
ముంబై : మహారాష్ట్రలోని స్థానిక కోర్టు పరువు హత్య కేసులో సంచలన తీర్పునిచ్చింది. ముగ్గురు దళిత యువకులను క్రూరంగా హతమార్చినందుకు మరణశిక్ష విధిస్తూ జడ్జి ఆర్‌ఆర్ వైష్ణవ్ తీర్పుని వెలువరించారు. ఆహ్మద్‌నగర్ జిల్లాలోని సోనాయ్ గ్రామానికి చెందిన సచిన్ అనే యువకుడు ఇతర సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. దీనిపై అగ్రహించిన అమ్మాయి బంధువులు సచిన్‌తోపాటు సందీప్, రాహుల్‌ని 2013 జనవరి 1న అతి క్రూరంగా హతమార్చి, వారి శరీర అవయవాలను ముక్కలు ముక్కలుగా చేసి సెప్టిక్ ట్యాంకులో వేశారు. ఈ ఘటనలో రఘునాథ్, రమేశ్, ప్రకాశ్, గణేష్, అశోక్, సందీప్ కుర్హే లను దోషులుగా నిర్ధారించి ఊరి శిక్షతో పాటూ రూ. 20 వేల జరిమాను విధించింది.