
కొలంబో : సాధారణంగా పోలీసులు దొంగలను తరుముతుంటారు. అప్పుడప్పుడు దొంగలే పోలీసులను తరుముతున్నట్లు కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. అయితే, శ్రీలంకలో మాత్రం ఈ రెండు రకాల సంఘటనలు కాకుండా భిన్నమైన చోటుచేసుకుంది. పోలీసులకు ఏనుగులు చుక్కలు చూపించాయి. గంజాయి తోటను గుర్తించిన పోలీసులు దాని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పెద్ద పెద్ద ఏనుగులు వారికి తారస పడ్డాయి.
అవి చూసిందే తడవుగా వారివైపు మెల్లగా రావడం మొదలుపెట్టాయి. కాసేపట్లో వాటి వేగం పెంచడంతో చచ్చాం దేవుడో అనుకొని తమ తుపాకులను సైతం అక్కడ పడేసి పరుగులు తీయడం పోలీసుల వంతైంది.
‘అనూహ్యంగా ఏనుగులు దాడికి దిగడంతో కానిస్టేబుళ్లు వారి తుపాకులను వదిలేసి పరుగులు పెట్టి తమ ప్రాణాలు రక్షించుకున్నారు’ అని ఓ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment