Tamil fishermen
-
శ్రీలంక దాష్టీకం
♦ తుపాకీ కాల్పులకు తమిళజాలరి బలి ♦ మత్స్యకార గ్రామాల్లో ఆందోళన ♦ గత 35 ఏళ్లలో 200లకు పైగా కాల్పులకు బలి తమిళజాలర్లపై తరచూ దాడులకు పాల్పడే శ్రీలంక దాష్టీకం పరాకాష్టకు చేరుకుంది. తుపాకీతో కాల్పులు జరిపి ప్రిట్సో అనే జాలరి నిండు ప్రాణాన్ని హరించి వేసింది. జాలరి హత్యతో మత్స్యకార గ్రామాలు శోకసంద్రమయ్యాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: పాకిస్థాన్ జలసంధి సముద్ర పరిధిలో చేపలవేటకు వెళ్లే తమిళ జాలర్లపై దాడులకు దిగడం శ్రీలంక సముద్రతీర గస్తీదళాలకు పరిపాటిగా మారింది. తమిళ జాలర్లను నడిసముద్రంలోనే వేధించడం, వారివద్దనున్న వలలను చింపివేయడం, అప్పటి వరకు వేటాటిన చేపలను సముద్రంలో వదిలివేయడం వంటి చేష్టలు శ్రీలంక దళాలకు నిత్యకృత్యాలు. అంతేగాక అడపదడపా జాలర్లను అరెస్ట్ చేసి శ్రీలంక జైళ్లలో నెట్టి పడవలను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు అందజేసిన వివరాల ప్రకారం 1983 నుండి 2010 వరకు 212 మందిపై కాల్పులు జరిపి చంపివేసింది. 1991–2011 మధ్యకాలంలో 85 మంది కాల్పులకు హతమైనారు. 1983 నుంచి 2011 వరకు 167 సార్లు కాల్పులు జరపగా 180 మంది జాలర్లు తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు నెలల కాలంలో రామేశ్వరం, పుదుక్కోట్టై ప్రాంతాలకు చెందిన 85 మది జాలర్లను శ్రీలంక దళాలు అరెస్ట్ చేశాయి. ఇదిలా ఉండగా, రామేశ్వరానికి చెందిన సుమారు 416 పడవల్లో 2500 మంది జాలర్లు మంగళవారం చేపలవేటకని సముద్రంలోకి వెళ్లారు. వీరిలో కొందరు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ధనుష్కోటి–కచ్చదీవుల మధ్యలో చేపలవేట సాగిస్తుండగా కన్ పోట్ నౌక, వాటర్ స్కూటర్లలో శ్రీలంక దళాలు చుట్టుముట్టాయి. తమిళజాలర్లు తేరుకునేలోగా వారిపై విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపాయి. భయభ్రాంతులకు గురైన జాలర్లు మరపడవల్లోని అడుగుభాగానికి చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే టిట్టో అనే వ్యక్తికి చెందిన పడవలోని ప్రిట్సో (21) గొంతులోకి, పడవను నడుపుతున్న సరోన్ (22) చేతి మణికట్టులోకి బుల్లెట్లు చొచ్చుకుపోయాయి. కాల్పుల తరువాత శ్రీలంక దళాలు వెళ్లిపోయాయి. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రిట్సోను ఆసుపత్రిలో చేర్చేందుకు ఒడ్డుకు తీసుకువస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాల్పుల సమాచారం అందడంతో పోలీస్, విజిలెన్స్ , రెవెన్యూ అధికారులతోపాటూ రామేశ్వరం, తంగసిమిడం ప్రాంతాల నుంచి వందలాది మంది మత్స్యకారులు ఆందోళనగా అర్దరాత్రే సముద్రతీరానికి చేరుకున్నారు. అర్దరాత్రి 12.15 గంటలకు ప్రిట్సో మృతదేహాన్ని తీసుకుని జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు. అలాగే గాయపడిన సరోన్ ను రామేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం నుండి ఏకే 47 తుపాకీ బుల్లెట్‌ను బైటకు తీసారు. చెన్నైలోని శ్రీలంక రాయబార కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఆందోళ : ప్రిట్సో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి బు«ధవారం ఉదయం 8.30 గంటలకు తల్లిదండ్రులకు అప్పగించేందుకు అధికారులు ప్రయతించగా మృతుని తల్లిదండ్రులు హెర్ట్బట్ మేరీ, కొంబల్స్ తదితరులు నిరాకరించారు. జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేవరకు మృతదేహాన్ని తీసుకునేది లేదని మత్స్యకారులు పట్టుపట్టారు. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా అధికారులు వేలాది మంది పోలీసులను మొహరింపజేశారు. రామేశ్వరం జిల్లా కలెక్టర్ నటరాజన్, ఎస్పీ మణివణ్ణన్ ఇతర అధికారులు జాలర్ల సంఘ నేతలతో మూడుసార్లు జరిపిన చర్చలు విఫలమైనాయి. బాధిత కుటుంబానికి సీఎం ఎడపాడి రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. జాలర్ల ఇబ్బందులపై ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నదని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ తీవ్రంగా ఖండిచారు. అన్నాడీఎంకేకు చెందిన లోక్‌సభ ఉపసభపతి తంబిదురై, ఎంపీ వేణుగోపాల్ ఈ సంఘటనపై ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేశారు. కాల్పులు జరపలేదు: శ్రీలంక ఇదిలా ఉండగా, తమిళ జాలర్లపై జరిగిన కాల్పులకు తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని శ్రీలంక సుముద్రతీర గస్తీదళాల ప్రధాన కార్యాలయ పౌర సంబంధాల అధికారి, కెప్టెన్ సమింద వలకుకే బుధవారం ప్రకటించారు. శ్రీలంక కాల్పుల్లో జాలరి మృతి చెందినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తమిళ జాలర్లపై కాల్పులు జరపాల్సిందిగా తాము ఎటువంటి ఆదేశాలు జారీచేయలేదని, హద్దులు దాటితే అరెస్ట్ చేయాలని మాత్రమే ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. జాలరిపై జరిగిన కాల్పులను కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఖండించారు. -
జాలర్లపై దాడి
ఇన్నాళ్లు బంగాళాఖాతంలో శ్రీలంక సేనలు తమిళ జాలర్ల మీద విరుచుకు పడుతుంటే, తాజాగా అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన కన్యాకుమారి జాలర్లను ఇంగ్లాండ్ సేనలు బందీగా పట్టుకు వెళ్లాయి. సాక్షి, చెన్నై: తమిళ జాలర్ల మీద శ్రీలంక సేనలు సృష్టిస్తున్న వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం దాడులు, బందీలుగా పట్టుకెళ్లడం సర్వసాధారణం. ఇప్పటి వరకు వందకు పైగా పడవలు, పదుల సంఖ్యలో జాలర్లు ఆ దేశ చెరలో ఉన్నారు. వీరిని విడిపించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం, జాలర్ల సంఘాలు తీవ్రంగానే ఒత్తిడి తెస్తున్నా ఫలితం శూన్యం. ఇన్నాళ్లు శ్రీలంక సేనల నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందనుకుంటే, తాజాగా ఇంగ్లాండ్(బ్రిటీష్)దేశ సేనలు సైతం ప్రతాపం చూపించడం జాలర్లలో ఆందో ళనకు దారి తీస్తోంది. బంగాళా ఖాతంలో భద్రత కరువుతో కన్యాకుమారి జాలర్లు అరేబియా సముద్రం వైపుగా వేట సాగిస్తూ వస్తున్నారు. కేరళ సరిహద్దుల్లోని తమిళ గ్రామాల్లోని జాలర్లు కొచ్చి మీదుగా తమ చేపల వేట సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోకన్యాకుమారి జిల్లా నిత్ర విలై సమీపంలోని ఇరువి బుద్ధన్ గ్రామానికి చెందిద్ధాల్బర్ట్ పడవలో డేని, ప్రడీ, సోని, జోషప్, ఆంటోని, షాజీలు, కొచ్చికి చెందిన మరొకరి బోటులో కుమరికి చెందిన మరి కొందరు ఆదివారం వేటకు వెళ్లారు. అరేబియా సముద్రంలో ఓ దీవులకు సమీపంలో వేటలో ఉన్న వీరిని బ్రిటీషు నావికాదళం చుట్టుముట్టింది. నాలుగైదు పడవల్ని, 32 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. ఈ సమాచారం కొచ్చిలోని మత్స్య శాఖ వర్గాల ద్వారా కన్యాకుమారికి సమాచారం చేరింది. కన్యాకుమారికి చెందిన జాలర్లు పదిహేను మందికి పైగా ఇంగ్లాండ్ సేనల వద్ద బందీలుగా ఉన్న సమాచారంతో ఆందోళన బయల్దేరింది. తమ వాళ్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీలంకతో పాటుగా ఇతర దేశాల చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. పదవిని కాపాడుకునే ప్రయత్నంలో జాలర్లను విస్మరించ వద్దు అని సీఎంకు హితవు పలికారు. -
శ్రీలంకలో 12 మంది తమిళ జాలర్ల అరెస్ట్
రామేశ్వరం: తమ సముద్రజలాల్లోకి అక్రమంగా చొరబడ్డారనే కారణంతో 12 మంది తమిళ జాలర్లను శ్రీలంక బుధవారం అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారంతా ఉత్తర తలైమన్నార్ ప్రాంతానికి చెందిన వారని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 20 మందితో కూడిన జాలర్ల బృందం బుధవారం తమిళనాడు పంబాన్ ప్రాంతం నుంచి రెండు పడవలతో చేపల వేటకు బయలుదేరింది. వేట కొనసాగిస్తుండగా వీరి పడవలను శ్రీలంక నేవీ అధికారులు చుట్టముట్టి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 8 మంది తప్పించుకున్నారు. -
సీఎం పగ్గాలు చేపట్టినా...అదే ఇంట్లో
సీఎం పగ్గాలు చేపట్టినా, గ్రీన్ వేస్‌రోడ్డులోని ప్రభుత్వ గృహంలోనే ఓ పన్నీరు సెల్వం బస చేశారు. ఇది వరకు తమిళనాడును ఏలిన సీఎంలు అందరూ తమ తమ స్వగృహాల నుంచి సచివాలయం బాట పట్టారు. అరుుతే, ఇక, ప్రప్రథమంగా ఈ సీఎం ప్రభుత్వ గృహం నుంచి బయలు దేరనున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి జయలలిత పేరును తొలగించి పన్నీరు పేరును సీఎంగా ప్రకటించారు. అరుుతే, ఇది వరకటి వలే ఆయనకు సాధారణ భద్రతే కొనసాగుతున్నది. సాక్షి,చెన్నై: దివంగత సీఎం అమ్మ జయలలిత నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు అదృష్టం కలిసి రావడంతో మళ్లీ..మళ్లీ సీఎం అయ్యే చాన్స దక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన మంత్రిగా ఉన్నా , సీఎం పగ్గాలు చేపట్టినా గ్రీన్ వేస్ రోడ్డులోని గృహంలోనే నివాసం ఉండదలచుకున్నారేమో. 2001లో , 2014-15లో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు కూడా ఆయన ఆ గృహాన్ని వదలి పెట్ట లేదు. ప్రస్తుతం అమ్మ జయలలిత అందర్నీ వీడి అల్లంత దూరాలకు వెళ్లడంతో మళ్లీ సీఎం అయ్యే చాన్స పన్నీరుకు దక్కింది. అరుునా, అదే బంగళాలోనే పన్నీరు బస చేస్తుండడం గమనార్హం. సీఎం పగ్గాలు చేపట్టి గురువారంతో మూడు రోజులు అవుతున్నా, ఆయన ఇంటి ముందు బోర్డు మాత్రం ఆర్థిక మంత్రిగానే ఉండడం మీడియా దృష్టికి చేరింది. దీన్ని పసిగట్టిన అక్కడి సిబ్బంది ఆగమేఘాలపై తొలగించి సీఎం బోర్డు తగిలించేందుకు సిద్ధమయ్యారు. అలాగే, గ్రీన్ వేస్రోడ్డులో ఇది వరకు కల్పించ బడ్డ సాధారణ భద్రతే కొనసాగుతున్నది. ఇక, మరింతగా భద్రత కట్టుదిట్టం చేసిన పక్షంలో అటు వైపుగా వెళ్లే వారికి, ఆ పరిసర వాసులకు తనిఖీల బాధ తప్పదేమో. కాగా, ప్రభుత్వ గృహం నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీ అయ్యే సీఎంలలో ప్రథముడిగా పన్నీరు రాష్ట్రంలో చోటు దక్కించుకోనున్నారు. అదృష్టం కొనసాగి, పూర్తి స్థారుులో సీఎంగా పనిచేసిన పక్షంలో కొత్త రికార్డును సృష్టిస్తారేమో. ఇందుకు కారణం, ఇది వరకు సీఎంలుగా రాష్ట్రాన్ని పాలించిన వాళ్లందరూ తమ తమ సొంత ఇళ్ల నుంచి సచివాలయంకు ప్రతి రోజూ బయలు దేరి వెళ్లడమే. అమ్మ జయలలిత పోయెస్ గార్డెన్‌లోని స్వగృహం, కరుణానిధి గోపాలపురంలోని స్వగృహం నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీ అయ్యే వారు. అంతకు ముందు సీఎంలుగా ఉన్న వాళ్లూ చెన్నైలోని తమ సొంత ఇళ్ల నుంచి బయ లు దేరి వెళ్లినట్టు సంకేతాలు ఉన్నారుు. అరుుతే, ప్రభుత్వ గృహాన్ని ఎక్కువ కాలం ఉపయోగించుకున్న సీఎంలలో ప్రథముడు పన్నీరే. గతంలో అన్నా మరణించినప్పుడు తాత్కాలిక సీఎంగా ఉన్న నెడుంజెలియన్ కొద్ది రోజులు మాత్రమే ప్రభుత్వ గృహాన్ని వినియోగించుకుని ఉన్నారు. అమ్మ పేరు తొలగింపు : రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి సీఎం జయలలిత పేరును తొలగించి పన్నీరు సెల్వం పేరును పొందు పరిచారు. ఇది వరకు అమ్మ చేతిలో ఉన్న అన్ని శాఖలు , తన చేతిలో ఉన్న ఆర్థిక శాఖ కూడా పన్నీరు వద్దకు వచ్చారుు. పన్నీరు తదుపరి స్థానంలో అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్, మూడో స్థానంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి, తదుపరి సెల్లూరు రాజు, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, కేపి అన్భళగన్, వి సరోజ, ఎంసీ సంపత్, కేసీ కరుప్పనన్నన్, ఆర్కామరాజ్, ఓఎస్ మణియన్, ఉడుమలై కే రాధాకృష్ణన్, సి.విజయ భాస్కర్, ఆర్ దురైకన్ను, కడంబూరు రాజు, ఆర్బీఉదయకుమార్, ఎల్లమండి నటరాజన్, కేసీ వీరమణి, కే.పాండియరాజన్, కేటీ రాజేంద్ర బాలాజీ, బెంజిమిన్, నిలోఫర్ కబిల్, ఎంఆర్ విజయభాస్కర్, ఎం.మణిగండన్, వీఎం రాజలక్ష్మి, జి.భాస్కరన్, సెవ్వూరు ఎస్ రామచంద్రన్, ఎస్ వలర్మతి, బాలకృష్ణారెడ్డి పేర్లు మంత్రుల జాబితాలో వరసుగా చేర్చి ఉన్నారు. తొలి లేఖ : కేంద్రానికి దివంగత సీఎం జయలలిత లేఖాస్త్రాలను తరచూ సంధించడం గురించి తెలిసిందే. ఆదిశలో సీఎం పగ్గాలు చేపట్టిన పన్నీరు నడిచే అవకాశాలు ఉన్నారుు. ఇందుకు నిదర్శనంగా తొలి లేఖాస్త్రం సీఎం హోదాలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి పన్నీరు సెల్వం లేఖ రాశారు. కచ్చదీవుల్లోని అంతోనియర్ ఆలయాన్ని ఇటీవల అభివృద్ధి పరిచే పనిలో శ్రీలంక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఈ భూ భాగం తమిళనాడులో కలిసి ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ ఆలయంపై తమిళ జాలర్లకు హక్కు ఉంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలకు తమిళ జాలర్లు తరలి వెళ్తారు. ఇందులో భాగంగా కొత్తగా రూపుదిద్దుకున్న ఆలయం ప్రారంభోత్సవం మరి కొద్ది రోజుల్లో జరగనుంది. ఈ వేడుకకు తమిళ జాలర్లను పంపించేందుకు తగ్గ అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం పన్నీరు సెల్వం లేఖ రాయడం విశేషం. -
కచ్చదీవులే లక్ష్యం
► వేటకు పట్టు ► ఢిల్లీకి ప్రతినిధుల పయనం ► నేడు శ్రీలంకతో భేటీ ► అధికారులతో మంత్రి సమీక్ష కచ్చదీవుల్లో చేపల వేటకు అనుమతి లక్ష్యంగా కేంద్రంతో పాటు, శ్రీలంకపై ఒత్తిడికి తమిళ జాలర్లు సిద్ధమయ్యారు. నాలుగో విడత చర్చల నిమిత్తం ఢిల్లీకి మంగళవారం పయనమయ్యారు. భారత దేశ రాజధాని నగరం వేదికగా బుధవారం శ్రీలంక, తమిళ జాలర్లు ఒక చోట సమావేశం కానున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లను కేంద్ర అధికార వర్గాలు పూర్తి చేశాయి. సాక్షి, చెన్నై : తమిళ జాలర్ల మీద కడలిలో శ్రీలంక సేనల వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దేశాల జాలర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు తగ్గ ప్రయత్నాలు ఏళ్ల తరబడి సాగుతున్నా చర్చలు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చర్చలను కొలిక్కి తెచ్చేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా భారత్‌లో పర్యటించి తమిళ జాలర్లతో చర్చలకు శ్రీలంక జాలర్ల ప్రతి నిధుల బృందం, అక్కడి మత్స్యశాఖ అధికారులతో కూడిన కమిటీ ముందుకు వచ్చింది. శ్రీలంక మత్స్యశాఖ ఉన్నతాధికారులతో కూడిన ప్రతి నిధులు బుధవారం ఢిల్లీలో అడుగు పెట్టనున్నారు. అక్కడే తమిళ జాలర్లతో సంప్రదింపులకు వేదికను సిద్ధం చేశారు. ఇక, తమిళ జాలర్ల ప్రతినిధుల్ని ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. వీరితో పాటు మత్స్యశాఖ కార్యదర్శి గగన్ దీప్‌సింగ్ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కచ్చదీవులే లక్ష్యం : తమిళనాడు జాలర్ల ప్రతినిధులుగా పన్నెండు మంది ఢిల్లీ వెళ్లారు. వీరిలో రామనాథపురానికి చెందిన దేవదాసు, జేసురాజ్, అరులానందం, రాయప్పన్, నాగపట్నంకు చెందిన వీరముత్తు, జగన్నాథన్, చిత్ర వేల్, శివజ్ఞానం, పుదుకోటైకు చెందిన కుడియప్పన్, రామకృష్ణన్, తంజావూరుకు చెందిన రాజమాణ్యం ఉన్నారు. ముందుగా ఈ ప్రతినిధుల బృందం మత్స్య శాఖ కార్యదర్శి గగన్ దీప్ సింగ్‌తో భేటీ అయ్యారు. బుధవారం శ్రీలంకతో చర్చించాల్సిన అంశాలపై సమీక్షించారు. శ్రీలంక జాలర్లు గతంలో తమకు సూచించిన కొన్ని రకాల వలల ఉపయోగంపై పరిశీలన జరిపారు. ప్రధానంగా కచ్చదీవుల స్వాధీనం విషయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, అలాగే, ఆ దీవుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపల వేటకు అనుమతి లభించే విధంగా, భద్రతకు పూర్తి భరోసా దక్కే రీతిలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తదుపరి మత్స్య శాఖ మంత్రి డి.జయకుమార్తో గగన్ దీప్ సింగ్‌తో పాటుగా మత్స్యశాఖ కమిషనర్ పీలా రాజేష్, తదితర అధికార వర్గాలు సమాలోచించారు. కచ్చదీవుల స్వాధీనం గురించి తమిళ అసెంబ్లీలో ఇది వరకు చేసిన తీర్మానాలను ఢిల్లీ వేదికగా సాగనున్న చర్చల ముందు ఉంచేందుకు తగ్గ కార్యాచరణతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇక, ఐదో తేదీన రెండు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు, మత్స్యశాఖ అధికారులు భేటీ కానున్నారు. ఈ భేటీ మేరకు తదుపరి నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నారుు. కాగా, ఓ వైపు చర్చలకు సర్వం సిద్ధం చేసి ఉంటే, మరో వైపు రామేశ్వరానికి చెందిన నలుగురు జాలర్లను శ్రీలంక సేనలు బందీగా పట్టుకెళ్లడం గమనార్హం. వేకువ జామున కచ్చదీవుల సమీపంలో వేటలో ఉన్న తమిళ జాలర్లను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసిన సమాచారంతో, ఇక, తమ భద్రతకు భరోసా ఎక్కడ అన్న ఆవేదనను జాలర్లు వ్యక్తం చేస్తున్నారు. -
సిరి‘సేన’ దాష్టీకం
తమిళ జాలర్లను వేటాడిన శ్రీలంక గస్తీ దళాలు 37 మంది అరెస్ట్, ఆరు పడవలు స్వాధీనం సరిహద్దులు దాటితే సహించేది లేదని శ్రీలంక అధ్యక్షులు సిరిసేన ప్రకటించిన మరుసటి రోజే ఆ దేశ గస్తీదళాలు తమ దాష్టీకాన్ని ప్రదర్శించాయి. నాగపట్నం జిల్లాకు చెందిన 37 మంది జాలర్లను అరెస్ట్ చేసి తమ దేశానికి పట్టుకెళ్లాయి. అలాగే ఆరు మరపడవలను స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకలోని ఈలం తమిళులతో ప్రారంభమైన వైరం ఆ దేశ మాజీ అధ్యక్షులు రాజపక్స హయాంలో తారాస్థాయికి చేరింది. ఈలంపై యుద్ధం పేరుతో సాగిన దమనకాండ వందలాది మంది తమిళులను పొట్టనపెట్టుకుంది. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఎందరో అభాగినులు మాన, ప్రాణాలను కోల్పోయారు. సముద్రంలో చేపలవేట సాగించే తమిళ మత్స్యకారులపై వేధింపులు, సాధింపులు కూడా పెచ్చుమీరిపోయాయి. ఇటీవల శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సే ఓటమి, సిరిసేన గెలుపుతో తమిళులకు మంచిరోజులు వచ్చాయని భావించారు. ఈలంతోపాటూ తమిళ మత్స్యకారుల సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని ఆశించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల శ్రీలంక పర్యటన సమయంలో సైతం తమిళ మత్స్యకార కుటుంబాలకు అదే భరోసా కల్పించారు. అయితే ఇదంతా వట్టి భ్రమ అనిపించేలా శ్రీలంక అధ్యక్షులు సిరిసేన తన అభిప్రాయాన్ని ప్రకటించారు. శ్రీలంక సరిహద్దుల్లో చేపలవేట సాగిస్తే అరెస్ట్ చేసి తీరుతాము, అంతేకాదు వారి మరపడవలను స్వాధీనం చేసుకుని తిరిగి అప్పగించబోమని రెండురోజుల క్రితం హెచ్చరించారు. విరుచుకుపడిన శ్రీలంక సేన: నాగపట్నం జిల్లా అక్కరైపేటకు చెందిన వెయ్యిమంది మత్స్యకారులు 400 మర పడవల్లో ఈనెల 1వ తేదీన సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. వారంతా ఈనెల 5 లేదా 6వ తేదీన తిరిగి నాగైకి చేరాల్సి ఉంది. శుక్రవారం రాత్రి కారైనగర్, నెడుందీవుల వద్ద చేపల వేట సాగిస్తుండగా శ్రీలంక గస్తీదళాలు వారి పడవలను చుట్టుముట్టాయి. గస్తీదళాలను చూడగానే మత్స్యకారులు భయంతో వారి పడవలను నాగైవైపునకు పరుగులు పెట్టించారు. అయినా వదలని దళాలు వారిని వెంబడించాయి. 37 మంది జాలర్లను అరెస్ట్ చేసి వెంట తీసుకెళ్లాయి. అలాగే 6 మరపడవలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రాణభీతితో స్వగ్రామానికి బయలుదేరిన మత్స్యకారులు తమ వద్దనున్న సెల్‌ఫోన్ ద్వారా శ్రీలంక దౌర్జన్యాన్ని తమవారికి చేరవేయడంతో మత్స్యకారుల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సిరిసేన తన అభిప్రాయాన్ని ప్రకటించిన మరుసటి రోజే ఆదేశ దళాలు విరుచుకుపడడం పట్ల రాజకీయ పార్టీలు ఖండిచాయి. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని డీఎంకే అధినేత కరుణానిధి, తమిళమానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్, పీఎంకే అధినేత రాందాస్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. -
లంకకు జాలరన్న!
సాక్షి, చెన్నై : తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం ప్రదర్శించిన పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేయడం, బందీలుగా పట్టుకెళ్లడం భారత్ ఒత్తిడితో విడుదల చేయడం పరిపాటిగా మారింది. అయితే, జాలర్లను విడుదల చేసిన లంక సేనలు పడవల్ని మాత్రం తమ గుప్పెట్లోనే పెట్టుకున్నాయి. శ్రీలంక ఆధీనంలో తమిళులకు చెందిన 92 పడవలు ఉన్నాయి. తమ పడవల్ని తిరిగి ఇవ్వాలని వేడుకుంటూ వస్తున్నా ఫలితం శూన్యం. ఈ నేపథ్యం లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటనతో సిరిసేన నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మెట్టు దిగింది. తమిళ జాలర్ల వ్యవహారంపై చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కసరత్తుల్ని వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని తమ గుప్పెట్లో ఉన్న 81 పడవల్ని మాత్రం విడుదల చేయడానికి శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ప్రకటించారు. ఆ మేరకు ఆ పడవల్ని విడుదల చేసే రీతిలో అక్కడి కోర్టులు ఆదేశాలు జారీ చేసింది. తమ పడవల్ని విడుదల చేయడానికి శ్రీలంక సర్కారు అంగీకరించడంతో ఆ దేశానికి పయనమయ్యే పనిలో రాష్ట్ర జాలర్లు నిమగ్నం అయ్యారు. 81 పడవల్ని విడుదల చేసినా మిగిలిన 11 పడవల్ని కూడా ఇక్కడకు తెప్పించుకునే రీతిలో అధికారులు కసరత్తుల్లో పడ్డారు. ఆయా పడవల యజమానులతోసంప్రదింపుల అనంతరం 150 మందిని లంక పయనానికి ఎంపిక చేశారు. కొన్ని నెలలుగా పడవలు ఆ దేశ ఒడ్డుకు పరిమితమై ఉన్న దృష్ట్యా, అవి ఏ మేరకు మరమ్మతులకు గురై ఉన్నాయోనన్న ఆందోళన బయలు దేరింది. రాష్ట్ర మత్స్య శాఖ అధికారుల నేతృత్వంలో మొత్తంగా 150 మంది అర్ధరాత్రి లేదా, సోమవారం వేకువ జామున లంకకు పయనం కానున్నారు. నాగపట్నం, పుదుకోట్టై,రామనాథపురం, కారైక్కాల్ జాలర్లు ఈ బృందంలో ఉన్నారు. వీరందర్నీ పది బోట్లలో గట్టి భద్రత నడుమ శ్రీలంక సరిహద్దుల్లోకి తీసుకెళ్లేందుకు భారత కోస్ట్ గార్డ్ చర్యలు చేపట్టింది. సముద్రంలో వీరికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, హెలికాప్టర్, తమ పడవలతో గస్తీకి చర్యలు తీసుకున్నారు. సముద్ర సరిహద్దుల్లో వీరందర్నీ భద్రంగా శ్రీలంక నావికాదళం, ఉన్నతాధికారులకు అప్పగించనున్నారు. తమ పడవల్ని స్వాధీనం చేసుకుని రెండు మూడు రోజుల్లో వీరంతా తిరుగు పయనం అయ్యే అవకాశం ఉంది. -
జాలర్లకు చిత్రహింసలు
శ్రీలంక దళాల తీరుతో వేదనకు గురవుతున్న తమిళ జాలర్ల బతుకులు అరబ్ దేశీయుల చేతుల్లో చిక్కి చిన్నాభిన్నమవుతున్నాయి. బతుకుదెరువు కల్పిస్తామని 25 మంది జాలర్లను ఆ దేశానికి తీసుకెళ్లి, చిత్ర హింసలకు గురిచేసిన వైనం శనివారం వెలుగులోకి వచ్చింది. జాలర్లు పడుతున్న నరకయాతనను వీడియో తీసి పంపించడం గమనార్హం. చెన్నై, సాక్షి ప్రతినిధి:ఐక్య అరబ్దేశంలోని అజ్మన్ హార్బర్లో చేపలుపట్టే పనికి కన్యాకుమారి జిల్లా బుద్దన్ హార్బర్‌కు చెందిన ఆలి, అంతోని తదితర 25 మంది జాలర్లు వెళ్లారు. ఈ 25 మందితోపాటూ అజ్మన్ హార్బర్‌కు చెందిన ఇద్దరు జాలర్లు పడవలో ఆ దేశ సముద్రంలోకి చేపలవేటకు వెళ్లారు. వారిలో ఒకరు అకస్మాత్తుగా సముద్రంలోకి జారిపడిపోగా తమిళ జాలర్లు రక్షించేలోగా గల్లంతయ్యూడు. దీంతో పడవ యజమానులు అలి మదార్, జమాల్ అలీమదార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిచ్చిన ఫిర్యాదుతో తమిళనాడుకు చెందిన జాలర్లను అందరినీ పోలీస్ స్టేషన్‌కు పిలి పించి విచారించారు. వారందరి పాస్‌పోర్టులను పడవ యజమానులు స్వాధీనం చేసుకున్నారు. అరబ్దేశాల్లో పనిచేసేందుకు జారీచేసిన ఒప్పం ద పత్రాలను లాక్కుని 25 మంది తమిళ జాలర్లు స్వదేశాలకు వెళ్లేందుకు వీలులేకుండా చేశారు. పడవ యజమానులు అలి మదార్, జమాల్ అలీమదార్ 25 మంది జాలర్లను తమ పడవలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. జాలర్లు పడుతున్న నరకయూతన దృశ్యాలను తన సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి బాధితుల కుటుంబాలకు పంపారు. పొట్టకూటి కోసం పొరుగుదేశానికి వెళ్లిన తమ వారు పడుతున్న చిత్రహింసలను చూసి తమిళనాడులోని వారి బంధువులు తల్లడిల్లిపోయారు. తమను