రమిత్ రామ్‌బుక్వెల్లా(ఫైల్‌ఫొటో)
కొలంబో: తాగి కారు నడపడమే కాకుండా ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులపై దాడికి పాల్పడిన శ్రీలంక క్రికెటర్ రమిత్ రామ్‌బుక్వెల్లాను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన తర్వాత కొలంబోని నవాలా రహదారిపై వెళుతున్న సమయంలో రమిత్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు తెలిపారు. అతన్ని అలుత్‌కేడ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీస్ అధికారి పేర్కొన్నారు. రమిత్ తాజా వ్యవహారంపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రమిత్‌పై చర్యలు తీసుకుంటామని లంక బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా శ్రీలంక క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాలో రమిత్ చోటు కోల్పోయే అవకాశం ఉంది. రెండేళ్ల క‍్రితం ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకసారి అరెస్టైన రమిత్..తాజాగా మరో వివాదానికి కారణమయ్యాడు.
2013లో శ్రీలంక జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన రమిత్.. 2016 జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారి కనిపించాడు. శ్రీలంక తరపును రెండు టీ 20ల్లో మాత్రమే రమిత్ ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment