాంటి ప్రతిపాదనను తీసుకురాగా.. ప్రపంచ దేశాలు, కీలక సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒక అడుగు వెనకేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే చట్టానికి అధ్యక్షుడి ఆమోద ముద్ర పడేలా చేసుకుంది. -
త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయికి ఉరి
ప్రొద్దుటూరు క్రైం: త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయి కరీముల్లాకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్ వీధిలో నివసించే ఉప్పలూరు చాంద్‌బాషా, గుల్జార్‌బేగం దంపతులకు ఓ కుమార్తె (కరీమున్నీసా), ముగ్గురు కుమారులు(కరీముల్లా, మహబూబ్‌బాషా, మహ్మద్ రఫీ). రఫీ మినహా ఇద్దరు కుమారులు, కుమార్తెకు పెళ్లిళ్లు అయ్యాయి. కరీముల్లా గతంలో తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. అయితే అతను కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో.. తల్లిదండ్రులు పక్క వీధిలో వేరే కాపురం పెట్టించారు. ఆ సమయంలో కొందరి చెప్పుడు మాటలు విన్న కరీముల్లా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనపై నింద వేయడంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కరీముల్లా మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాడు. గర్భిణి అయిన చెల్లెలు కరీమున్నీసా కూడా పుట్టింటికి వచ్చింది. భార్యతో విడాకులు ఇప్పించాలని కరీముల్లా అడుగుతుండగా.. తల్లిదండ్రులు సర్ది చెబుతూ వచ్చారు. దీంతో 2021 ఏప్రిల్ 25వ తేదీన కరీముల్లా కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజు(26వ తేదీ) తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న తల్లి గుల్జార్‌బేగం, చెల్లి కరీమున్నీసా, తమ్ముడు రఫీని కరీముల్లా రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా.. ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. ముగ్గురిని తానే హత్య చేశానని కరీముల్లా అంగీకరించడం.. నేరం రుజువు కావడంతో జడ్జి జి.రమేశ్‌బాబు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు కోర్టు చరిత్రలో ఇది మొదటి ఉరిశిక్ష తీర్పు అని ఏపీపీ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
ఉరిశిక్షలను ఆపేయండి: ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను ఆపేయాలని లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఉరిశిక్షపై స్పందించారు. ఆంటోనియా గ్యుటెరెస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని దేశాలన్నీ మరణశిక్షను ఆపివేయాలి. లేదా కనీసం ఉరి శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. చదవండి: 'నిర్లక్ష్యం చేస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి' నిర్భయ దోషులను ఉరి తీసిన 24 గంటల తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిర్భయను సామూహిక అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లను శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. దేశంలో నలుగురిని ఒకేసారి ఉరితీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్‌ను వీలైనంత వేగంగా కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరణాల సంఖ్య లక్షల్లో ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరాస్ హెచ్చరించారు. కరోనాను కార్చిచ్చుతో పోల్చారు.కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయకుండా నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు కోల్పోతారని దేశాలను హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ ఏర్పడలేదన్నారు. చదవండి: హీరోయిన్‌కు కరోనా.. ప్రియుడు బ్రేకప్! -
'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైంది. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్‌ను చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లలో దేశంలో మరణశిక్షలు అమలు చేసిన వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 400 మందికి కోర్టులు మరణశిక్షలు విధించగా అందులో కేవలం ఒక శాతం మందికి మాత్రమే శిక్షలు అమలైనట్టు జాతీయ నేర విభాగం (ఎన్సీఆర్బీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: నిర్భయ దోషులకు 22న ఉరి మరణశిక్ష కేసుల్లో దాదాపు 1200 మందికి అది ఆ తర్వాత జీవిత ఖైదుగా మారింది. నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ఎన్సీఆర్బీ గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కోర్టులో సుదీర్ఘకాల విచారణ, రాష్ట్రపతి అభ్యర్థనలు కారణంగానే శిక్షల అమలులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచింది నలుగురికి మాత్రమే. బాలికపై అత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ధనుంజయ్, ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్, పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన అఫ్జల్ గురు, 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబుదాడులకు కారకుడైన యాకూబ్ మెమన్‌లకు మాత్రమే గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచారు. ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరితీస్తే ఈ సంఖ్య 8కి పెరుగునుంది. -
రేపిస్టులకు కఠిన శిక్షలు విధిస్తున్న దేశాలివే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘దిశ’పై ఘోరంగా అత్యాచారం జరిపి క్రూరంగా హత్య చేయడంతో నేరస్థులను బహిరంగంగా ఉరితీయాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలే కాకుండా సామాన్యుడి నుంచి సామాజిక కార్యకర్త వరకు నేడు డిమాండ్ చేస్తున్నారు. రేప్ కేసులకు సంబంధించి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి ? వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం ఉంది ? అన్న అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన 195 దేశాల్లో పది దేశాల్లో రేప్ కేసులకు కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. షరియా చట్టాలు అమలు చేస్తున్న ఇస్లామిక్ దేశాల్లో కఠిన శిక్షలు ఎక్కువగా ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఒకప్పుడు రేప్ కేసుల్లో నేరస్థులను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు. దీన్ని ‘ఎక్జిక్యూషన్ త్రో స్టోన్స్’ అని వ్యవహరించేవారు. చచ్చేవరకు నేరస్థుడు బాధ అనుభవించాలనే ఇస్లాం మతం ప్రకారం ఈ శిక్షను అమలు చేసేవారు. ఆ తర్వాత బహిరంగంగా తల నరికి చంపెవారు. ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటి క్రూర శిక్షలను విధించడం లేదు. బహిరంగంగా 80 నుంచి వెయ్యి వరకు కొరడా దెబ్బలు, ఆ తర్వాత పదేళ్ల వరకు జైలు శిక్షలను అమలు చేస్తున్నారు. వివాహేతర సంబంధాల విషయంలో మగవాళ్లతోపాటు ఆడవాళ్లకు బహిరంగ కొరడా శిక్షలను అమలు చేస్తారు. వాటిని కనిపెట్టడానికి మతపరంగా ‘రహస్య పోలీసులు’ ఉంటారు. ఇరాన్లో ఉరి ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో పలు నేరాలతోపాటు రేప్ కేసుల్లో ఉరి శిక్షలను అమలు చేస్తున్నారు. ఆ దేశంలో ఉరి శిక్షలు పడుతున్న కేసుల్లో పది నుంచి పదిహేను శాతం రేప్‌కు సంబంధించిన కేసులే ఉంటున్నాయి. రేప్ కేసుల్లో బాధితులు నష్టపరిహారం తీసుకొని నేరస్థులను క్షమించవచ్చు. అలాంటి కేసుల్లో వంద వరకు కొరడా దెబ్బలు, కొన్ని సందర్భాలో సాధారణ జైలు శిక్షలను విధిస్తున్నారు. ఈజిప్టు, యుఏఈ, అఫ్ఘాన్లలో మరణ శిక్షలు ఈజిప్టుతోపాటు యూఏఈ దేశాల్లో రేప్ కేసుల్లో ఉరి శిక్షలు అమలు చేస్తున్నారు. దుబాయ్‌లో నేరస్థులను పట్టుకున్న ఏడు రోజుల్లో ఉరి తీస్తారు. అఫ్ఘనిస్థాన్‌లో రేప్ కేసుల్లో నేరస్థులను తుపాకీతో తలలో కాల్చి చంపుతారు. పట్టుకున్న నాలుగు రోజుల్లోనే ఈ శిక్షను అమలు చేస్తున్నారు. ఇజ్రాయిల్‌లో కనిష్టంగా నాలుగేళ్లు, గరిష్టంగా 16 ఏళ్ల విధిస్తున్నారు. ఇది వరకు బాధితురాలిని పెళ్లి చేసుకునే అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కువగా జైలు శిక్షలే విధిస్తున్నారు. చైనాలో భారీ అవినీతి, కొన్ని రేప్ కేసుల్లో మాత్రమే మరణ శిక్షలు అమలు చేస్తున్నారు. గతంలో ఓ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి మరణ శిక్ష అమలు చేసిన అనంతరం వారు నిర్దోషులని తేలడంతో అప్పటి నుంచి నేరం తీవ్రతనుబట్టి ఆచితూచి మరణ శిక్షలు విధిస్తున్నారు. రష్యాలో రేప్ కేసుల్లో మూడు నుంచి ఆరేళ్లు జైలు శిక్షలు విధిస్తున్నారు. బాధితులు 18 ఏళ్ల లోపు వారైతే నేరస్థులకు నాలుగు నుంచి పదేళ్ల వరకు శిక్షలు పెరుగుతాయి. రేప్ కారణంగా బాధితురాలు మరణిస్తే 8 నుంచి 15 ఏళ్ల వరకు శిక్ష పెరుగుతుంది. అదే చనిపోయిన బాధితురాలు 14 ఏళ్ల లోపు మైనరైతే 12 నుంచి 15 ఏళ్ల వరకు శిక్ష పెరుగుతుంది. నెదర్లాండ్స్‌లో రేప్లే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన, అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా రేప్ కేసుగానే పరిగణిస్తారు. నాలుగేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. బాధితురాలు మరణించిన పక్షంలో 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. వేశ్యలను వేధించినా నాలుగేళ్ల వరకు జైలు శిక్షలు పడతాయి. ఫ్రాన్స్‌లో రేప్ కేసుల్లో 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 15 ఏళ్లలోపు మైనర్లు బాధితులైతే 20 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. బాధితురాలు తీవ్రంగా గాయపడినా, మరణించినా 30 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధిస్తారు. కఠిన శిక్షలు విధించడం వల్ల ఏ దేశంలోనూ పెద్దగా రేప్ కేసులు తగ్గడం లేదు. మరణ శిక్షలు విధించడం వల్ల సాక్ష్యాధారాలు లేకుండా చేయడంలో భాగంగా బాధితులను హత్య చేస్తున్నారని సామాజిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘దిశ’ హత్య కూడా అందులో భాగంగానే జరిగింది. మహిళలకు సరైన భద్రతను కల్పించడంతోపాటు ఆకతాయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకరావడం వల్లనే రేప్ సంఘటనలను అదుపు చేయవచ్చని సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. -
