జాలర్లకు చిత్రహింసలు
శ్రీలంక దళాల తీరుతో వేదనకు గురవుతున్న తమిళ జాలర్ల బతుకులు అరబ్ దేశీయుల చేతుల్లో చిక్కి చిన్నాభిన్నమవుతున్నాయి. బతుకుదెరువు కల్పిస్తామని 25 మంది జాలర్లను ఆ దేశానికి తీసుకెళ్లి, చిత్ర హింసలకు గురిచేసిన వైనం శనివారం వెలుగులోకి వచ్చింది. జాలర్లు పడుతున్న నరకయాతనను వీడియో తీసి పంపించడం గమనార్హం.
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఐక్య అరబ్‌దేశంలోని అజ్మన్ హార్బర్‌లో చేపలుపట్టే పనికి కన్యాకుమారి జిల్లా బుద్దన్ హార్బర్‌కు చెందిన ఆలి, అంతోని తదితర 25 మంది జాలర్లు వెళ్లారు. ఈ 25 మందితోపాటూ అజ్మన్ హార్బర్‌కు చెందిన ఇద్దరు జాలర్లు పడవలో ఆ దేశ సముద్రంలోకి చేపలవేటకు వెళ్లారు. వారిలో ఒకరు అకస్మాత్తుగా సముద్రంలోకి జారిపడిపోగా తమిళ జాలర్లు రక్షించేలోగా గల్లంతయ్యూడు. దీంతో పడవ యజమానులు అలి మదార్, జమాల్ అలీమదార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిచ్చిన ఫిర్యాదుతో తమిళనాడుకు చెందిన జాలర్లను అందరినీ పోలీస్ స్టేషన్‌కు పిలి పించి విచారించారు. వారందరి పాస్‌పోర్టులను పడవ యజమానులు స్వాధీనం చేసుకున్నారు.
అరబ్‌దేశాల్లో పనిచేసేందుకు జారీచేసిన ఒప్పం ద పత్రాలను లాక్కుని 25 మంది తమిళ జాలర్లు స్వదేశాలకు వెళ్లేందుకు వీలులేకుండా చేశారు. పడవ యజమానులు అలి మదార్, జమాల్ అలీమదార్ 25 మంది జాలర్లను తమ పడవలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. జాలర్లు పడుతున్న నరకయూతన దృశ్యాలను తన సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి బాధితుల కుటుంబాలకు పంపారు. పొట్టకూటి కోసం పొరుగుదేశానికి వెళ్లిన తమ వారు పడుతున్న చిత్రహింసలను చూసి తమిళనాడులోని వారి బంధువులు తల్లడిల్లిపోయారు. తమను హింసించవద్దని కాళ్లావేళ్లాపడుతున్నా వినిపించుకోకుండా దాడులకు పాల్పడుతున్న వైనాన్ని కళ్లారాచూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అరబ్ దేశంలో చిక్కుకున్న తమ వారిని వెంటనే రక్షించి తమిళనాడుకు చేర్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
సమ్మె విరమించిన కడలూరు జాలర్లు
పలు సమస్యల పరిష్కారం కోసం కడలూరు జాలర్లు 9 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను శనివారం విరమించారు. కడలూరు, విళుపురం, పుదుచ్చేరీ, తదితర సముద్ర తీర ప్రాంతాల్లో ప్రధాన ద్వారాలను గుర్తించాలని, 200 మీటర్ల దూరం వరకు ప్రహరీ గోడ నిర్మించాలని, రాత్రి వేళల్లో హార్బర్ ప్రధాన ద్వారాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లపై సమ్మె ప్రారంభించారు. కడలూరు జిల్లా సహాయ కలెక్టర్ షర్మిల, ఇతర అధికారులు ఇటీవల జరిపిన చర్చలు విఫలమయ్యూరుు. ఈనెల 6వ తేదీలోగా తమ కోర్కెలను నెరవేర్చకుంటే జిల్లా వ్యాప్తంగా వాహనాల రాకపోకలను స్తంభింపజేస్తామని, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జాలర్ల సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపధ్యంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రి సంపత్ ఆధ్వర్యంలో చర్చలు సాగాయి. ఈ నెలాఖరులోగా జాలర్ల ఆరు డిమాండ్లను నెరవేరుస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించారు.