రామేశ్వరం: తమ సముద్రజలాల్లోకి అక్రమంగా చొరబడ్డారనే కారణంతో 12 మంది తమిళ జాలర్లను శ్రీలంక బుధవారం అరెస్ట్ చేసింది. అరెస్టయిన వారంతా ఉత్తర తలైమన్నార్ ప్రాంతానికి చెందిన వారని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 20 మందితో కూడిన జాలర్ల బృందం బుధవారం తమిళనాడు పంబాన్ ప్రాంతం నుంచి రెండు పడవలతో చేపల వేటకు బయలుదేరింది. వేట కొనసాగిస్తుండగా వీరి పడవలను శ్రీలంక నేవీ అధికారులు చుట్టముట్టి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 8 మంది తప్పించుకున్నారు.