మరణ శిక్ష కోసం మళ్లీ హత్యలు
కొలంబియా: తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లయింది వారి పరిస్థితి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల డెన్వర్ సైమన్స్, 28 ఏళ్ల జాకోబ్ ఫిలిప్ప్‌లకు రెండు వేర్వేరు జంట హత్యల కేసుల్లో రెండేసి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 2010, ఆ తర్వాత జరిగిన రెండు వేర్వేరు జంట హత్యల కేసులకు సంబంధించి 2015లో ఈ ఇద్దరు నేరస్థులకు రెండేసి జీవితఖైదులు పడ్డాయి. జైలు జీవితంలో భాగంగా వారిని కొలంబియాలోని ‘కిర్కిలాండ్ కరెక్షనల్ ఇనిస్టిట్యూట్’కు పంపించారు. కనీసం పెరోల్ కూడా లభించని జైలు జీవితం పట్ల వారికి విరక్తి పుట్టింది. అందుకు ఆ ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడకుండా మరణ శిక్షలు పొందాలనుకున్నారు. పథకం ప్రకారం వారు 2017లో విలియం స్క్రగ్స్ (44), జిమ్మీ హామ్ (56), జాసన్ కెల్లీ (35), జాన్ కింగ్ (52) అనే నలుగురు తోటి ఖైదీలను హత్య చేశారు. ఆ కేసును విచారించిన రిచ్మండ్ కౌంటీ కోర్టు వారికి దిమ్మ తిరిగి పోయే తీర్పు చెప్పింది. వారికి చెరి మరో నాలుగు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వారికి మరణ శిక్షలు విధించరాదని, జైలు శిక్షలే విధించండని బాధితుల కుటుంబీకులు కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఆ మేరకే శిక్షలు విధించింది. మరణ శిక్షల కోసమే హత్యలు చేసినట్లు డెన్వర్ సైమన్స్, జాకోబ్ ఫిలిప్ప్‌లు చెప్పిన కారణంగా బాధితుల బంధువులు వారికి మరణ శిక్ష వద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. -
అమెరికాలో మళ్లీ మరణశిక్షలు
వాషింగ్టన్: దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది. అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ ఓ ప్రకటన చేస్తూ, ‘నీచమైన నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని న్యాయ శాఖ ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలను కూడా కోరుతూ వచ్చింది. చట్టాలు సరిగ్గా అమలయ్యేలా న్యాయ విభాగం చూస్తుంది. బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఆ విభాగంపై ఉంది’ అని తెలిపారు. మరణ శిక్షలను అమలు చేయాలంటూ జైళ్ల శాఖను విలియం ఇప్పటికే ఆదేశించారు. అమెరికాలో మరణశిక్ష అంటే మన దగ్గరలా ఉరిశిక్ష విధించకుండా, విషపూరిత మందులు ఇచ్చి నేరస్తులు చనిపోయేలా చేస్తారు. -
జంగవమ్మ జ్ఞాపకాలు
బాలనాగమ్మ కథలో నాగమ్మకు అన్నీ కష్టాలే.. ఇక్కడ కూడా నాగమ్మ ఎన్నో కష్టాలను, కన్నీళ్లను చూసింది. ఆమెపేరు నాగమ్మ అయినందుకు కావచ్చు. దేశచరిత్రలో చీకటి రోజులుగా మిగిలిన ఎమర్జెన్సీ పిడుగు ముత్తునూరు నాగమ్మ కుటుంబం పైన పడింది. గిన్నెదరి హత్యకేసులో విచారణ పూర్తయిన సమయంలోనే ఎమర్జెన్సీ అమలు కావడంతో భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష తప్పలేదు. వారిద్దరికీ వేసిన ఉరిశిక్షను అమలు చేసేందుకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే వారికి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా దేశంలోని వివిధ సంఘాలన్నీ రాష్ట్రపతిని కలిశాయి. చివరకు ఎమర్జెన్సీ సమయంలో ప్రశ్నించే గొంతులను అణచివేసే చట్టాలు అమ లు చేయడంతో 1975 డిసెంబర్ 1న ఆ ఇద్దరికీ ముషీరాబాద్ సెంట్రల్ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో వేసిన ఈ శిక్ష దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉరిశిక్ష పడిన వారిలో ఒకరైన భూమయ్య భార్య ఇప్పుడు పూజారి జంగవమ్మగా జగిత్యాల ప్రాంతంలోని గొల్లపల్లి మండలం రాజోలుపల్లిలో అనాథగానే జీవితాన్ని గడుపుతోంది. 1975 జూన్ 25 విధించిన ఎమర్జెన్సీ సందర్భంగా నాగమ్మ జ్ఞాపకాలపై.. సాక్షి ఆమెను కలిసింది. కొసగంటి నాగమ్మ.. పూజారి జంగవమ్మగా చుట్టుపక్కల గ్రామాల్లో సంవత్సరీకాల (తద్దినాలు) పౌరోహిత్యంతో రోజులు వెళ్లదీస్తున్న ఆమె ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఇలా వివరించింది. ఉరిశిక్ష పై ఉత్తరం వచ్చింది... 1973 ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరి గ్రామానికిచెందిన పెద్ద భూస్వామిని తన భర్త భూమయ్యతో పాటు ఆయన స్నేహితుడు కిష్టాగౌడ్‌లు చంపారు. ఈ కేసు హైకోర్టు విచారించిందని ఆ ఇద్దరికీ ఉరిశిక్ష వేస్తున్నట్లు వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి లేఖ అందింది. భూమయ్యను హత్యకేసులో జైలుకు తీసుకెళ్లిన తర్వాత ఓసారి వరంగల్ సెంట్రల్‌జైలుకు వెళ్లి కలిసాను. ఆ తర్వాత దాదాపు ఏడాదికి భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష వేస్తున్నట్లు ఉత్తరం అందింది. ఆతృతతో ఆయనను చూసేందుకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా బస్ చార్జీలు దొరకలేదు. దీంతో ఆయనను కలవలేకపోయాను. భూమయ్య జైలుకు వెళ్లిన తర్వాత పుట్టినిల్లు పుట్నూరుకు మూడేళ్లబాబు శంకరయ్యతో కలిసి చివరిసారిగా కలవాలని ఎంత ప్రయత్నించినా బస్సు చార్జీలు దొరకలేదు. భూమయ్య, కిష్టాగౌడ్‌లను ముషీరాబాద్ జైలులో ఉరితీసినట్లు ఎవరో రేడియో విని తెలిపారు. ఆ మరునాడు నాలుగురోజులకు అందిన ఉత్తరం తీసుకొని ముషీరాబాద్ జైలుకు వెళ్లాను. పోలీసులు తనను అనేక విధాలుగా ప్రశ్నించి చివరికి జైలునుంచి వచ్చిన ఉత్తరం చూపించడంతో భూమయ్యను పూడ్చిపెట్టిన స్థలాన్ని మాత్రం చూపించారు. కనీసం ఆయన జ్ఞాపకంగా ధరించిన బట్టలైనా ఇవ్వాలని జైలు అధికారులను వేడుకున్నా కనికరించలేదు. బట్టలతోపాటు అలాగే పూడ్చిపెట్టామని జైలుసిబ్బంది తెలిపారు. రెండుసార్లు వాయిదా... ఆందోళనలో పాల్గొన్న అటల్ బిహరీ వాజ్‌పేయ్... భూస్వామి లచ్చుపటేల్ హత్యకేసులో మరణశిక్ష ఖాయమైన తర్వాత ముందుగా వైజాగ్ సెంట్రల్‌జైలులో ఇద్దరికీ ఉరిశిక్ష వేసేందుకు తేది ఖరారు చేశారు. అప్పటికే విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉండడంతో హక్కుల సంఘాల సహకారంతో వైజాగ్ న్యాయస్థానం ముందు వారిద్దరికీ మరణశిక్ష ఆపాలంటూ ఆందోళనలు చేపట్టారు. మరోసారి రాజమండ్రి జైలులో ప్రయత్నించగా తిరిగి బంద్ పిలుపు ఇవ్వడంతో శిక్షను వాయిదా వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేస్తున్న ఉరిశిక్షను రద్దు చేయాలని ఢిల్లీలో అటల్ బిహారీ వాజ్‌పేయ్, శ్రీశ్రీ, జయప్రకాశ్ నారాయణ, జార్జ్‌ఫెర్నండేజ్, కేజీకన్నాభిరామ్, ఎస్.