హింసించవద్దని కాళ్లావేళ్లాపడుతున్నా వినిపించుకోకుండా దాడులకు పాల్పడుతున్న వైనాన్ని కళ్లారాచూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అరబ్ దేశంలో చిక్కుకున్న తమ వారిని వెంటనే రక్షించి తమిళనాడుకు చేర్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమ్మె విరమించిన కడలూరు జాలర్లు పలు సమస్యల పరిష్కారం కోసం కడలూరు జాలర్లు 9 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను శనివారం విరమించారు. కడలూరు, విళుపురం, పుదుచ్చేరీ, తదితర సముద్ర తీర ప్రాంతాల్లో ప్రధాన ద్వారాలను గుర్తించాలని, 200 మీటర్ల దూరం వరకు ప్రహరీ గోడ నిర్మించాలని, రాత్రి వేళల్లో హార్బర్ ప్రధాన ద్వారాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లపై సమ్మె ప్రారంభించారు. కడలూరు జిల్లా సహాయ కలెక్టర్ షర్మిల, ఇతర అధికారులు ఇటీవల జరిపిన చర్చలు విఫలమయ్యూరుు. ఈనెల 6వ తేదీలోగా తమ కోర్కెలను నెరవేర్చకుంటే జిల్లా వ్యాప్తంగా వాహనాల రాకపోకలను స్తంభింపజేస్తామని, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జాలర్ల సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి సంపత్ ఆధ్వర్యంలో చర్చలు సాగాయి. ఈ నెలాఖరులోగా జాలర్ల ఆరు డిమాండ్లను నెరవేరుస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు. -
మళ్లీ సమ్మె బాట
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం సాగిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేసి పట్టుకెళ్లడం, ఆందోళనలు బయలుదేరడంతో పాలకులు స్పందించడం, విడుదల కావడం పరిపాటిగా మారింది. అయితే, తమ సమస్యకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తుందోనన్న ఎదురు చూపుల్లో జాలర్లు ఉన్నారు. పాలకులు కేవలం హామీలు ఇవ్వడం, ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారడంతో ఇక వారి నడ్డి విరిచి తమ సమస్యల్ని పరిష్కరించుకోవడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. తమ మీద దాడులకు శాశ్వత పరిష్కారం, శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవల స్వాధీనం లక్ష్యంగా నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ఇది వరకు తాము ఎన్నో సమ్మెలు చేపట్టినా, తాజాగా చేపట్టిన సమ్మె మాత్రం తమలో రగులుతున్న ఆక్రోశానికి ప్రతీరూపంగా జాలర్ల సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెతో తమ బలాన్ని కేంద్ర, రాష్ట్రంలోని పాలకులకు చూపించే రీతిలో జాలర్లు నిరసనలకు సిద్ధమయ్యారు. నిరవధిక సమ్మె : తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, కారైక్కాల్ జాలర్లు గురువారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. తమ సమ్మెకు మద్దతు ప్రకటించే రీతిలో ఇతర జిల్లాల్లోని జాలర్లు సైతం ఏకం కావాలని ఆ నాలుగు జిల్లాల జాలర్ల సంఘాలు పిలుపునిచ్చారుు. ఉదయం నుంచి జాలర్లు చేపల వేటను బహిష్కరించడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితం అయ్యారుు. నాగపట్నం జిల్లా వేధారణ్యం, పూంబుహార్ హార్బర్ల నుంచి ఏ ఒక్క పడవ సముద్రంలోకి వెళ్ల లేదు. ఈ జిల్లాలోని 25 వేల మంది జార్లు సమ్మె బాట పట్టారు. పుదుకోట్టై, జగదాపట్నం, కొట్టై పట్నంలలో ఐదు వేల పడవలు వేటకు వెళ్లలేదు. కారైక్కాల్, తిరువారూర్ జిల్లాలోను జాలర్లు సమ్మెకు దిగడంతో వేట ఆగింది. ఈ నాలుగు జిల్లాల్లో 50 వేల మంది జాలర్లు చేపల వేటకు దూరం కావడంతో ఆ ప్రభావం ఇతర రంగాల మీద పడింది. ఐస్ గడ్డల ఉత్పత్తిని ఈ జిల్లాల్లో నిలుపుదల చేయాల్సిన పరిస్థితి. అలాగే, డీజిల్ విక్రయాలు తగ్గాయి. చేపల్ని కొనుగోలు చేసే టోకు, చిరు వర్తకులకు ఆదాయం తగ్గింది. ఈ సమ్మెను మరింత ఉధృతం చేసే విధంగా ఈ జిల్లాల జాలర్ల సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకునే రీతిలో భారీ ఎత్తున నిరసనలకు వ్యూహ రచన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని జాలర్ల సంఘాలు ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి. తమకు సముద్రంలో భద్రత కల్పించాలని, వేటకు ఆటంకాలు ఎదురు కాకూడదని, శ్రీలంక జాలర్ల సంఘాలతో చర్చలకు చర్యలు తీసుకోవాలని, శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవల్ని, అక్కడి జైళ్లలో ఉన్న జాలర్లు అందర్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడక్కడ జాలర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 27 మంది విడుదల : శనివారం అర్ధరాత్రి కచ్చదీవుల సమీపంలో పుదుకోట్టై, రామేశ్వరానికి చెందిన 27 మంది జాలర్లను శ్రీలంక సేనలు బంధించారు. వీరందర్నీ తమ దేశానికి తీసుకెళ్లారు. అయితే, ఇన్నాళ్లు కోర్టుల్లో హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టే లంక సేనలు తాజాగా రూటు మార్చారుయి. పట్టుకెళ్లిన వారందర్నీ తీవ్రంగా మందలించి వదిలి పెట్టారు. అయితే, తమిళనాడు జాలర్ల సంఘాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుండడం, సమ్మె బాటలో నాలుగు జిల్లాల జాలర్లు పయనిస్తుండడాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని ఒత్తిడి తెచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే పట్టుకెళ్లిన వాళ్లను కేవలం మందలించి వదలి పెట్టినట్టు సమాచారం. -
లంక చెరలో 43మంది
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ జాలర్లపై శ్రీలంక గస్తీ దళాలు మరోసారి తమ దాష్టీకాన్ని ప్రదర్శించాయి. తమ సరిహద్దులో చేపల వేట సాగిస్తున్నారని ఆరోపిస్తూ 43 మందిని అరెస్ట్ చేసి తమ దేశానికి తీసుకెళ్లాయి. ఈ ఉదంతంతో రాష్ట్రంలోని జాలర్ల సంఘాలు ఆగ్రహంతో భగ్గుమన్నాయి. సీఎం పన్నీర్ సెల్వం ప్రధానికి లేఖాస్త్రం సంధించారు. కారైక్కాల్, నాగపట్టినంకు చెందిన 43 మంది జాలర్లు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం సముద్రంలో చేపలవేటకు వె ళ్లాయి. కచ్చదీవుల సమీపంలో శ్రీలంక గస్తీదళాలు వారిని చుట్టుముట్టి అరెస్ట్ చేశాయి. ఇప్పటికే అనేక మంది జాలర్లు శ్రీలంక చెరలో మగ్గుతుండగా మరికొంత మంది బందీలుగా మారారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మంగళవారం తిరుమల దర్శనానికి వచ్చి ఉన్న సమయంలోనే తమిళ జాలర్లను అరెస్ట్ చేయడాన్ని తమిళ జాలర్ల సంఘాలు కవ్వింపు చర్యగా భావించాయి. నాగై, పుదుకోట్టై, రామేశ్వరం, కారైక్కాల్, తిరువారూరు ఈ ఆరు జిల్లాలకు చెందిన తమిళ జాలర్ల సంఘాల ప్రతినిధులు బుధవారం నాగపట్టినంలో అత్యవసరంగా సమావేశ మయ్యూరు. కారైక్కాల్‌లోని జాలర్లు చేపల వేటను బహిష్కరించి ఆందోళనకు దిగారు. శ్రీలంక చెరలో ఉన్న జాలర్లను విడిపించాలని, తమ నుంచి అపహరించిన మర పడవలను తిరిగి స్వాధీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీలంక నిజరూపమిదే :సీఎం పన్నీర్ సెల్వం తమిళ జాలర్ల పట్ల శ్రీలంక నిజస్వరూపం తాజా అరెస్ట్‌లతో బైటపడిందని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానికి లేఖ రాశారు. నాగపట్నానికి చెందిన 14 మందిని, కారైక్కాల్‌కు చెందిన మరో 14 మందిని ఈనెల 9వ తేదీన శ్రీలంక గస్తీ దళాలు అరెస్ట్ చేశాయని అన్నారు. గతంలో అరెస్టయిన 38 జాలర్లు ఇప్పటికీ అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారని తెలిపారు. జాలర్ల విడుదలకు ఈనెల 6 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శికి లేఖ రాశారని సీఎం గుర్తుచేశారు. పాత ఖైదీల విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మంగళవారం మరో 28 మందిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేంద్ర మత్స్యశాఖ వెంటనే కలగజేసుకుని శాశ్వత పరిష్కారం కోసం కృషి చేసేలా ఆదేశించాలని, శ్రీలంక కబంధహస్తాల్లో చిక్కుకున్న 66 మంది జాలర్లను, 81 మరపడవలను విడిచిపెట్టేలా జోక్యం చేసుకోవాలని పన్నీర్ సెల్వం ఉత్తరం ద్వారా ప్రధానిని కోరారు. -
లంకలో భారత జాలర్ల విడుదల!
