చివరి టి20లో లంకపై గెలుపు
అడిలైడ్: శ్రీలంకతో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు ఫాల్క్‌నర్ (3/20), జంపా (3/25) లంకేయుల్ని కట్టడి చేయడంతో ఆస్ట్రేలియా వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 2–1తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది.
ఓపెనర్లు క్లింగర్ (43 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్), ఫించ్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. మలింగ, షణక చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18 ఓవర్లలో 146 పరుగుల వద్ద ఆలౌటైంది. సిరివర్ధన (35), మునవీర (37) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
ఆసీస్‌కు వైట్‌వాష్ తప్పింది
Published Thu, Feb 23 2017 1:02 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement
Advertisement