జైపాల్‌రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్‌గుప్త, పత్తిపాటి వెంకటేశ్వర్లు ఇలా పెద్ద సంఖ్యలో మేధావులంతా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. అప్పటికే ఇలాంటి సంఘటనలు శ్రీకాకుళం జిల్లాలో జరిగాయి. శ్రీకాకుళం జిల్లా తాళ్లపాలెం హత్యకేసులో నెల్లూరు జిల్లాకు చెందిన ఇంత రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, రామకృష్ణలకు సెషన్‌కోర్టు మరణశిక్ష విధించగా హైకోర్టు మరణశిక్షను రద్దు చేసి ఆ ముగ్గురిపై సాధారణ శిక్షను అమలుచేశారు. సరిగ్గా తాళ్లపాలెం లాంటి సంఘటనగానే గిన్నదరిలో జరిగిన లచ్చుపటేల్ హత్యకేసును చూడాలంటూ ప్రజాసంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. అయితే 1972లో జరిగిన స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా ఒడిశా ప్రభుత్వం మరణశిక్షలను రద్దు చేసిందని దీని ఆధారంగా భూమయ్య, కిష్టాగౌడ్‌ల మరణశిక్షను రద్దు చేయాలంటూ పలు సంఘాలు డిమాండ్లు చేశాయి. ఈ సమయంలోనే 1975, మే11న ఆ ఇద్దరికీ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ జస్టిస్ చిన్నప్పరెడ్డి, జస్టిస్ గంగాదర్‌రావులు ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఇక ఆ ఇద్దరూ విడుదల అవుతారని భావించారు. ఆ తర్వాత జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల పాత తీర్పును తిరిగి అమలు చేస్తూ డిసెంబర్ 1న ఉరిశిక్ష విధించారు. దేశంలో ప్రజాస్వామిక హక్కులు రదై్దనసమయంగా ఎమర్జెన్సీ సమయాన్ని వర్ణిస్తుంటారు. కొసగంటి భూమయ్య, గున్నాల కిష్టాగౌడ్‌లు ఎవరు..? ఎమర్జెన్సీ సమయంలో ఉరిశిక్షకు గురైన భూమయ్య జంగం పౌరోహితుడు. పెద్దపల్లి డివిజన్లోని వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన భూమయ్య పౌరోహితం కోసం ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో తిర్యాని మండలంలోని గడలపల్లికి చెందిన గున్నాల కిష్టాగౌడ్, అంబారావు సహకారంతో లచ్చుపటేల్ ఆకృత్యాలను తెలుసుకున్నారు. కిష్టాగౌడ్, భూమయ్యలు కలిసి లచ్చుపటేల్‌ను గ్రామ భూస్వామిగా పేర్కొంటూ హతమార్చారు. ఆ తర్వాత ధర్మారం పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ జరిపి వరంగల్, ముషీరాబాద్ జైళ్లకు తరలించారు. అక్కడి నుంచి విచారణ పూర్తికావడంతో వైజాగ్ జైలులో ఉన్న విప్లవకారులు భూమయ్య, కిష్టాగౌడ్‌లకు మద్దతుగా నిలిచి వారిని తమవారిగా, విప్లవపార్టీల కార్యకర్తలుగా ప్రకటించుకున్నారు. అప్పటివరకు ఆ ఇద్దరికీ ఎలాంటి విప్లవపార్టీతో సంబంధం లేకుండానే గిన్నదరి భూస్వామిని హతమార్చి జైలుకెళ్లారు. ఆ తర్వాత 1980లో ఏర్పడిన పీపుల్స్‌వార్ పార్టీ భూమయ్య, కిష్టాగౌడ్‌లను అమరవీరులుగా పేర్కొంటూ నివాళులర్పించింది. కట్టా నరేంద్రచారి, పెద్దపల్లి ఫోటోలు: సతీష్‌రెడ్డి, సాక్షి పెద్దపల్లి -
నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష
ఒక్లహామా, అమెరికా : నైట్రోజన్ గ్యాస్‌తో మరణ దండనను అమలు చేసే పద్దతిని పునరుద్దరిస్తున్నట్లు అమెరికాలోని ఒక్లహామా రాష్ట్ర అధికారులు ప్రకటించారు. అయితే, నైట్రోజన్ వాయువును మరణ శిక్షకు ఏ విధంగా వినియోగించాలనే దానిపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. దీంతో దాదాపు మూడేళ్ల అనంతరం ఒక్లహామాలో మరణ శిక్షలు అమలు కాబోతున్నాయి. 2015 నుంచి ఒక్లహామాలో ఒక్క మరణశిక్ష కూడా అమలు కాలేదు. అంతకుముందు ఓ దోషికి మరణదండన అమలు చేసేందుకు అధికారులు ఇంజెక్షన్‌ను ఎక్కించారు. అయితే, ఆ ఇంజక్షన్ వల్ల దోషి మరణించే ముందు తీవ్రంగా హింసకు గురయ్యాడు. దీంతో లెథల్ ఇంజెక్షన్‌ను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు తమ మందులను మరణశిక్షకు వినియోగచడంపై అభ్యంతరం తెలిపాయి. దీంతో 2015 నుంచి ఒక్లహామా రాష్ట్రంలో మరణశిక్షలు అమలు కావడం లేదు. ఒక్క ఒక్లహామాలోనే కాదు. అమెరికాలోని పలు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే. మరణశిక్షను అమలు చేయడానికి ఇంజెక్షన్లు అందుబాటులో లేక శిక్ష అమలును వాయిదా వేస్తూ వస్తున్నాయి. తాజాగా ఇంజెక్షన్ అమలు లేకపోతే నైట్రోజన్ గ్యాస్‌ను వినియోగించి శిక్షను అమలు చేయాలని ఒక్లహామా తీసుకున్న నిర్ణయం మిగిలిన రాష్ట్రాలను సైతం అదే బాటలో నడపించొచ్చు. వాతావరణంలో అత్యధికంగా లభ్యమయ్యే వాయువు నైట్రోజన్. ఆక్సిజన్ లేకుండా నైట్రోజన్ వాయువును పీల్చడం వలన వ్యక్తికి మరణం సంభవిస్తుంది. -
పరువు హత్య కేసులో సంచలన తీర్పు
ముంబై : మహారాష్ట్రలోని స్థానిక కోర్టు పరువు హత్య కేసులో సంచలన తీర్పునిచ్చింది. ముగ్గురు దళిత యువకులను క్రూరంగా హతమార్చినందుకు మరణశిక్ష విధిస్తూ జడ్జి ఆర్ఆర్ వైష్ణవ్ తీర్పుని వెలువరించారు. ఆహ్మద్‌నగర్ జిల్లాలోని సోనాయ్ గ్రామానికి చెందిన సచిన్ అనే యువకుడు ఇతర సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. దీనిపై అగ్రహించిన అమ్మాయి బంధువులు సచిన్‌తోపాటు సందీప్, రాహుల్‌ని 2013 జనవరి 1న అతి క్రూరంగా హతమార్చి, వారి శరీర అవయవాలను ముక్కలు ముక్కలుగా చేసి సెప్టిక్ ట్యాంకులో వేశారు. ఈ ఘటనలో రఘునాథ్, రమేశ్, ప్రకాశ్, గణేష్, అశోక్, సందీప్ కుర్హే లను దోషులుగా నిర్ధారించి ఊరి శిక్షతో పాటూ రూ. 20 వేల జరిమాను విధించింది. -
క్రీడా స్టేడియంలో బహిరంగ ఉరి
హాంకాంగ్ : మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ను బహిరంగ ఉరి తీయాలని చైనాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తీర్పు వెలువడిన వెంటనే 10 మంది ముఠా సభ్యులను అధికారులు క్రీడా మైదానంలో ఉరి తీశారు. ఈ ఘటన గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులోని లుఫెంగ్ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. పది మందిలో ఏడుగురిపై డ్రగ్స్ నేరారోపణలు ఉన్నాయి. మరో ముగ్గురిపై హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. కాగా, గ్యాంగ్‌కు శిక్ష ఖరారు కావడానికి నాలుగు రోజుల ముందే సోషల్‌మీడియా ద్వారా బహిరంగ ఉరిని వీక్షించేందుకు అందరూ రావాలని ఆహ్వానాలు పంపారు. శిక్ష ఖరారు అనంతరం పోలీసులు ట్రక్కుల్లో వారిని స్టేడియానికి తీసుకువచ్చారు. అనంతరం అప్పటికే రన్నింగ్ ట్రాక్‌పై ఏర్పాటు చేసిన ఉరి కంభానికి వారిని వేలాడదీశారు. ఈ తంతును వేలాది మంది ప్రజలు వీక్షించారు. బహిరంగ ఉరిని తిలకించేందుకు యూనిఫామ్‌లో ఉన్న స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. ‘ఉరి’ శిక్షను ప్రపంచంలో అత్యధికంగా అమలు చేస్తోన్న దేశం చైనానే. గత ఏడాది దాదాపు 2000 మందిని చైనాలో ఉరి తీసినట్లు రిపోర్టులు ఉన్నాయి. నేర ప్రభావం తీవ్రంగా లేకున్నా చైనాలో ఉరి శిక్ష వేయడం ఎప్పటినుంచో జరుగుతోందని అమెరికాకు చెందిన ఓ మానవహక్కుల సంస్థ పేర్కొంది. అయితే, బహిరంగంగా ఉరి శిక్షను అమలు చేయడం మాత్రం చైనాలో అరుదుగా సంభవిస్తుంటుందని తెలిపింది. -
‘నిర్భయ’కు ఐదేళ్లు.. వాళ్ల సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా ఐదేళ్ల క్రితం. దేశ రాజధాని నడిబొడ్డున దాష్టీకం. 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరు మృగాల చేతిలో చిత్రవధలకు గురయిన రోజు. చెప్పుకోటానికి కూడా వీల్లేని రీతిలో కిరాతకంగా అనుభవించి.. నగ్నంగా రోడ్డు పైకి విసిరేశాయి. ఆ వార్తతో యావత్ దేశం ఉలిక్కి పడింది. తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో 2012, డిసెంబర్ 29 న బాధితురాలు తుదిశ్వాస విడిచారు. ‘‘అమానత్, దామిని, నిర్భయ’’ పేర్లతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నలుమూలల నుంచి హస్తినకు చేరిన యువత గర్జించటంతో ఢిల్లీ పీఠం కదిలింది. దేశం యావత్తునూ నిర్ఘాంతపరచిన ఢిల్లీ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులైన ముఖేష్ (26), అక్షయ్‌ఠాకూర్ (28), పవన్‌గుప్తా (19), వినయ్‌శర్మ (20) లకు ఢిల్లీ కోర్టు విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. ఈ కేసును అరుదైన కేసుల్లోకెల్లా అరుదైన కేసుగా నిలుపుతోందని కోర్టు అభివర్ణించింది. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఒక నిస్సహాయ మహిళపై దోషుల అమానవీయ, భయానక చర్యలు జాతి అంతరాత్మను నిర్ఘాంతపరచాయని.. మహిళలపై నేరాలను సహించబోమనే సందేశం పంపటానికి వీరికి తీవ్రమైన శిక్ష అవసరమని న్యాయమూర్తి తీర్పులో స్పష్టంచేశారు. కానీ, ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వారికి శిక్ష అమలు కాలేదు. ఐదేళ్ల తర్వాత న్యాయం... మరి శిక్ష అమలు? ఘటన తర్వాత సీసీ పుటేజీ ఆధారంగా బస్సు డ్రైవర్ రామ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత అతని తమ్ముడు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ వినయ్ గుప్తా, అక్షయ్ ఠాకూర్లను అరెస్ట్ చేశారు. చివరి నిందితుడు, మైనర్ అయిన రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోంకు తరలించి చివరకు విడిచిపెట్టారు. రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకోగా.. మిగిలిన నలుగురికి మరణ శిక్షలు ఖరారు అయ్యాయి. ‘దోషులు చనిపోయే వరకూ ఉరితీయాలి’ అంటూ కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి శిక్షను ప్రకటించారు. నిస్సహాయురాలైన బాధితురాలిని చనిపోవటానికి గురిచేసిన చిత్రహింసలు, గాయాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దోషులకు మరణశిక్ష విధించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత మే 5, 2017న అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ కోర్టు తీర్పుతో ఏకీభవించింది. 