-
శ్రీలంక టు ఢిల్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక నుంచి తమిళనాడు చేరుకోవాల్సిన ఐదుగురు జాలర్ల ప్రయాణంలో ఆకస్మిక మార్పు చోటుచేసుకుంది. ఉరి విముక్తికి విశేష కృషి చేసిన ప్రధాని నరేంద్రమోదీకి నేరుగా కృతజ్ఞతలు తెలియజేసేందుకు గురువారం రాత్రి వారంతా ఢిల్లీకి చేరుకున్నారు. హెరాయిన్ అక్రమ రవాణా కేసులో శ్రీలంక కోర్టు తమిళ జాలర్లకు ఉరి శిక్ష విధించింది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో చర్చిం చారు. మోదీ దౌత్యం ఫలించగా ఐదుగురు జాలర్ల ఉరిశిక్ష రద్దయి శ్రీలంక జైలు నుంచి బుధవారం విడుదలయ్యూ రు. ఈనెల 19న శ్రీలంక జైలు నుంచి విముక్తి పొందిన జాలర్లను అదే రోజు సాయంత్రం 4 గంటలకు అక్కడి భారత రాయబార కార్యాలయానికి చేర్చారు. అక్కడి నుంచి తమిళనాడులోని తమ కుటుంబాల వారితో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. కొన్నేళ్ల తరువాత తమ వారి గొంతు వినపడడంతో ఇరువైపులవారు ఆనందభాష్పాల్లో మునిగితేలారు. గురువారం సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటామని వారు తమవారికి చెప్పుకున్నారు. ఐదుగురి జాలర్ల స్వస్థలమైన రామనాధపురం తంగచ్చి మండపానికి చెందిన వందలాది కుటుంబాలు, జాలర్ల సంఘాలు గురువారం ఉదయాన్నే తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి. జాలర్లకు ఘన స్వాగత ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నాయి. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఐదుగురు జాలర్లను గురువారం ఉదయం విమానం ద్వారా తమిళనాడులోని తిరుచ్చిరాపల్లికి చేర్చాలని శ్రీలంక భావించింది. అయితే ఉదయం విమానంలో సీట్లు ఖాళీ లేకపోవడంతో మధ్యాహ్నం 2.30 గంటల విమానంలో పంపేలా మార్పుచేశారు. జాలర్ల విడుదలకు కృషి చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలపాలని జాలర్ల సంఘాలు, కుటుంబాల వారు భావించడంతో వారి ప్రయాణం ఢిల్లీకి మారింది. దీంతో తిరుచ్చి విమానాశ్రయంలోని జాలర్ల కుటుంబాల వారు నిరాశతో వెనుదిరిగిపోయారు. ప్రధాని మోదీని కలుసుకున్న తరువాత శుక్రవారం సాయంత్రంలోగా ఐదుగురు జాలర్లు తమ ఇంటికి చేరుకుంటారని తెలుస్తోంది. మోదీపై ప్రశంసల జల్లు తమిళనాడు జాలర్లను ఉరిశిక్ష నుంచి కాపాడిన ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంశలు జల్లుకురిసింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ తదితరులు ఇది పూర్తిగా మోదీ ఘనతగా అభివర్ణించారు. తమవారికి ప్రధాని మోదీ పూర్ణాయుష్షుతోపాటూ కొత్త జీవితాన్ని ప్రసాదించారని ఆ జాలర్ల కుటుంబాల వారు పేర్కొన్నారు. -
లంకకు కళ్లెం వేయండి
సాక్షి, చెన్నై : తమిళ జాలర్లకు శ్రీలంక నుంచి భద్రత కల్పించే విధంగా భరోసా ఇవ్వాలని జాలర్ల సంఘాల ప్రతినిధులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తాత్కాలిక పరిష్కారాలతో ఒరిగేది శూన్యం అని శ్రీలంకతో తాడో పేడో తేల్చుకుని తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ రెండు దేశాల జాలర్ల మధ్య చర్చలకు ఏర్పాట్లు చేయాలని, శ్రీలంక ఆగడాలకు శాశ్వతంగా కళ్లెం వేయాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వద్ద సమస్యల్ని జాలర్ల సంఘాలు ఏకరువు పెట్టాయి. శ్రీలంక నావికాదళం రూపంలో తమిళ జాలర్లకు కడలిలో భద్రత కరువైంది. చేపల వేటకు వెళ్లే వాళ్లు తిరిగి వస్తారా..? అన్న ఎదురు చూపుల్లో కుటుంబాలు గడపాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఐదుగురు జాలర్ల ఉరి శిక్ష వివాదం సముద్ర తీర జిల్లాల్లో పెద్ద కలకలాన్నే రేపింది. వేటను బహిష్కరించి జాలరన్న ఆమరణ దీక్షకు సిద్ధం అయ్యాడు. ఎట్టకేలకు కేంద్రం విజ్ఞప్తితో దీక్ష విరమించినా, తమకు శాశ్వత పరిష్కారం ఏదీ..? అని అభ్యర్థించక తప్పలేదు. మంగళవారం ఇదే నినాదంతో ఢిల్లీలో జాలర్ల సంఘాల ప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఢిల్లీకి పయనం : జాలర్లను బుజ్జగించడం లక్ష్యంగా రాష్ట్రంలోని బీజేపీ వర్గాలు తీవ్రంగానే పావులు కదిపాయి. తాము ఉన్నామంటూ భరోసా ఇచ్చి కేంద్రం వద్దకు జాలర్ల గోడును తీసుకెళ్లే పనిలో పడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నేతలు శరవణ పెరుమాల్, నాగరాజన్, కుప్పురాం, ఆదవన్లు జాలర్ల సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారిని ఢిల్లీకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. బీజేపీ నేతల పిలుపుతో జాలర్ల సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి కదిలా రు. మంగళవారం చెన్నై నుంచి రాష్ట్రంలోని నాగపట్నం, రామనాథపురం, రామేశ్వరం, పుదుకోట్టై, కారైక్కాల్, జాలర్ల సంఘాల ప్రతినిధులు, రాష్ర్ట జాలర్ల సంఘాల నేతలు, జాతీయ స్థాయి జాలర్ల సంఘాల నేతలు ఇళంగోవన్, శేషు, దేవదాసు, వీరముత్తు, శేఖర్, మోహన్, చంద్రబాబు, కుట్టి పాండి, రామకృష్ణన్, భాస్కరన్ తదితర పదిహేను మంది ప్రతినిధుల్ని బిజేపి నేతలు ఢిల్లీకి తీసుకెళ్లారు. శాశ్వత పరిష్కారమే లక్ష్యం బీజేపీ నేతలతో కలసి ఢిల్లీ చేరుకున్న జాలర్ల సంఘాల ప్రతినిధులు తొలుత కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. తమ గోడును వివరిస్తూ విజ్ఞప్తి లేఖను అందించారు. ఇందులో తాత్కాలిక పరిష్కారం తమకు వద్దని దాడుల అడ్డుకట్టకు శాశ్వత పరిష్కారం చూపించాలని జాలర్ల సంఘాలు డిమాండ్ చేశాయి. శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాల ర్లందర్నీ విడుదల చేయించాలని కోరారు. ఉరి శిక్షను ఎదుర్కొంటున్న ఐదుగురి ఉరిశిక్ష రద్దును అధికార పూర్వకంగా ప్రకటించాలని, వారిని విడుదల చేసి, స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీలంక వద్ద ఉన్న 82 పడవల్ని స్వాధీనం చేసుకుని, బాధిత జాలర్లకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. పారంపర్యంగా తాము చేపల్ని వేటాడే ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు కలకుండా చర్యలు తీసుకోవాలని, కడలిలో తమకు పూర్తి భద్రత కల్పించే విధంగా భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంటి తడుపు చర్యలతో కాకుండా శ్రీలంక నడ్డి విరిచి, వారి ఆగడాలకు కళ్లెం వేస్తూ, శాశ్వత పరిష్కారాన్ని తమకు చూపిం చాలని విన్నవించారు. శ్రీలంక జాలర్ల ప్రతినిధులు, అక్కడి అధికారులతో సాగిన చర్చలు అసంతృప్తికరంగా ముగిశాయని, మరోమారు చర్చలకు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటన్నింటికి సానుకూలంగా స్పందించిన పొన్ రాధాకృష్ణన్ సాయంత్రం సుస్మా స్వరాజ్‌తో భేటీకి చర్యలు తీసుకున్నారు. సుష్మాతో భేటీ : సాయంత్రం సుష్మా స్వరాజ్‌తో జాలర్ల సంఘాల ప్రతి నిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో శ్రీలంక రాయబార అధికారుల, కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొన్నట్టు సమాచారం. ఈ భేటీలో తమకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా జాలర్ల సంఘాల ప్రతినిధులు పట్టుబట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయి తే, ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారోనన్నది వెలువడాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ భారత్ రాకతో ఆయన దృష్టికి జాలర్ల సమస్యల్ని తీసుకెళ్లి, పరిష్కరించే విధంగా సుష్మా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్రం హామీకి ఏ మేరకు జాలర్ల సంఘాల ప్రతినిధులు స్పందిస్తారోనన్నది వేచి చూడాల్సిందే. -
ఢిల్లీకి జాలర్లు