8 నెలలు గడుస్తున్నా తీర్పు ఇప్పటిదాకా అమలు కాలేదు. జైలు అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవటంతో మధ్యలో ఓసారి ఆశా దేవీ ఢిల్లీ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మహిళా సంఘం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయినా ఇంత వరకు స్పందన లేదు. ఇదిలా ఉండగా.. దోషులు వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తాలు తాజాగా మరణశిక్ష తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ వచ్చే నెల(జనవరి 2018) 22వ తేదీకి వాయిదా వేసింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైందన్న వాదన నేడు మరోసారి తెరపైకి వచ్చింది. కాలంలో ఇరుక్కున్నాం.. ఆశాదేవి కిరాతకానికి బలైనా నిర్భయ కొన ఊపిరి ఉన్నంతవరకు కూడా మొక్కవోని ధైర్యం ప్రదర్శించింది. కిరాతకులను ఎదురించింది. కాబట్టే ప్రభుత్వం, అధికారులు ఆమె పేరును దాచి పెట్టాలని చూసినా తల్లి ఆశాదేవి మాత్రం అందుకు నిరాకరించారు. ఢిల్లీ నగర బొడ్డున ఓ సమావేశంలో తమ కూతురు పేరు జ్యోతి సింగ్‌గా ప్రకటించారు. ‘‘ఘటన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఆ రాక్షసులు ఇంకా బతికే ఉన్నారు. మా కుటుంబం ఇంకా ఆ ఘటనను, ఈ రోజునే గుర్తు చేసుకుంటూ అక్కడే ఆగిపోయాం. ఇలాంటి సమయాల్లో చట్టాలపై ప్రజలకు గౌరవం పోతుంది. ప్రతీ ఒక్కరి ఆలోచనా ధోరణి మారే విధంగా బలమైన చట్టాల రూపకల్పన జరగాలి. అప్పుడే నిర్భయ ఆత్మకు శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి చెబుతున్నారు. నిర్భయ ఘటన తర్వాత హడావుడి తప్ప పరిస్థితి ఇప్పటికీ ఏం మారలేదు. కఠిన చట్టాలు చేస్తాయన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించటం లేదు. అందుకే ఉద్యమంలో ఇంకా నేను కొనసాగుతూనే ఉన్నా. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, వాళ్ల భవిష్యత్ తదితర దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు. వారిలో అవగాహన పెరిగి.. ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని అని ఆమె అభిప్రాయపడుతున్నారు. -
సీరియల్ రేపిస్ట్‌కు మరణశిక్ష
ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిథారి సీరియల్ రేపిస్ట్‌తోపాటు అతని సహాయకుడికి సీబీఐ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2006లో ఓ మహిళ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. అక్టోబర్ 5వ తేదీన నోయిడాలోని నిథారి గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను వ్యాపార వేత్త మొహిందర్ సింగ్ త్రిపాఠి పనిమనిషి సురేందర్ కోలి లోపలికి పిలిచాడు. అనంతరం యజమానితో కలిసి ఆమెపై అత్యాచారం చేయటంతోపాటు తలనరికి ఇంటి వెనుక పడేశారు. ఇదే విధంగా పలువురు చిన్నారులు, మహిళలపై దారుణాలు జరిపారు. మహిళ అదృశ్యం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహిందర్ సింగ్ ఇంట్లో సోదాలు జరపగా 16మందికి సంబంధించిన ఎముకలు, కపాలాలు కనిపించాయి. ఇందులో ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఈ దారుణం అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా అదే సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపింది. ఈ మేరకు వీరిద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. సోమవారం ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి పవన్ కుమార్ త్రిపాఠి నేరస్తులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
మరణ శిక్ష ఆలస్యం అమానవీయం
న్యూఢిల్లీ: మరణ శిక్ష అమలులో ఆలస్యం చేయడం అనేది అమానవీయ చర్య అని, అంతేకాకుండా అది చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరణ శిక్ష అమలులో జరిగే జాప్యం వల్ల సదరు ఖైదీ మానసిక క్షోభను అనుభవిస్తాడని జస్టిస్ జీఎస్ సిస్తాని, జస్టిస్ వినోద్ గోయల్‌ల ధర్మాసనం పేర్కొంది. 31 ఏళ్ల ఖైదీ సోనూ సర్దార్ తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2004లో జరిగిన ఐదుగురి హత్య కేసులో సర్దార్ సింగ్‌కు 2008లో ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తీర్పును 2010లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సమర్థించింది. దీంతో సర్దార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2012లో సుప్రీంకోర్టు ఆ రెండు న్యాయస్థానాల తీర్పును సమర్థిస్తూ మరణశిక్షను ఖరారు చేసింది. 2013లో గవర్నర్‌కు, 2014లో రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరారు. వారు కూడా అతని పిటిషన్‌ను తోసిపుచ్చారు. 2015లో శిక్షను మరోసారి సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం మళ్లీ నిరాకరించింది. ఇక చివరిసారిగా రాష్ట్రపతి, గవర్నర్ ఉత్తర్వులను కొట్టివేయాలని, అలాగే తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ ధర్మాసనం మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది. -
ట్రిపుల్ తలాఖ్ అంటే... ఉరిశిక్ష లాంటిదే: సీజే
ముస్లిం పురుషులు తమ భార్యకు విడాకులు ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న ట్రిపుల్ తలాఖ్ పద్ధతి ఉరిశిక్ష లాంటిదేనని, అది ఏమాత్రం ఆమోదయోగ్యమైనది కాకపోయినా ఇప్పటికీ దాన్ని అమలుచేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇది పాపమే గానీ చట్టబద్ధమని చెప్పినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఇలా వ్యాఖ్యానించారు. ఒకే సమయంలో మూడుసార్లు తలాఖ్ అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా ముస్లిం పురుషులు వైవాహిక బంధాన్ని తెంచేసుకునే పద్ధతిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా వేసవి సెలవులు కూడా రద్దు చేసుకుని మరీ పనిచేస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ట్రిపుల్ తలాఖ్ పద్ధతి వివక్షాపూరితమని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేందిగా ఉందని వాదిస్తూ పలువురు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మతం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పిన విషయాన్ని చట్టం ఆమోదించగలదా అని సల్మాన్ ఖుర్షీద్‌ను జస్టిస్ కురియన్ జోసెఫ్ ప్రశ్నించారు. ట్రిపుల్ తలాఖ్ పద్ధతి మహిళల పట్ల వివక్ష చూపిస్తుందని, విడాకులు ఇచ్చేందుకు అందులో మహిళలకు సమానహక్కులు లేవని ముగ్గురు ముస్లిం మహిళల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ చెప్పారు. ఫోరమ్ ఫర్ అవేర్నెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అనే సంస్థ తరఫున కూడా జెఠ్మలానీ తన వాదనలు వినిపించారు. ఒకే మతంలో ఉన్న పురుషులు, మహిళలకు పెళ్లి విషయంలో ఒకే తరహా నిబంధనలు ఉండాలని ఆయన అన్నారు. ఈనెల 19వ తేదీ నాటికల్లా ఈ కేసులో వాదనలు ముగించి, జూన్ నెలలో తీర్పు వెల్లడించాలని ధర్మాసనం భావిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో ఒక హిందూ, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ఒక జొరాస్ట్రియన్ న్యాయమూర్తులు ఉన్నారు. ఇదే సందర్భంలో ముస్లిం మతంలో ఉన్న బహుభార్యత్వం, నిఖా హలాలా లాంటి ఆచారాలను కూడా తాము పరిశీలిస్తామని ధర్మాసనం చెప్పింది. ఈ మూడు ఆచారాలను కొట్టిపారేయాలని కొందరు పిటిషనర్లు కోర్టును కోరారు. భారతదేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, నిర్వహణ లాంటి అంశాల్లో ఒక్కో మతానికి ఒక్కో పర్సనల్ లా ఉంది. -
సంచలన తీర్పు: ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు ఉరి
కోల్‌కతా: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నిన ముగ్గురు లష్కరే ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ పశ్చిమ బెంగాల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శనివారం సంచలన తీర్పు చెప్పింది. శిక్షపడిన ముగ్గురిలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులుకాగా, ఒకరు భారతీయుడు. 2007లో బంగ్లాదేశ్ సరిహద్దుగుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను(మొహమ్మద్ యూనస్, అబ్దుల్లా, ముజఫర్ అహ్మద్ రాథోడ్, షేక్ అబ్దుల్లా నయీం) బీఎస్ఎఫ్ బలగాలు పట్టుకున్నాయి. అనంతరం బెంగాల్ సీఐడీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. నిందితులపై ఐపీసీ 120బి, 121, 122 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దోషులేనని నిర్ధారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ శనివారం తీర్పు చెప్పిది. నాలుగో దోషి(షేక్ అబ్దుల్లా నయీం) పరారీలో ఉన్నాడు. ఇదీ నేపథ్యం.. పాకిస్థాన్‌లోని హరీపూర్‌కు చెందిన టీచర్ అబ్దుల్లా, కరాచీకి చెందిన యూనస్, జమ్ముకశ్మీర్(అనంతనాగ్)కు చెందిన ముజఫర్ అహ్మద్, మహారాష్ట్రకు చెందిన షేక్ అబ్దుల్లా నయీమ్‌లు లష్కరే ఉగ్రవాద సంస్థలో చేరి భీరక ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక జట్టుగా ఏర్పడన ఈ నలుగురూ.. కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపుపై దాడి చేసేందుకు పథకం రచించి 2007లో బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడుతూ పట్టుపడ్డారు. బీఎస్ఎఫ్ అధికారులు.. వీరి నుంచి ఏకే-47 రైఫిల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకుని సీఐడీకి అప్పగించారు. విచారణ సందర్భంగా షేక్ అబ్దుల్లా నయీంను మహారాష్ట్రకు తరలించగా అతను పోలీసుల కళ్లుకప్పి తప్పించుకున్నాడు. మిగిలిన ముగ్గురు నిందితులపై కేసు నిరూపణకావడంతో శనివారం తీర్పు వెలువడింది. -
అన్నమో రామచంద్ర!
వరికి ఉరి ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప రాజధాని అవసరమే...అయితే దాని నిర్మాణానికి పచ్చని పంటపొలాలే అవసరమా? వరికి ఉరి బిగించారు. ఆహార పంటలకు ‘కేపిటల్’ పనిష్మెంట్ విధించారు. మొత్తానికి ఉత్తపుణ్యానికే తిండికి గండి కొట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల పొట్టగొట్టారు. దేశంలోనే మరెక్కడా లేని రీతిలో ఏడాదికి మూడు పంటలు పండే 40 వేల ఎకరాల పచ్చని పంటపొలాల్లో రాజధాని నిర్మాణాన్ని తలపెట్టారు. దీనికోసం రైతుల నుంచి సేకరించిన భూములు 34 వేల ఎకరాలైతే, మరో ఆరువేల ఎకరాలు దేవాదాయ భూములు, గ్రామ కంఠం భూములు తదితరమైనవి. పరిసర ప్రాంతాల్లో రాజధాని అవసరాలకు తగినన్ని బంజరు భూములు ఉన్నా, వాటి జోలికి వెళ్లకుండా పచ్చని పొలాలనే కైవసం చేసుకున్నారు. ఏలినవారి నిర్వాకం ఫలితంగా ఏటా 3.80 కోట్ల కిలోల బియ్యం దిగుబడికి శాశ్వత నష్టం వాటిల్లింది. ఇక కూరగాయల పంటలకు, పండ్ల దిగుబడికి వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిది. పంట పొలాల్లో కాంక్రీటు కీకారణ్యం తయారవుతుండటంతో ఏకంగా 21 వేల మంది రైతు కూలీలు ఉపాధి కోల్పోయే దుస్థితి దాపురించింది. రైతులు, రైతు కూలీలే కాకుండా పరోక్షంగా ఎంతోమంది... గోనెసంచీల తయారీదారులు, రవాణాదారులు, వారి వద్ద పనిచేసే హమాలీలు వంటి చాలామంది ఉపాధికి కూడా గండి పడింది. ఆహార సమస్య ప్రపంచవ్యాప్త సమస్యగా ఆందోళన కలిగిస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏరి కోరి పంట పొలాలను ఎంపిక చేసుకున్నారంటే ఆకలితో అలమటిస్తున్న సామాన్యుల పట్ల మన పాలకులకు ఏ మాత్రం శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆకలి రాజధాని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అపర సింగపూర్‌లా అవతరిస్తుందో లేదో తెలీదు గాని, ఆకలి సమస్యకు మాత్రం దారితీస్తుందనేది సత్యం. అమరావతి నగర నిర్మాణం కోసం సేకరించిన మొత్తం 40 వేల ఎకరాల్లో వరి పండించే భూములు 12,820 ఎకరాల వరకు ఉండేవి. ఆ భూముల్లో ఖరీఫ్‌లో ఎకరానికి సగటున 40 బస్తాలు, రబీలో 35 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేది. ఒక్కో బస్తాలో 58 కిలోల ధాన్యాన్ని నింపుతారు. సారవంతమైన భూమి కావడం, సాగునీటికి ఎలాంటి ఎద్దడీ లేకపోవడం వల్ల దిగుబడికి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. వంద కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 68 కిలోల బియ్యం వస్తాయి. నూకలు, తౌడు, ఊక వంటి ఉప ఉత్పత్తులు కూడా మిగులుతాయి. ఈ లెక్కన ఏటా 3.80 కోట్ల కిలోల బియ్యం దిగుబడిని కోల్పోయాం. అంటే సగటున మనిషికి పూటకు 200 గ్రాముల బియ్యం సరిపోతుందని లెక్క వేసుకున్నా... 19 కోట్లమందికి ఒకపూటకు సరిపడే బియ్యం దిగుబడికి శాశ్వత నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే మరో 11,675 ఎకరాల్లో పత్తి సాగు జరిగేది. మిగిలిన భూముల్లో పండ్లు, కూరగాయలను పండించేవారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు ఉంటే వాటిలోని 19 గ్రామాల్లో కూరగాయల సాగు విస్తృతంగా సాగేది. ఏటా కనీసం 200 రోజుల పాటు సగటున రోజుకు 60 టన్నుల కూరగాయలు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లేవి. మిగిలిన రోజుల్లోనూ కూరగాయల సాగు కొనసాగేది. సీజన్లో ఉండవల్లి, పెనుమాక గ్రామాల నుంచే రోజుకు కనీసం పది లారీల అరటి రవాణా జరిగేది. మిగిలిన గ్రామాల్లోనూ అరటి సాగు జరిగేది. విజయవాడ, గుంటూరు నగరాలకు ఏడాది పొడవునా అరటిపళ్లు రవాణా అవుతుండేవి. ఇప్పుడు ఈ నగరాలకు ఇతర రాష్ట్రాల నుంచి అరటిపళ్లను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతం పూలసాగుకు కూడా ప్రసిద్ధి. ఇక్కడి నుంచి ప్రతిరోజూ లారీల కొద్దీ కూరగాయలు, పూలు ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవి. ఇవన్నీ ఇక కాంక్రీటు కట్టడాల కింద సమాధి అయిపోతున్నట్లే! అలాగే రాజధాని నిర్మాణం కోసం సేకరించిన 40 వేల ఎకరాల సాగుభూముల్లో కేవలం వరి మాత్రమే పండించేటట్లయితే 11.83 కోట్ల కిలోల బియ్యం ఉత్పత్తయ్యేది. ఆ బియ్యం కనీసం 59.15 కోట్ల మందికి... అంటే దేశ జనాభాలో దాదాపు సగం మందికి ఒక పూట కడుపు నింపుకోవడానికి సరిపోయేది. పెరుగుతున్న ఆహార అవసరాలు ప్రపంచ జనాభా పెరుగుదల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2050 నాటికి మరో 70 శాతం ఆహార ఉత్పత్తులు అదనంగా అవసరమవుతాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంచనా వేస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచే దిశగా చాలా దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. సాగునేలలను అపురూపంగా సంరక్షించుకోవడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలను తయారు చేసుకోవడం, సాగునీటి వనరుల సంరక్షణ వంటి చర్యలకు నడుం బిగించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా రాజధాని పేరిట సాగుభూమిలో కాంక్రీటు కీకారణ్య నిర్మాణాన్ని తలపెడుతోంది. సారవంతమైన సాగునేలను కాంక్రీటుమయం చేసి పారేస్తే పర్యావరణానికి భారీ స్థాయిలోనే చేటు వాటిల్లుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు మూసుకుపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. పచ్చదనం కనుమరుగవడంతో కర్బన ఉద్గారాలు (కార్బన్ ఎమిషన్స్) పెరుగుతాయి. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) మరింతగా పెరుగుతుంది. ‘ఉన్నవాడికి తింటే అరగదు... లేనివాడికి తిండే దొరకదు’ అన్నాడో సినీకవి. ధనిక దేశాల్లో ఎక్కువ మంది స్థూలకాయంతో బాధపడుతున్న సంగతి జగద్విదితమే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వెనుకబడిన దేశాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. పేదరికం తాండవిస్తున్న దేశాల్లో చాలామంది ఇప్పటికీ ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 79.3 కోట్ల మంది ఆకలి, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తాజా అంచనా. పేదరికమే అసలు సమస్య అభివృద్ధి చెందుతున్న దేశాలలో, వెనుకబడిన దేశాలలో ఇంకా చాలామంది ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ఈ దుస్థితికి పేదరికమే అసలు కారణం. తగినంత ఆహారాన్ని కొనుగోలు చేయడానికి తగిన ఆదాయం లేకపోవడం లేదా సొంతంగా ఆహారం పండించుకోవడానికి తగినంత భూమి అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది తరచుగా పస్తులతో అలమటిస్తున్నారు. వనరుల పంపిణీలో అసమానతలు, విపరీతమైన ఆదాయ వ్యత్యాసాల వంటి కారణాల వల్ల అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో 89.6 కోట్ల మంది నిరుపేదరికంలో మగ్గిపోతున్నారు. వీరంతా చాలీచాలని రీతిలో రోజుకు రెండు డాలర్ల (రూ.133) కంటే తక్కువ ఆదాయంతోనే నెట్టుకొస్తున్నారు. లోపభూయిష్ఠమైన ఆర్థిక వ్యవస్థల కారణంగానే చాలా దేశాల్లో పేదరికం తాండవిస్తోందని ప్రపంచబ్యాంకు 2013లో పేదరికంపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కొన్ని దేశాల్లో యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, ఉగ్రవాదం వంటి కారణాలు కూడా పేదరికానికి దారితీస్తున్నాయని పేర్కొంది. ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశాల్లో 17.2 కోట్ల మంది కడు పేదరికంతో మగ్గిపోతూ ఆకలితో అల్లాడుతున్నట్లు తెలిపింది. ఆహార వృథా... ప్రపంచవ్యాప్త సమస్య ఒకవైపు చాలా దేశాల్లో కోట్ల మంది ప్రజలు నిత్యం ఆకలితో అలమటిస్తూ ఉంటే, మరోవైపు కొందరు విలాసాల్లో మునిగి తేలుతూ, అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఆహార వృథా ఏ కొన్ని దేశాలకో పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న సమస్త ఆహార పదార్థాల్లో దాదాపు మూడో వంతు... అంటే ఏటా 130 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు ఊరకే వృథా అవుతున్నాయని, వాటి విలువ దాదాపు లక్ష కోట్ల డాలర్లకు (రూ.66 లక్షల కోట్లు) పైమాటేనని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా సంపన్న దేశాలే అత్యధికంగా ఆహార వృథాకు పాల్పడుతున్నాయి. సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికన్ దేశాల వార్షిక ఆహార వినియోగం 23.0 కోట్ల టన్నులు అయితే, సంపన్న పారిశ్రామిక దేశాల్లో ఏటా జరుగుతున్న ఆహార వృథా దాదాపు 22.2 కోట్ల టన్నులు. యూరోపియన్ దేశాల్లో ఏటా జరుగుతున్న తలసరి ఆహార వృథా 280 కిలోలు కాగా, అమెరికాలో ఏటా జరుగుతున్న తలసరి ఆహార వృథా 295 కిలోలు. ఆసియాలోని పారిశ్రామిక దేశాల్లో ఏటా 240 కిలోలు, అభివృద్ధి చెందుతున్న దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో ఏటా 125 కిలోల మేరకు తలసరి ఆహార వృథా జరుగుతోంది. నిష్కారణంగా ఆహారాన్ని వృథా చేయడంలో సంపన్న దేశాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలు. ఇవి స్వీడిష్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అండ్ బయో టెక్నాలజీ సేకరించిన లెక్కలు. పదార్థాల వారీగా చూసుకుంటే చిరు ధాన్యాల్లో 30 శాతం, పాల ఉత్పత్తుల్లో 20 శాతం, మత్స్య ఉత్పత్తుల్లో 35 శాతం, పండ్లు, కాయగూరల్లో 45 శాతం, పప్పుధాన్యాలు, నూనె గింజల్లో 20 శాతం, మాంసాహార ఉత్పత్తుల్లో 20 శాతం వృథా అవుతున్నట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆహార వృథాను కనీసం 25 శాతం మేరకు అరికట్టగలిగినా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో నీరసిస్తున్న వారి ఆకలి తీర్చడం సాధ్యమవుతుందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి చెబుతోంది. యథేచ్ఛగా సాగుతున్న ఆహార వృథా వల్ల పర్యావరణానికి కూడా తీవ్రమైన నష్టం కలుగుతోంది. వృథా అవుతున్న ప్రతి టన్ను ఆహార పదార్థాల వల్ల భూతాపానికి కారణమయ్యే వాయువులు 3.8 టన్నుల మేర విడుదలవుతున్నాయని ఎఫ్ఏఓ చెబుతోంది. భారత్‌లోనూ భారీ వృథా ఆకలి కేకలు వినిపించే ప్రాంతాలు భారత్‌లోనూ చాలానే ఉన్నాయి. మరోవైపు, భారత్‌లో జరుగుతున్న ఆహార వృథా తక్కువేమీ కాదు. భారత్‌లో ఏటా 2.10 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, బ్రిటన్ ప్రజలు ఏటా వినియోగించే ఆహారంతో దాదాపు సమానమైన పరిమాణంలో భారత్‌లో ఆహార వృథా జరుగుతోంది. విలాసవంతమైన పెళ్లి విందులు, పండుగలు పర్వాలు, సామూహిక వేడుకలతో పాటు హోటళ్లు, క్యాంటీన్లు వంటి వాటిలో నిత్యం విలువైన ఆహార పదార్థాల వృథా జరుగుతూనే ఉంది. మన దేశంలో ఆహార పదార్థాల వృథా ఈ స్థాయిలో ఉంటే, మరోవైపు దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తరచు పస్తులతో అలమటిస్తున్నారు. ఏటా దాదాపు 70 లక్షల మంది చిన్నారులు ఆకలితో, పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు. -
భారత్‌లో మరణ శిక్షలు ఎందుకు ?