సాక్షి, చెన్నై: తమ సమస్యల్ని విన్నవించుకునేందుకు రామనాథపురం జిల్లా రామేశ్వరం జాలర్ల సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరనున్నారు. మంగళవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ కానున్నారు. తమ వాళ్లెవరూ ఇంత వరకు ఫోన్లో మాట్లాడలేదని, తమకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదంటూ ఉరిశిక్ష ను ఎదుర్కొంటున్న బాధితులు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమిళ జాలర్లు ఐదుగురికి కొలంబో న్యాయస్థానం ఉరి శిక్షను విధించడం, దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట ఆందోళనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలతో ఆ జాలర్లను రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం అప్పీలు కు వెళ్లింది. అదే సమయంలో ఉరి శిక్ష ఎదుర్కొంటున్న వాళ్లను విడుదల చేయిస్తామంటూ శ్రీలంక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇవన్నీ పత్రికల్లో వస్తున్న కథనాలేనని, తమను ఇంత వరకు ఎవరూ సంప్రదించి భరోసా ఇవ్వలేదని బాధితుల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లు శ్రీలంక నుంచి ఫోన్లో మాట్లాడినట్టుగా, అందుకు తగ్గ ఏర్పాట్లను రాయబార అధికారులు చేసినట్టుగా పత్రికల్లో చూసి విస్మయం చెందామని మండి పడుతున్నారు. తమ వాళ్లను విడుదల చేశారని, ఉరి రద్దు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయే గానీ, ఏ అధికారి గానీ, తమను కలిసి స్పష్టమైన హామీ ఇవ్వలేదని వాపోతున్నారు. తమ వాళ్లెవరూ ఇంత వరకు ఫోన్లలో మాట్లాడ లేదని, తమ వాళ్లు ఇక్కడికి వచ్చే వరకు ఏ వార్తను, ఏ కథనాన్ని తాము నమ్మబోమని స్పష్టం చేశారు. నలుగురు బాధితుల భార్యలు స్కెనిట, సెల్వి, లావణ్య, ఝాన్సీ, మరో బాధితుడి తల్లి ఇన్వెస్టాలతోపాటుగా మరో పది మంది మహిళలు రామేశ్వరంలో ఆదివారం నిరసన దీక్ష తెలిపారు. తమ వాళ్ల విడుదలకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలను కేంద్రం తమ దృష్టికి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో సమాచారం రాని పక్షంలో పార్లమెంట్ ఎదుట ఆందోళనకు తాము సిద్ధం అని ప్రకటించారు. ఢిల్లీకి పయనం : ఓవైపు బాధితుల కుటుంబీకులు ఆందోళన చేస్తుంటే, మరో వైపు ఢిల్లీకి పయనం అయ్యేందుకు జాలర్ల సంఘాల ప్రతినిధులు సిద్ధమయ్యారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం జాలర్లు దీక్ష విరమించిన విషయం తెలిసిందే. దీక్ష విరమణతో వీరిని బీజేపీ నేత నాగరాజన్ కలుసుకుని సంప్రదింపులు జరిపారు. రామేశ్వరం జాలర్ల ప్రతినిధులు ఐదుగురికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలియజేశారు. సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకొచ్చేందుకు సిద్ధం కావాలని నాగరాజన్ సూచించడంతో ఢిల్లీకి పయనం అయ్యేందుకు ప్రతినిధులు సిద్ధం అయ్యారు. ఐదుగురు జాలర్లతోపాటుగా శ్రీలంక చెరలో ఉన్న మరో 29 మంది జాలర్ల విడుదల , 81 పడవల స్వాధీనం లక్ష్యంగా సుష్మాస్వరాజ్‌తో జరిగే భేటీలో ఒత్తిడి తీసుకురాబోతున్నట్టు జాలర్ల సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్నామని, మంగళవారం సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్నామన్నారు. -
నేడు అప్పీలు
ఐదుగురు తమిళ జాలర్లకు కొలంబో కోర్టు ఉరిశిక్ష విధించిన కేసుపై సోమవారం అప్పీలు దాఖలు కానుంది. కోర్టు తీర్పుతో కుంగిపోయిన జాలర్ల కుటుంబాలు అప్పీలుపైనే ఆశలు పెట్టుకున్నాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి:పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశా ల నుంచి భారత్ అనేక సవాళ్లతో సతమతం అవుతుండగా, తమిళనాడు శ్రీలంక నుంచి గడ్డుపరిస్థితినే ఎదుర్కొం టోంది. శ్రీలంకలో ప్రత్యేక ఈలం కోరుతున్న తమిళుల డిమాండ్లకు తమిళనాడు ప్రజలు మద్దతుగా నిలవడంతో వైరం మొదలైంది. శ్రీలంక యుద్ధం సమయం లో అక్కడి సైనికులు వందలాది ఈలం తమిళుల మాన ప్రాణాలను హరిం చ డం, నిర్దయగా ఊచకోత కోయడం, వేలాది మందిని నిరాశ్రయులను చేయ డం వంటి పరిణామాలతో బద్దశత్రుత్వానికి దారితీసింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను యుద్ధోన్మాదిగా ఐక్యరాజ్యసమితి ముందు నిలబెట్టాలని తమిళనాడు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దీంతో తమిళ జాలర్లపై లంక కసి తీర్చుకుంటోంది. సముద్రంలో చేపలవేటకు వెళ్లే తమిళ జాలర్లపై దాడులకు దిగడం, జైళ్లలోకి నెట్టడం, పడవలు ధ్వంసం చేయడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది. సముద్రంలో చేపలవేట సాగిస్తున్న రామనాథపురం జిల్లా రామేశ్వరానికి చెందిన ఐదుగురు జాలర్లు హెరాయిన్ రవాణా చేరవేస్తున్నారని అభియోగం మోపి, 2011 నవంబరు 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశాయి. 2012 మార్చి 21వ తేదీన దాఖలైన బెయిల్ పిటిషన్‌ను అదే ఏడాది జూన్ 11న కోర్టు కొట్టివేసింది. నాలుగేళ్లుగా ఐదుగురు జాలర్లు శ్రీలంక జైల్లోనే మగ్గుతున్నారు. అరుుతే వీరికి శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30న తీర్పు చెప్పింది. ఉరిశిక్ష ఉదంతం తమిళనాడు ప్రజలను మరింత రెచ్చగొట్టింది. శ్రీలంక కు, భారత్‌లోని ఒక రాష్ట్రానికి (తమిళనాడు) మధ్య రోజు రోజుకూ పెరుగుతున్న వైరం కేంద్ర ప్రభుత్వ మెడకు చుట్టుకుంది. అధికార అన్నాడీఎంకే మొదలుకుని అన్ని పార్టీలు ఐదుగురు జాలర్లకు అండగా నిలిచాయి. అనేక సంఘాలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నాయి. మోదీపై ఒత్తిడి ఉరిశిక్ష పడిన ఐదుగురు జాలర్లు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించేలా శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. అంతేగాక అప్పీలుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెబుతూ రూ.20 లక్షలు మంజూరు చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఒత్తిడి, రాష్ట్ర బీజేపీ శాఖ రాయబారాలు, రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనలతో ఎట్టకేలకూ అంగీకరించిన కేంద్రం అప్పీలుకు మార్గం సుగమం చేసింది. రైల్‌రోకో శ్రీలంక కోర్టులో శిక్షపడిన ఐదుగురు జాలర్లను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ మక్కల్ ఇయక్కం వారు అదివారం రైల్‌రోకో చేపట్టారు. చెన్నై లోకల్ రైల్వే స్టేషన్లో ఉదయం 11 గంటల సమయంలో రైళ్లను ఆపివేసి పట్టాలపై బైఠాయించారు. 70 మంది నిరసనకారులను అరెస్ట్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అలాగే, అంబేద్కర్ న్యాయకళాశాల విద్యార్థులు సోమవారం తరగతులను బహిష్కరించి నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
విడిపించండి
శ్రీలంక కోర్టు తమిళ జాలర్లకు విధించిన ఉరిశిక్షకు ప్రధానిదే బాధ్యత అని ఎండీఎంకే అధినేత వైగో పేర్కొన్నారు. శ్రీలంక తీరును నిరసిస్తూ ఎండీఎంకే ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు సమ్మె పాటిస్తున్న మత్స్యకారులు ఈ నెల 6వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:శ్రీలంకకు హెరాయిన్ చేరవేస్తున్నారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు చెప్పింది. ఈ ఉదంతంపై మండిపడిన రాష్ట్రం ఆగ్రహంతో ఊగిపోయింది. ఎండీఎంకే అధినేత వైగో నగరంలోని వళ్లువర్‌కోట్టం వద్ద తన అనుచరగణంతో మంగళవారం ఆందోళనకు దిగారు. వందలాది మంది కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐదుగురు యువకులు తమ మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ, చేపల వేటకు వెళ్లిన తమిళనాడు జాలర్లపై సాగుతున్న వేధింపు చర్యల్లో భాగంగా శ్రీలంక ఉరిశిక్షను విధించిందన్నారు. ఒక వేళ వారు హెరాయిన్‌ను అక్రమ రవాణా సాగించారని అనుకున్నా, ఇదే మత్తు పదార్థాన్ని అక్రమరవాణా చేస్తూ దేశంలో ఎందరో పట్టుబడ్డారని, వారెవరికీ ఉరిశిక్ష వేసిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శ్రీలంక పట్ల అవలంభిస్తున్న మెతకవైఖరే ఉరిశిక్షకు కారణమని ఆయన దుయ్యబట్టారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు భారతరత్న ప్రకటించాలని ఓ బీజేపీ నేత పేర్కొనగా, ఆ పార్టీ నేతలు ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంలు తమిళ జాలర్లు ఇన్ని అవస్థలు పడుతుండగా, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఇద్దరు సీఎంలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వైగో వ్యాఖ్యానించారు. ప్రజల ముఖ్యమంత్రి అనే నినాదంతో జయలలిత, కన్నీరు పెడుతూ పాలిస్తున్న పన్నీరు సెల్వం మరో ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. ఎంతో హుందాగా బాధ్యతలు నిర్వరిస్తూ ప్రజాసేవ చేయాల్సిన పన్నీర్ సెల్వం కనీసం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేందుకు, చాంబర్ వద్ద జయ బోర్డును తొలగించేందుకు సైతం సాహసం చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఉచిత వస్తువుల పంపిణీని మానేసి, పెరిగిన పాల ధరను తగ్గించాలని వైగో సూచించారు. జాలర్ల ఆమరణ దీక్ష తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు శ్రీలంక ప్రభుత్వం ఉరిశిక్ష విధించడాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా నిరవధిక దీక్షలు నిర్వహిస్తున్న మత్స్యకారులు ఈనెల 6 వ తేదీ నుంచి ఆమరణదీక్షకు పూనుకోవాలని నిర్ణయించారు. నాగపట్నం, కారైక్కాల్, పుదుక్కోట్టై, తంజై, తిరువారూరు జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటను నిషేధించి నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. జాలర్ల సంఘాల ప్రతినిధులు సీఎం పన్నీర్ సెల్వంను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల 6వ తేదీలోగా ఉరిశిక్ష పడిన జాలర్లు విడుదల కాని పక్షంలో అదే రోజు నుంచి ఆమరణ దీక్షకు దిగుతామని మంగళవారం ప్రకటించారు. -
తమిళ జాలర్ల ఉరిశిక్షపై చెన్నైలో ఆందోళనలు
-
భగ్గుమన్న తమిళనాడు.. రెండు బస్సులు దహనం
ఐదుగురు తమిళ జాలర్లకు ఉరిశిక్ష వేయడంపై తమిళనాడు భగ్గుమంటోంది. ప్రధానంగా రామేశ్వరం ప్రాంతంలో మత్స్యకారులు తీవ్ర హింసకు పాల్పడ్డారు. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించారు. దాదాపు 108 జాలర్ల సంఘాలన్నీ కలిసి తీరప్రాంత గ్రామాల్లో ఆందోళన చేపడుతున్నారు. రోడ్లపైకి ఎక్కి విధ్వంసానికి పాల్పడ్డారు. రెండు బస్సులను పూర్తిగా దహనం చేశారు. రైల్వే ట్రాకును కూడా ధ్వంసం చేయడంతో అటువైపు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రామనాథపురం జిల్లాలో విధ్వంసం జరుగుతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో వెళ్లారు. తీరప్రాంతాల్లో ఇప్పటికీ తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. -
శ్రీలంకతో ‘ఢీ’ఎంకే
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ ఈళ ఆదరవాళర్ అమైప్పు (టెసో) పేరుతో డీఎంకే ఎన్నో ఏళ్లుగా నిరసనోద్యమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 26వ తేదీన డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నా అరివాలయంలో సమావేశమై సెప్టెంబరు 3వ తేదీన చెన్నైలో నిరసన చేపట్టాలని నిర్ణయించి పలు తీర్మానాలను చేసింది. తమిళ ఈలం సోదరులు ఆశించే ఆత్మగౌరవంతో కూడిన స్వేచ్ఛా జీవితం కల్పించాలని, శ్రీలంక ఆగడాలు, మానవహక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్య సమితి నియమించిన విచారణ బృందం దేశంలో అడుగిడకుండా అడ్డుకున్న శ్రీలంక అధ్యక్షులు రాజపక్సేపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని, ఐక్యరాజ్యసమితి విచారణ భారత్‌లో జరిపేలా చర్యలు తీసుకోవాలని తదితర తీర్మానాలను చేశారు. అలాగే శ్రీలంక స్వాధీ నంలో ఉన్న తమిళ జాలర్ల మరపడవలను విడిపించాలని, చేపల వేటపై స్వేచ్ఛను ప్రసాదించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాల నేపధ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టెసో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై జిల్లాల నుంచి బుధవారం తెల్లవారుజాము నుంచే టెసో కార్యకర్తలు చేపాక్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి హాజరయ్యూరు. డీఎంకే దక్షిణ చెన్నై కార్యదర్శి జే అన్బళగన్ స్వాగతోపన్యాసం, కోశాధికారి స్టాలిన్ ప్రారంభోన్యాసం చేశారు. సమష్టిగా పోరాడితేనే సాధ్యం : కరుణానిధి సంఘటిత పోరాటం ద్వారా మాత్రమే తమిళ ఈలం సోదరులకు విముక్తి సాధ్యమని టెసో అధినేత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పిలుపునిచ్చారు. టెసో ఆందోళన కార్యక్రమాల్లో చివరగా కరుణ ప్రసంగిస్తూ, దేశాన్ని గతంలో ఎందరో ప్రధానులు పాలించారు, గతంలో వారి కంటే బలమైన ప్రధానిగా ఖ్యాతిని దక్కించుకున్న మోడీ ఈలం తమిళుల సమస్యను పరిష్కరించి ఆ పేరును నిలబెట్టుకోవాలని అన్నారు. డీఎంకే, టెసో నేతలు చేసిన తీర్మానాల్లోని తీవ్రతను ప్రధాని అర్థం చేసుకోవాలని కోరారు. ఈలం సోదరులు శ్రీలంకలో బానిసజీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళులు తమిళులుగా బతకాలని మాత్రమే కోరుకుంటున్నారని, అయితే రాజపక్సే ఇందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. నిరసన వేదిక కు పక్కనే శ్రీలంక దాష్టీకాలను అనుకరిస్తూ కార్యకర్తలు చేసిన ప్రదర్శనలు హృదయాలను ద్రవింపజేశాయి. -
సమ్మె విరమణ
చెన్నై, సాక్షి ప్రతినిధి : రామేశ్వరంలోని మత్స్య కారులు 36 రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం తాత్కాలికంగా విరమించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యథావిధిగా చేపల వేటకు వెళ్లే అవకాశం ఉంది. తమిళ జాలర్లపై శ్రీలంక పాల్పడుతున్న వేధింపులకు నిరసనగానూ, వారి స్వాధీనంలో ఉన్న 62 మర పడవలను అప్పగించాలని డిమాండ్ చేస్తూ జూలై 24న సమ్మె ప్రారంభించారు. సమ్మెలో భాగంగా చేపల వేటను బహిష్కరించారు. మరపడవలతో చేపల వేటపై ఆధారపడి ఒక్క రామేశ్వరంలోనే 30 వేల మత్స్యకార్మికులు ఉన్నారు. వీరికి చేపలు పట్టడం మినహా మరే వృత్తిలోనూ ప్రవేశం లేనందున సమ్మె కాలంలో ఆకలిదప్పులతో అలమటించారు. ఈ సమ్మెపై రామేశ్వరం హార్బర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు ఎన్ దేవదాస్, మరపడవల సంఘం అధ్యక్షుడు బీ శేషురాజా, ప్రధాన కార్యదర్శి ఎస్ ఎమ్రిడ్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా సమ్మె కొనసాగడం వల్ల మత్స్యకారులతోపాటు వారి కుటుంబాల వారు తిండిలేక ఆకలితో అల్లాడుతున్నారని చెప్పారు. ఈ కారణంగా సమ్మెను తాత్కాలికంగా విరమించాలని తామే ఒత్తిడి చేసినట్లు చెప్పారు. సమ్మె కాలంలోనే శ్రీలంక, భారత్ మధ్య చర్చలు కూడా సాగినట్లు వారు తెలిపారు. అలాగే యాళైపానంలో మరోసారి ఇరుదేశాల మధ్య చర్చలు నిర్వహించనున్నారని వారు చెప్పారు. ఈ చర్చల సందర్భంగా శ్రీలంక ఆధీనంలో ఉన్న మర పడవలను తిరిగి అప్పగించే అవకాశం ఉందని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. అంతేగాక తమిళనాడు మత్స్యకారులు శాంతియుత వాతావరణంలో చేపల వేట సాగించేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం జరగవచ్చనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కారణాల దృష్ట్యా జాలర్ల సమ్మెను విరమింపజేసినట్లుగా వారు వివరించారు. ఇది కేవలం తాత్కాలిక విరమణ మాత్రమేనని వారు అన్నారు. శ్రీలంక, భారత్‌ల చర్చలు సామరస్య ఒప్పందానికి దారితీయని పక్షంలో మళ్లీ సమ్మెకు పిలుపునిస్తామని వారు స్పష్టం చేశారు. -
కచ్చదీవుల్లోకి జాలర్లు