న్యూఢిల్లీ: ప్రపంచంలో మెజారిటీ దేశాలు మరణ శిక్షను రద్దు చేస్తుంటే భారత్ మాత్రం గత రెండు నెలల్లో మరణ శిక్షను విధించే రెండు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. 2015 సంవత్సరం నాటికి 140 దేశాలు మరణ శిక్షను పూర్తిగా రద్దు చేశాయి. ప్రజల మరణానికి కారణమయ్యే హానికరమైన విష పదార్థాలు కలిపినట్లయితే నేరస్థులకు మరణ శిక్ష విధించాలంటూ గత మార్చి నెలలో బీహార్ ఎక్సైజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. మరణ శిక్షకు వీలు కల్పించే యాంటీ హైజికింగ్ చట్టాన్ని కూడా ఈ మే నెలలో పార్లమెంట్ నోటిఫై చేసింది. అరుదైన దారుణమైన కేసుల్లో మరణ శిక్ష విధించవచ్చనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఎలాగూ ఇప్పటికే అమల్లో ఉన్నాయి. గుల్బర్గ సొసైటీ లాంటి తీవ్రమైన కేసుల్లో, కిరాతకమైన రేపు కేసుల్లో మరణ శిక్షలు విధించాలనే వాదనలు ఎలాగు ఎప్పుడూ ఉంటున్నాయి. ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందనే కారణంగా మరణ శిక్షను భారత్‌లో కూడా పూర్తిగా రద్దు చేయాలంటూ పలు ఎన్జీవో సంస్థలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మరణ శిక్షను విధించే మరో చట్టాలను తీసుకరావడం చర్చనీయాంశం. దేశంలో మరణ శిక్షను రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కూడా భారత్ లా కమిషన్ గత ఆగస్టులో సమర్పించిన నివేదికలో అభిప్రాయపడింది కూడా. ఇటీవల తీసుకొచ్చిన రెండు చట్టాలు సుప్రీం కోర్టు సూచించిన మార్గదర్శకాలకు కూడా విరుద్ధంగా ఉన్నాయి. చంపాలనే ఉద్దేశంతోనే నేరస్థులు నేరం చేసి, పర్యవసానంగా ఎవరి చావుకైనా కారణమైన సందర్భాల్లోనే మరణ శిక్షను విధించాలని సుప్రీం కోర్టు సూచించింది. చంపాలని ఉద్దేశం లేకపోయినా, హైజాకింగ్ వల్ల, మద్యం కల్తీ వల్ల ఎవరి చావుకైనా నేరస్థులు కారణమైతే చాలు వారికి మరణ శిక్షను విధించే అధికారాన్ని పై రెండు కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. మన దేశంలో మరణ శిక్షలు ఎక్కువే విధించినప్పటికీ అమలు చేసిందీ మాత్రం తక్కువేనని చెప్పాలి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం 2004 నుంచి 2013 సంవత్సరం వరకు 1303 మందికి, 2014 సంవత్సరంలో 95 మందికి మరణ శిక్షలు విధించగా, గత 16 ఏళ్లలో కేవలం నలుగురకి మాత్రమే మరణ శిక్షలు అమలు చేశారు. వాటిలో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో టైగర్ మెమన్‌కు మరణ శిక్ష అమలు చేయడమే తాజాది. మరణ శిక్షలు రద్దు దిశగా ప్రతి దేశం చర్యలు తీసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను కోరుతున్న విషయం తెల్సిందే. -
ఉరికంబం.. వివక్ష
ఉరితాడుకు కూడా కులం ఉన్నదని...ధనిక, పేద వివక్ష ఉన్నదని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక మరోసారి ధ్రువపరిచింది. రెండున్నరేళ్లు ఎంతో శ్రమించి, దేశంలోని అనేక జైళ్లలో ఉరికంబం నీడన బతుకు లీడుస్తున్న అభాగ్యుల్ని కలిసి మాట్లాడి ఈ నివేదికను వెలువరించారు. మొత్తంగా ఉరిశిక్ష పడిన 385మందిలో 373మందికి సంబంధించిన వివరాలను ఈ నివేదిక అధ్యయనం చేసింది. మన చట్టాలు, కోర్టులు, జైళ్లు ఎలా పనిచేస్తున్నాయో... వాస్తవంగా జరుగుతున్నదేమిటో వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. ఉరిశిక్ష పడినవారు నేరస్తులా, అమాయకులా అన్న చర్చలోకి ఈ నివేదిక పోలేదు. వారు చేసిన నేరమేమీ లేదని వాదించబూనుకోలేదు. ఆ నివేదిక చేసిందల్లా వాస్తవాలను సమాజం ముందుంచడమే. నివేదిక రూపకల్పనలో పాలు పంచుకున్నవారంతా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు. ఉరిశిక్షకు అర్హమైన నేరాలేమిటో చెప్పే చట్టాలు మన దేశంలో చాలా ఉన్నాయి. భారత శిక్షాస్మృతిలోని 12 సెక్షన్లతోసహా 18 కేంద్ర చట్టాలు ఎలాంటి నేరాలకు ఉరిశిక్ష విధించవచ్చునో చెబుతున్నాయి. మొత్తంగా 59 సెక్షన్లు మరణశిక్ష విధింపునకు వీలు కల్పిస్తున్నాయి. ఇవిగాక రాష్ట్రాల్లో అనేక చట్టాలున్నాయి. మన రాజ్యాంగం ‘జీవించే హక్కు’ను వాగ్దానం చేస్తుంటే ఒక మనిషి ప్రాణం తీయడానికి ఇన్ని చట్టాలు, నిబంధనలా అని ఆశ్చర్యం కలగొచ్చు. ఇలాంటి సంశయమే ఏర్పడటం వల్ల కావొచ్చు...జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని లా కమిషన్ నిరుడు ఆగస్టులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఉరిశిక్షను మన చట్టాలనుంచి ‘దశలవారీగా’ తొలగించాలని సిఫార్సు చేసింది. ఉగ్రవాదం మినహా ఇతర నేరాలకు దీన్ని విధించరాదని పేర్కొంది. ‘అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది’ అయినప్పుడు మాత్రమే ఉరిశిక్ష విధించాలని 1983లో ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నేర స్వభావాన్నిబట్టి... నేరస్తుణ్ణి సంస్కరించడం సాధ్యమా, కాదా అన్నదాన్నిబట్టి ఒక కేసు ‘అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనద’ని నిర్ధారించుకున్న తర్వాతే ఈ శిక్ష విధించాల్సి ఉంటుంది. అయితే కింది కోర్టులు ఉరిశిక్ష విధించేటపుడు ఈ గీటురాయిని పరిగణిస్తున్నాయా? లేదనే చెప్పాలి. 2000-2015 సంవత్సరాల మధ్య మన దేశంలో కింది కోర్టులు మొత్తం 1,617మందికి ఉరిశిక్ష విధించాయి. ఉరిశిక్ష విధింపు అన్నది ఒక రకంగా ఏకపక్షమైనదేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ భగవతి ఒక సందర్భంలో అభిప్రాయపడ్డారు. అది తీర్పునిచ్చే న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలకూ, వారికుండే సామాజిక చింతనకూ, వారు ముందుగా ఏర్పర్చుకునే భావాలకూ, పక్షపాత ధోరణులకూ లోబడి ఉంటుందన్నది జస్టిస్ భగవతి భావన. ఉరిశిక్షల విధింపు విషయంలో సుప్రీంకోర్టు విధించిన పరిమితులు పట్టకపోవడానికి ఇలాంటి అంశాల ప్రభావం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఉరిశిక్ష విధింపు నకు సంబంధించి మన రాజ్యాంగ నిర్ణాయక సభలో విస్తృతమైన చర్చే జరిగింది. ఆ సభలో సభ్యుడిగా ఉన్న శిబన్లాల్ సక్సేనా ఆ శిక్ష ఉండరాదని గట్టిగా వాదించారు. బ్రిటష్ పాలనలో 26 నెలలపాటు ఆయన ఉరిశిక్ష పడిన ఖైదీగా ఉన్నారు. తన సహచరులు 37మంది ఉరికంబం ఎక్కడాన్ని చూశారు. వారిలో కనీసం ఏడుగురు అసలు ఏ నేరంతోనూ సంబంధం లేనివారని సక్సేనా చెప్పారు. శిక్ష విధింపునకు అవకాశమిస్తే అమాయకులు బలైపోతారని హెచ్చరించారు. అయినా దాన్ని చివరకు పార్లమెంటు నిర్ణయానికి వదిలేశారు. ఉరిశిక్ష పడిన ఖైదీల్లో చాలామంది(74.1శాతం) ఆర్ధిక స్థోమత లేనివారని నివేదిక చెబుతోంది. అలాగే వారిలో 76 శాతంమంది(279మంది) సమాజంలో అట్టడుగు కులాలవారూ, మతపరంగా మైనారిటీలు. జాతీయ స్థాయిలో చూస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు 24.5 శాతం ఉన్నారు. అయితే మహారాష్ట్రలో 50శాతంమంది, కర్ణాటకలో 36.4 శాతం, మధ్యప్రదేశ్‌లో 36 శాతం, బిహార్‌లో 31.4 శాతం, జార్ఖండ్‌లో 30.8 శాతం మంది ఈ వర్గాలవారే. వీరిలో 85.4 శాతంమంది ఆర్ధికంగా దుర్బలులే. మరణశిక్ష పడినవారిలో మైనారిటీలు 20.7 శాతం. వీరి జనాభా నిష్పత్తిని బట్టి చూస్తే ఇది అధికం. అలాగే ఈ మైనారిటీ ఖైదీల్లో 76శాతంమంది ఆర్ధికంగా స్థోమత లేనివారు. ఉరిశిక్ష పడినవారితో జైల్లో పని చేయించరు గనుక వారికి ఎలాంటి ఆదాయమూ ఉండదు. కనుక తమ కుటుంబాలకు అంతో ఇంతో పంపడం వారికి సాధ్యంకాదు. ఆ విధంగా ఉరిశిక్ష పడిన ఖైదీల కుటుంబాలు కూడా నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి. న్యాయ వాదిని నియమించుకోలేనివారికి న్యాయ సహాయం అందించడం తప్పని సరని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఉరిశిక్ష పడిన 189మంది ఖైదీల్లో 169మందికి అసలు న్యాయవాదులే లేరని తేలింది. అంటే వారిపై వచ్చిన అభియోగాల్లోని అహేతుకతను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినవారే లేరన్న మాట! కొందరు ఖైదీలు చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. ఏవో కొన్ని పత్రాలపై సంతకాలు చేయాలంటూ పోలీసులు తీసుకుపోయారని, ఆ తర్వాత ఇంటి ముఖం చూడలేదని, చివరకు ఇంత పెద్ద శిక్ష పడి దిక్కుతోచకుండా కాలం వెళ్లదీస్తున్నామని వెల్లడించినవారున్నారు. అరెస్టుకూ, న్యాయస్థానంలో హాజరు పరచడానికీ మధ్య ఎన్ని రకాల చిత్రహింసలు అనుభవించాల్సివచ్చిందో, ఎంత నరకం చవిచూడాల్సివచ్చిందో...పర్యవసానంగా చేయని తప్పును నెత్తిన వేసుకుని ఉరికి ఎలా చేరువైనామో మరికొందరు చెప్పారు. ఉరిశిక్ష పడిన ఖైదీలకు ఉండాల్సిన హక్కులు, వారు పొందగల న్యాయసహాయం వంటి అంశాలపై రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. కానీ ఆచరణలో అవి ఎలా అమలవుతున్నాయో ఇప్పుడు జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిం చడంతోపాటు ఆ శిక్ష పడిన ఖైదీలకు కనీస హక్కులు లేకుండా చేయడంపై హక్కుల సంఘాలు చాలా కాలంనుంచి ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి సంఘాలకు ఉద్దేశాలను ఆపాదించడంలో ఉన్న శ్రద్ధ...వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవడంలో లేకుండా పోయిందని తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి లోపాలను సరిదిద్దుకోవడం తక్షణావసరమని గుర్తించాలి. -
ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలి
-
ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలి
అనూహ్య హత్యకేసులో దోషిగా తేలిన చంద్రభాన్కు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య తండ్రి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలని, అలాగే ఈ తీర్పు ఉందని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తమ ఇంట్లో ఆయన శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఈ నిర్ణయం నేరస్థులకు గుణపాఠంగా ఉంటుందని నమ్మకం కలిగిస్తోంది ఈ కేసు విషయంలో మాకు అండగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తొలిసారి నన్ను చూసినప్పుడు నేను అనూహ్య తండ్రినని అతడికి తెలియదు నాకెందుకో అతడి మీద కోపం రాలేదు గానీ, నేరం చేశానన్న ఆలోచన గానీ, భయం గానీ కనపడలేదు అతడిని నేను చూడటం అదే మొదటిసారి, చివరిసారి మొదట్లో ఈ కేసు విచారణలో నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి అనూహ్య బైకు ఎందుకు ఎక్కుతుంది, అంత దూరం వెందుకు వెళ్తుందని అనిపించింది ఆమె రెండో ప్లాట్ఫారం మీద దిగి, నాలుగో ప్లాట్ ఫారం మీదకు వచ్చింది ముందు తనకు కారు ఉందని చెప్పాడు, తర్వాత బైకు మీద తీసుకెళ్లాడు బహుశా తన సామాన్లు పోతాయనే భయంతో ఆమె వెళ్లి ఉంటుందేమో తను చాలా సెన్సెటివ్‌గా ఉండేది.. ఎవరైనా గట్టిగా మాట్లాడినా ఏడ్చేసేది కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా ఉంది ఉరిశిక్ష వేయకూడదనే మానవతావాదులు, మానవహక్కుల వాళ్లు ఉన్నారు కానీ ఇలాంటి క్రూర మనస్తత్వం ఉన్నవాళ్లకు కూడా ఇలాంటి శిక్షలు వేయకపోతే ఏముంది, నాలుగు రోజులు జైల్లో ఉంటే సరిపోతుందేమో అనుకుంటారు ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష వేస్తేనే సరైనదని నేను ముందునుంచి భావించాను ఈ శిక్ష చూసిన తర్వాత ఆడపిల్ల జోలికి వెళ్లాలంటే భయపడాలి.. ఈవ్ టీజింగ్ చేసేవాళ్లు కూడా భయపడాలి టీజింగ్ గురించి సినిమాల్లో కూడా పాజిటివ్‌గా చూపిస్తున్నారు అక్కడంతా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు గానీ, బయట సమాజంలో అలా లేదు సమాజంలో తెలివిగా ఉండాలని తెలియజేయాలి చంద్రభాన్ ఇక హైకోర్టుకు వెళ్లినా కూడా.. పోలీసుల వద్ద నూటికి నూరుశాతం ఆధారాలు ఉండటంతో అక్కడ కూడా మరణశిక్షను తప్పించుకునే అవకాశం లేదని అనుకుంటున్నాను అతడి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు కేసు జరుగుతున్నప్పుడు కూడా ముంబై పోలీసులు పిలిచి, నన్ను తీసుకెళ్లి తాము సేకరించిన సాక్ష్యాల గురించి వివరించారు. దాంతో నాకు నమ్మకం కలిగింది. -
మూడేళ్లలో 339 ఉరిశిక్షలు
న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్లలో 2011 నుంచి 2013 మధ్యకాలంలో మొత్తం 339 మందికి మరణ శిక్ష విధించాలని తీర్పులు వెలువరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పారతి భాయ్ చౌదరి లోక్ సభలో ప్రకటించారు. జాతీయ నేరాల రికార్డు సంస్థ వివరాల ప్రకారం 2011లో 117 మందికి ఉరిశిక్ష పడగా, 2012లో 97 మందికి, 2013లో 125 మందికి ఉరిశిక్ష పడినట్లు ఆయన వివరించారు. ప్రస్తుత వివరాల ప్రకారం వీటిలో ఐదు కేసులు మాత్రం క్షమాభిక్ష పిటిషన్లో ఉన్నాయని తెలిపారు. మరోపక్క, 2011లో ఎవరినీ ఉరి తీయలేదని 2012లో ఒకరిని, 2013లో మరొకరిని ఉరితీసినట్లు తెలిపారు. -
ఉరిశిక్షపై వరుణ్ గాంధీ ఏమన్నారో తెలుసా?
మరణశిక్షను రద్దు చేయాలా.. వద్దా? ఈ అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ ఇప్పుడు ఉరిశిక్షను రద్దుచేయాలని పోరాడేవాళ్ల జాబితాలోకి చేరిపోయారు. మరణశిక్ష వల్ల కేవలం పగ చట్టబద్ధం అయిపోతుందని వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష వల్ల సమాజంలో అరాచకత్వం పెరిగిపోతుందన్నది యుగాలుగా రుజువు అవుతూనే ఉందన్నారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరితీత నేపథ్యంలో వరుణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మరణశిక్షను నిషేధించాలని వరుణ్ గాంధీ చెప్పారు. అరుదైన వాటిల్లోకెల్లా అరుదైన కేసు అంటే ఏమిటన్న దానికి భారత న్యాయ వ్యవస్థలో స్పష్టమైన నిర్వచనం లేదని, న్యాయమూర్తి నిర్ణయాన్ని బట్టి, సామాజిక - రాజకీయ నమ్మకాలను బట్టి ఇది నిర్ణయం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. మరణశిక్ష మాత్రమే ఒక మాయని మచ్చగా ఉందన్నారు. వాస్తవానికి ఇప్పుడు బతుకుతున్న చాలామందికి చావుకు అర్హత ఉందని, చనిపోయిన కొంతమందికి బతికే అర్హత ఉందని వరుణ్ చెప్పారు. -
వారి మరణశిక్షకు అంతా సిద్ధం
-
వారి మరణశిక్షకు అంతా సిద్ధం
ఆస్ట్రేలియా పౌరులు ఆండ్రీ చాన్, మైయూరన్ సుకుమారన్‌లకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. వారి మరణశిక్ష అమలుకు శనివారమే 72 గంటల నోటీసు కూడా అందజేశారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు మరణశిక్ష అమలుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు శవపేటికలు సిద్ధం చేశారు. వాటిపై చనిపోయిన రోజును తెలిపేలా '29-4-2015' అన్న తేదీలను లిఖించారు. వారిని కాల్చి చంపేందుకు 12 మందితో కూడిన షూటింగ్ స్క్వాడ్‌ను కూడా సిద్ధం చేసినట్టు బాలి జైలు అంత్యక్రియల డైరెక్టర్ సుహేంద్ర పుత్ర తెలిపారు. వారికి క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్‌లతోపాటు పలు దేశాలు చేసిన విజ్ఞప్తులను ఇండోనేషియా తోసిపుచ్చింది. ఆ శాధ్యక్షుడు విడోడో మౌనం వహించారు. ఇండోనేషియాలోని బాలి నగరం నుంచి ఆస్ట్రేలియాకు మత్తు పదార్థాలు తరలిస్తూ ఆండ్రీ చాన్, మైయూరన్ సుకుమారన్ పట్టుపడ్డారు. వారితో పాటు ఓ బ్రెజిల్ దేశస్థుడు రోడ్రిగో గులార్టే, నైజీరియా దేశస్థుడు అయోటాంజ్, ఫిలిప్పీన్స్ దేశస్థుడు ఫీస్టా వెలిగోలను అరెస్టు చేశారు. వారందరికీ ఇండోనేషియా కోర్టు 2005లోనే మరణశిక్ష విధించింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు ఈ కేసులో పలు అప్పీళ్లపై విచారణ కొనసాగింది. చివరకు ఇండోనేషియా సుప్రీం జ్యూరీ వారికి మరణశిక్షనే ఖరారు చేసింది. నిందితులందరూ ఈ పదేళ్లు జైలులోనే గడిపారు. ఈ కాలంలో వారెంగో మారారు. వారు తోటి ఖైదీలను సాయం చేశారు. జైలు తరఫున సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాము ఎంతో మారామని, శేష జీవితాన్ని బుద్ధిగా గడుపుతామని, తమను తమ దేశాలకు పంపించాలని వారు కోర్టుల ముందు ఎన్నో సార్లు మొరపెట్టుకున్నారు. భారీగా జరిమానా కడితే 20 ఏళ్ల జైలు శిక్షతో సరిపెడతామని జడ్జీలు కూడా ఆశపెట్టారు. అంత డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేని వారి కుటుంబ సభ్యులు తమ దేశాధినేతలను ఆశ్రయించారు. దాంతో ప్రపంచం ముందు తమ పరువు పోతుందని భావించిన ఇండోనేషియా ప్రభుత్వం చట్టాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూప్రీం జ్యూరీని ఆదేశించింది. దాంతో వారు మరణశిక్ష వైపే మొగ్గు చూపారు. ఆస్ట్రేలియా పౌరులతోపాటు పట్టుబడ్డ ఇతర దేశస్థులకు కూడా బుధవారం తెల్లవారు జామునే మరణ శిక్ష అమలు చేస్తున్నారు. ఆండ్రీ చాన్, సుకుమారన్‌ల ఇంటర్వ్యూలను పలు ఆస్ట్రేలియా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. దోషుల ఆఖరి కోరికలు తీర్చేందుకు జైలు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జైలులో పెయింటింగ్‌లు వేస్తూ పాపులర్ అయిన సుకుమారన్, తాను తుదిశ్వాస విడిచేవరకు పెయింటింగ్‌లు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. తుపాకీ తూటా తగిలి తాను నేలకొరిగిపోతున్న 'సెల్ఫ్ ప్రోట్రేట్స్' వేసుకున్నాడు. చివరివరకు తన కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలో ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించాలని ఆండ్రీచాన్ ఆఖరి కోరిక కోరాడు. -
భగ్గుమన్న తమిళనాడు.. రెండు బస్సులు దహనం
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష వేయడంపై తమిళనాడు భగ్గుమంటోంది. ప్రధానంగా రామేశ్వరం ప్రాంతంలో మత్స్యకారులు తీవ్ర హింసకు పాల్పడ్డారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించారు. దాదాపు 108 జాలర్ల సంఘాలన్నీ కలిసి తీరప్రాంత గ్రామాల్లో ఆందోళన చేపడుతున్నారు. రోడ్లపైకి ఎక్కి విధ్వంసానికి పాల్పడ్డారు. రెండు బస్సులను పూర్తిగా దహనం చేశారు. రైల్వే ట్రాకును కూడా ధ్వంసం చేయడంతో అటువైపు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రామనాథపురం జిల్లాలో విధ్వంసం జరుగుతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో వెళ్లారు. తీరప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. -
మరణశిక్ష-మానవీయత!