సాక్షి, చెన్నై : తమిళ జాలర్లపై శ్రీలంక సేనల పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికార మార్పుతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న ఆశతో ఉన్న జాలర్లకు చివరకు మిగిలింది నిరాశే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర జాలర్లపై మరింతగా శ్రీలంక సేనలు విరుచుకుపడుతూ వస్తున్నారు. సుమారు మూడు వందల మందిని బందీలుగా పట్టుకెళ్లారు. పదుల సంఖ్యలో పడవల్ని స్వాధీనం చేసి తీసుకెళ్లారు. అయితే పడవల్ని తమ వద్దే ఉంచేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడితో కొందర్ని విడుదల చేశారు. సుమారు 94 మంది ఆ దేశంలోని పలు చెరల్లో బందీలుగా ఉన్నారు. తమ మీద వరుసదాడులు జరుగుతుండడంతో విసిగి వేసారిన రామేశ్వరం తీర జాలర్లు సమరానికి రెడీ అయ్యారు. కచ్చదీవుల్లోకి తమకు భద్రత కల్పించాలన్న నినాదంతో సమ్మె బాటపట్టారు. కడలిలో తమకు భద్రత కల్పించే విధంగా భరోసా ఇవ్వడం, లంక సేనల ఆగడాలకు పూర్తిగా కళ్లెం వేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి, పారంపర్యంగా కచ్చదీవుల్లో తమకు కలిగిన చేపలవేట హక్కును పరిరక్షించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలో చేపల వేటాకు అవకాశం, శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్లందర్నీ విడుదల చేయాలని, పడవల్ని తిరిగి అప్పగించాలన్న డిమాండ్‌తో పది రోజులుగా రామేశ్వరం కేంద్రంగా జాలర్లు ఆందోళనలు చేస్తూవస్తున్నారు. చేపల వేటకు దూరంగా సమ్మె బాటలో జాలర్ల పయనించినా, కేంద్రం మాత్రం చోద్యం చూసింది. దీంతో జాలర్లలో ఆగ్రహావేశాలు రగిలాయి. శనివారం వందలాది మంది జాలర్లు తమ కుటుంబాలతో కలసి కచ్చదీవుల బాటపట్టారు. రామేశ్వరం వేర్కొడు హార్బర్ వద్దకు చేరుకున్నాయి. ఉత్కంఠ జాలర్ల సంఘాల నేతల ప్రేమనాథన్, సహాయరాజ్, జేసురాజ్, దేవదాసు, ఆంటోని, మేరి, తమిళనాడు పుదుచ్చేరి జాలర్ల సంఘాల ప్రతినిధి బోసు నేతృత్వంలో జాలర్లు ర్యాలీగా చలో కచ్చదీవు నినాదంతో బయలు దేరారు. పోలీసులు అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల వలయాన్ని ఛేదించి కడలిలోకి వచ్చిన పక్షంలో వారిని అడ్డుకునేందుకు నావికాదళం, భారత కోస్టుగార్డు సిద్ధమైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ ర్యాలీ రామేశ్వరం తీరంలోని వేర్కొడు హార్బర్‌ను సమీపించింది. మంత్రి హామీతో వెనక్కి జాలర్లు కచ్చదీవుల్లోకి పయనం అవుతారా..?, వీరిని ఏ రూపంలో భద్రతా బలగాలు అడ్డుకోనున్నాయో...? అన్న ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందించారు. జాలర్ల సంఘాల ప్రతినిధులతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయొద్దని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుంద్దామని హితవు పలికారు. పది రోజుల్లో శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవల్ని స్వాధీనం చేసుకుని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. జాలర్ల సంఘాల బృందం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలుసుకునేందుకు చర్యలు తీసుకుంటామని సూచించారు. దీంతో జాలర్లు వెనక్కు తగ్గారు. కచ్చదీవుల బాటను వాయిదా వేసుకున్నారు. అయితే, పది రోజుల పాటుగా గడువును కేంద్రానికి వచ్చారు. అంతలోపు పడవులు అప్పగించాలని, సుష్మాస్వరాజ్‌తో సంప్రదింపులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆగిన వేట
తమిళ జాలర్లపై శ్రీలంక దాష్టీకాన్ని నిరసిస్తూ రామనాథపురం, జగదాపట్నానికి చెందిన మత్స్యకారులు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. 15 వేల మంది జాలర్లు సమ్మెలో పాల్గొనగా 14 వేల పడవలు ఒడ్డునే ఉండిపోయాయి. చేపలవేట దాదాపు స్తంభించిపోయింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ జాలర్లు శుక్రవారం నుంచి సమ్మెసైరన్ మోగించారు. శ్రీలంక చెరలో ఉన్న మత్స్యకారులను, స్వాధీనం చేసుకున్న 56 పడవలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏడాదికి ఒకసారి అమలుచేసే చేపల వేట నిషేధం తొలగిపోయిన నాటి నుంచి జాలర్లపై శ్రీలంక దళాలు దాడులు సాగిస్తూనే ఉన్నాయి. ఇటీవల చేపల వేటకెళ్లిన రామేశ్వరం, పంబన్, మండపం, జగదాపట్నం, నాగపట్నం ప్రాంతాలకు చెందిన 200 మంది జాలర్లను శ్రీలంక గస్తీ దళాలు నడి సముద్రంలోనే బందించాయి. వారు ప్రయాణించిన పడవలను స్వాధీనం చేసుకున్నాయి. జాలర్లను శ్రీలంక జైళ్లలోకి తోసేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఒత్తిడితో లంక సైన్యం మెత్తబడింది. కొందరు జాలర్లను మాత్రమే విడిచిపెట్టారు. అయితే వారి జీవనాధారమైన పడవలను మాత్రం స్వాధీనంలోనే ఉంచుకున్నారు. ఇటీవల రామేశ్వరం, జగదాపట్నంకు చెందిన 38 మంది మత్స్యకారులను శ్రీలంక సైన్యం అరెస్ట్ చేసింది. వారి నుంచి 9 పడవలను స్వాధీనం చేసుకుంది. దీంతో శ్రీలంక ఆధీనంలోని పడవల సంఖ్య 56కు చేరింది. శ్రీలంక స్వాధీనంలో ఉన్న పడవలను కాంగేశన్, తలైమన్నార్ హార్బర్లలో పడవేయడంతో వాటిల్లో సముద్రపు నీరుచేరి మునిగిపోయే దశకు చేరుకున్నాయని తమిళ జాలర్లు ఆందోళన చెందుతున్నారు. చేపల వేట వృత్తి నుంచి తమను శాశ్వతంగా దూరం చేసేలా శ్రీలంక వ్యవహరిస్తోందని వారు ఆవేదనకు లోనవుతున్నారు. శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 38 మత్స్యకారులను, 36 పడవలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నుంచి సమ్మె సైరన్ మోగించారు. ఈ సమ్మెలో భాగంగా తమ వద్దనున్న పడవల ఆర్సీ బుక్కులను ఈనెల 28వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా తమ డిమాండ్లు నెరవేరకుంటే ఆగస్ట్ 2వ తేదీన తమ వద్దనున్న సుమారు 14 వేల పడవల్లో తెల్లజెండాలు ఎగురవేసి మూకుమ్మడిగా కచ్చదీవులకు వెళ్లాలని నిర్ణయించారు. సమ్మె కారణంగా చేపల వేట స్తంభించి పోయింది. చిన్న, చిన్న చేపల వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. మత్స్య పరిశ్రమకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. -
37 మంది జాలర్ల విడుదల
టీ.నగర్ : అరెస్టయిన తమిళజాలర్లు 37 మందిని శ్రీలంక ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జాలర్లు కచ్చదీవి సమీపంలో చేపలు పడుతున్న సమయం లో శ్రీలంక నావికాదళం చెర పట్టడం సర్వసాధారణమైపోయింది. ఈ సంఘటనల్లో జాలర్ల వలలను నావికాదళం ధ్వంసం చేస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ జాలర్లు అనేకసార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు. గత నెల 29వ తేదీ కచ్చదీవి సమీపంలో చేపలు పడుతున్న రామేశ్వరం జాలర్లు 17 మందిని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. గత 5వతేదీ రామేశ్వరం, మం డపం జాలర్లు కచ్చదీవి సమీపంలోచేపలు పడుతుండగా శ్రీలంక నావికాదళ సిబ్బంది 20 మంది జాలర్లను అరెస్టు చేసింది. వారిని విడుదల చేయాలని కోరుతూ రామేశ్వరం జాలర్లు ఒక సమావేశం జరిపారు. 20వ తేదీలోగా జాలర్లును విడిపించాలని, లేనిపక్షంలో 21 వ తేదీ జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ మరపడవల దస్తావేజులను అప్పగించనున్నట్లు ప్రకటించారు. 26వ తేదీ పడవల్లో కచ్చదీవికి వెళ్లి ఆశ్రయం పొందనున్నట్లు తీర్మానించారు. 37 మంది జాలర్లను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జయలలిత కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీకి మళ్లీ లేఖ రాశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం శ్రీలంకతో చర్చలు జరిపింది. శ్రీలంకలో జైళ్లలో మగ్గుతున్న 37 మంది జాలర్లను శుక్రవారం తలైమన్నార్ కోర్టులో హాజరు పరచారు. వారిని శ్రీలంక ప్రభుత్వం సిఫార్సుల మేరకు విడుదల చేస్తూ మన్నార్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో 37 మంది జాలర్లు భారత నావికాదళానికి శుక్రవారం అప్పగించారు.