ఉరిశిక్ష ఉండాలా వద్దా అనే మీమాంస సంగతలా ఉంచి...ఆ శిక్ష పడినవారి విషయంలో అనుసరించాల్సిన విధానంపై చాన్నాళ్లుగా ఉన్న వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఇకనుంచి అలాంటి ఖైదీలు దాఖలు చేసుకునే రివ్యూ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 మెజారిటీతో మంగళవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం మరణశిక్ష పడిన ఖైదీల రివ్యూ పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బహిరంగ కోర్టులో విచారించాల్సి ఉంటుంది. శిక్షపడిన ఖైదీ తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదికి అరగంట వ్యవధినివ్వాలనివ్వాల్సి ఉంటుంది. ‘అరుదైనవాటిలో అత్యంత అరుదైన’ నేరాలకు మాత్రమే మరణశిక్ష విధించాలన్నది మన న్యాయస్థానాలు అనుసరిస్తున్న విధానం. కింది కోర్టులు విచారణ జరిపి విధించే ఇలాంటి శిక్షలపై ఉన్నత న్యాయస్థానాలు సమీక్షిస్తాయి. వాటిని ఖరారు చేయడం లేదా యావజ్జీవ శిక్షలుగా మార్చడం చేస్తాయి. అయితే, మరణశిక్ష ఖరారైన ఖైదీలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేసుకున్న సందర్భాల్లో వాటిని న్యాయమూర్తులు తమ ఛాంబర్లలోనే పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవడం దాదాపు ఆరు దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయం. ఈ విషయంలోనే మానవ హక్కుల ఉద్యమకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఒకసారి సుదీర్ఘమైన విచారణ ప్రక్రియ పూర్తయిన కేసులపై రివ్యూ పిటిషన్ దాఖలైనప్పుడు దానిపై మళ్లీ మళ్లీ విచారించడం, ఖైదీ తరఫు న్యాయవాది వాదనలు వినడంవంటివి అవసరం లేదని... కేసులోని ప్రధానాంశాలను స్థూలంగా పరిశీలించి న్యాయమూర్తులు తుది నిర్ణయం తీసుకోవచ్చునన్న దృక్పథమే ఇంతవరకూ అనుసరించిన సంప్రదాయానికి ప్రాతిపదిక. అయితే, రెగ్యులర్‌గా సాగే విచారణల్లో వెల్లడికాని అనేకానేక అంశాలు అనంతరకాలంలో బయటపడటానికి అవకాశం ఎప్పుడూ ఉంటుందని... అలాగే, విచారణ జరిపిన ధర్మాసనం సైతం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఏర్పడవచ్చునని మానవహక్కుల ఉద్యమ కారులు ఎప్పటినుంచో వాదిస్తున్నారు. ఇవన్నీ రివ్యూ పిటిషన్ విచారణ సమయంలో ప్రస్తావనకొస్తే మరణశిక్ష పడిన ఖైదీకి చివరి నిమిషంలో ఉపశమనం లభించే అవకాశం ఉండవచ్చన్నది వారి అభిప్రాయం. నేరస్తుడిగా ఖరారైన వ్యక్తిని చట్టబద్ధంగా ఉరితీసి శాశ్వతంగా అతని జీవితానికి ముగింపు పలుకుతున్నప్పుడు అందుకు సంబంధించి ఇచ్చే తీర్పు నిర్దుష్టమైనదిగా ఉండవలసిన అవసరం లేదా అన్నది వారి ప్రశ్న. ఒక మనిషికి నేరంలో ప్రమేయం ఉన్నదా, లేదా...ఉంటే అది ఏ మేరకు అనే విషయంలో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలుంటాయి. ఇందిరాగాంధీ హత్య కేసులో మరణశిక్ష అమలైన కేహార్‌సింగ్ విషయంలో ఈ రకమైన వాదనలు బలంగా వినబడ్డాయి. ఆయనను దోషిగా నిర్ధారించడంలో ధర్మాసనం అవగాహనాలోపం ఉన్నదని మానవహక్కుల కార్యకర్తలు విమర్శించారు. నిరుడు ఫిబ్రవరిలో ఉరిశిక్ష అమలైన ఉగ్రవాది అఫ్జల్‌గురు విషయంలోనూ ఈ తరహా వాదనలే వినిపించాయి. పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో అతని ప్రమేయాన్ని తిరుగులేనివిధంగా రుజువుచేయగల సాక్ష్యాధారాలేవీ లేవని ఆయన తరఫు న్యాయవాదులన్నారు. బహుశా వారి రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం మరోసారి సమగ్ర విచారణ జరిపి, వారి తరఫు న్యాయవాదులు లేవనెత్తుతున్న అంశాలను పరిశీలించి తీర్పు ఇస్తే ఇలాంటి అభిప్రాయాలకు చోటుండేది కాదేమో! ఇక్కడ చాన్నాళ్లక్రితం వచ్చిన అమెరికన్ చిత్రం ‘ట్వెల్వ్ యాంగ్రీమెన్’ గురించి చెప్పుకోవాలి. ఒక హత్య కేసు నిందితుడి దోషిత్వం విషయంలో జ్యూరీ సభ్యులమధ్య సాగిన వాదప్రతివాదాలు ఆ చిత్రం ఇతివృత్తం. ఒక వ్యక్తిని నిర్దోషిగా భావించడానికి ఎన్ని అవకాశాలుంటాయో ఆ చిత్రం చూపుతుంది. మరణశిక్షపై వాదోపవాదాలు ఈనాటివి కావు. అది అమానుషమైనదని, దాన్ని కొనసాగించడమంటే మానవ హక్కును నిరాకరించడమేకాక జీవించే హక్కును కాలరాయడమని మానవహక్కుల ఉద్యమకారులంటారు. నేరం చేసే వ్యక్తికి విచక్షణా జ్ఞానం లోపించినంత మాత్రాన వ్యవస్థ సైతం అదే తోవన వెళ్లాల్సిన అవసరం లేదని వారు వాదిస్తారు. ప్రపంచంలో 139 దేశాలు మరణశిక్షలను తొలగించాయి. మరికొన్ని దేశాలు ఆ శిక్షల అమలును నిలిపేశాయి. ఈ తరహా అమానుష శిక్షలను రద్దు చేయాలని 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, అత్యంత కఠినమైన శిక్షలుంటాయన్న భయం నేరస్తులకు ఉంటే తప్ప దారుణ అకృత్యాలు తగ్గవని ఆ శిక్షను సమర్థించేవారు వాదిస్తారు. మరణశిక్షను రద్దుచేసిన దేశాల్లో నేరాలు పెరిగిన దాఖలాలేదని మానవ హక్కుల ఉద్యమకారులు చెబుతారు. ఈ వాదప్రతివాదాల సంగతి అలావుంచితే ఉరిశిక్షపడినవారి విషయంలో సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్న విధానంకంటే మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉన్నదని ధర్మాసనం భావించింది. శిక్షపడినవారు దాఖలు చేసే పిటిషన్ సమగ్రంగా ఉండకపోవచ్చునని, నిపుణుడైన న్యాయవాది మౌఖికంగా చేసే వాదనలు సమర్ధవంతంగా ఉండి కేసులో దోషిత్వ నిర్ధారణలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొంది. స్వభావరీత్యా మరణశిక్ష అనేది ఒకసారంటూ అమలు చేశాక తిరగదోడటానికి వీల్లేనిది గనుక ఆ శిక్ష విధింపు విషయంలో అత్యంత జాగురూకతతో, మానవీయతతో మెలగాలన్నదే సుప్రీంకోర్టు తాజా తీర్పు సారాంశం. ఈ తీర్పుతో జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ ఔన్నత్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి చాటిచెప్పింది. -
సౌదీలో భారతీయుడి తల నరికివేత
రియాద్: హత్యానేరంపై భారతీయ కార్మికుడొకరికి సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించారు. శిరచ్ఛేదం(తల నరికివేత) చేసి శిక్ష అమలు చేశారు. తనకు ఉపాధి కల్పించిన డాఫిర్ ఆల్-డొసరిని హత్య చేసిన భారతీయ కార్మికుడు మహ్మద్ లతీఫ్‌కు శిరచ్ఛేదం చేసినట్టు ఆంతరంగిక వ్యవహారాల శాఖ వెల్లడించింది. డాఫిర్తో గొడవపడి అతడిని ఇనుప రాడ్‌తో లతీఫ్ కొట్టి చంపాడు. తర్వాత డాఫిర్ మృతదేహాన్ని గొతిలో పూడ్చిపెట్టాడు. కేసు విచారించిన స్థానిక న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అయితే మృతుడి కుమారులు పెరిగి పెద్దవారయి శిక్ష ఆమోదించాలన్న అభ్యర్థనతో శిక్ష అమలును గతంలో కోర్టు వాయిదా వేసింది. గురువారం శిక్ష అమలు చేశారని సౌదీ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఏడాదిలో మొత్తం ముగ్గురు నేరస్థులకు శిరచ్చేదం చేశారు. హత్య, అత్యాచారం, దోపిడీ, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారు. -
నిర్భయ కేసులో దోషులు నలుగురికీ ఉరిశిక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లకు ఉరిశిక్ష విధించారు. వీరు నలుగురిని మంగళవారమే దోషులుగా నిర్ధారించినా, శిక్షను మాత్రం శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కిక్కిరిసిన కోర్టు హాల్లో అత్యంత ఉత్కంఠ నడుమ వీరు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ.. అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా తీర్పు వెలువరించారు. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. వీరిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి. అయితే, తీర్పుపై హైకోర్టులో సవాలుచేస్తామని దోషుల తరఫు న్యాయవాది తెలిపారు. దేశ రాజదాని ఢిల్లీలో గత డిసెంబర్ 16 నాటి రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్లో గత మార్చి 11న విగతజీవుడై కన్పించాడు. ఈ కేసులో మైనర్ అయిన మరో నిందితునికి మూడేళ్లు స్పెషల్ హోంలో గడపాలంటూ ఆగస్టు 31న జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పు చెప్పింది. దీంతో మొత్తం జీవించి ఉన్న ఐదుగురు నిందితులకు శిక్ష పడినట్లయింది. హత్య కేసులలో అత్యంత అరుదైన కేసుల్లోనే దోషులకు మరణశిక్ష పడుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. చిన్నారులు, నిస్సహాయులైన మహిళలు, బలహీనులైన వ్యక్తులు లేదా వృద్ధులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన దోషులకు కోర్టు సాధారణంగా మరణశిక్ష విధిస్తుందని, ఇలాంటివే అత్యంత అరుదైన కేసుల కోవలోకి వస్తాయని పేర్కొం టున్నారు. 1955 వరకు హత్య కేసులన్నిటిలో దోషులకు మరణశిక్షే విధించేవారు. గతంలో ముంబై మీద ఉగ్రదాడులకు పాల్పడిన కేసులో సజీవంగా పట్టుబడిన ఏకైక నిందితుడు అజ్మల్ కసబ్‌ను, పార్లమెంటు మీద దాడి కేసులో కుట్రదారు అఫ్జల్‌గురును అత్యంత రహస్యంగా ఉరి తీసిన విషయం తెలిసిందే. వీరికి రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించిన తర్వాత ఎవరికీ తెలియకుండా శిక్ష అమలుచేశారు.